
ఆమిర్‌కు డ్రెస్!
హమ్మయ్య... ఆమిర్‌ఖాన్ చూడాలంటే ఇక ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు ‘పీకే’ పోస్టర్లపై నగ్నంగా దర్శనమిచ్చిన ఈ స్టార్... తాజాగా మరో స్టిల్ రిలీజ్ చేశాడు. అందులో ఫుల్లుగా బట్టలు వేసుకుని కనిపించాడు. అదీ పోలీస్ ఆఫీసర్ స్టిల్‌లో.. గంభీరంగా. ముందున్న దానికి... లేటెస్ట్‌గా విడుదల చేసిన స్టిల్‌కు ఏమాత్రం పొంతన లేదు. మరో విశేషమేమంటే సూపర్ హీరో సంజయ్‌దత్ కూడా ‘పీకే’ పోస్టర్‌పైకి ఎక్కాడు. బ్యాండ్ మేళం డ్రెస్‌లో బూర ఊదుతూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.