
‘పీకే’ పైరసీ సినిమా చూసిన అఖిలేశ్!
బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ చిత్రాన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని చూసినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పేర్కొనడం వివాదాస్పదమైంది.
లక్నో: బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ చిత్రాన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని చూసినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పేర్కొనడం వివాదాస్పదమైంది. ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ప్రకటించే క్రమంలో అఖిలేశ్ మాట్లాడుతూ ‘కొన్ని రోజుల కిందట ఈ సినిమాను నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నా దీన్ని చూసేందుకు మాత్రం గత రాత్రే సమయం లభించింది’ అని అన్నారు. అఖిలేశ్‌పై కేసు పెట్టాలని తహ్రీర్ అనే హక్కుల సంఘం నేత సంజయ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూఎఫ్‌వో మూవీజ్ ద్వారా సినిమాలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అఖిలేశ్ లెసైన్స్ కలిగి ఉన్నారని సీఎం కార్యాలయం తెలిపింది.