
'నాకు 'పీకే' అంతగా నచ్చలేదు'
న్యూఢిల్లీ: బాహుబలి చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరకానున్న టాలీవుడ్ హీరో ప్రభాస్ హిందీ సినిమాలను కూడా ఎక్కువగానే చూస్తాడట. అయితే ప్రభాస్ కు ఇటీవల వచ్చి సంచలనం విజయం సాధించిన అమిర్ ఖాన్ 'పీకే' సినిమా నచ్చలేదట. తాను మొత్తంగా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ చిత్రాలను ఇష్టపడతానని.. కాగా, ఆయన దర్శకత్వంలో వచ్చిన పీకే మూవీ మాత్రం తనను అంతగా ఆకట్టుకోలేదన్నాడు. అంతకుముందు రాజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, అరౌండ్ 20 టైమ్స్ చిత్రాలు తనకు బాగా నచ్చాయన్నాడు.
బాహుబలి చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న కరణ్ జోహార్ పై ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కరణ్ జోహార్ గొప్ప వ్యక్తి అని..అటువంటి వ్యక్తి తమ సినిమా గురించి, రాజమౌలి గురించి గొప్పగా మాట్లాడటం ఆనందంగా ఉందని ప్రభాస్ తెలిపాడు.