పీకే సినిమా డౌన్లోడ్ చేసి చూశా: సీఎం | i have downloaded pk movie, says up cm | Sakshi
Sakshi News home page

పీకే సినిమా డౌన్లోడ్ చేసి చూశా: సీఎం

Published Fri, Jan 2 2015 3:50 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పీకే సినిమా డౌన్లోడ్ చేసి చూశా: సీఎం - Sakshi

పీకే సినిమా డౌన్లోడ్ చేసి చూశా: సీఎం

అమీర్ఖాన్ సంచలనాత్మకంగా తీసిన 'పీకే' సినిమా అనేక వివాదాలకు కారణం అవుతోంది. తాజాగా ఓ ముఖ్యమంత్రి ఈ సినిమాకు సంబంధించిన వివాదంలో పీకల్లోతు కూరుకుపోయారు. సినిమా గురించి బాగా చెప్పాలనుకున్నారో ఏమో గానీ.. ఎత్తెత్తి ఎంగిలాకులో కాలేసినట్లు.. తాను సినిమాను డౌన్లోడ్ చేసుకున్నానని, కానీ చూడటానికి మాత్రం సమయం చిక్కడంలేదని అన్నారు. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరని చూస్తున్నారా? ఇటీవలే పీకే సినిమాకు పన్ను రాయితీలు ప్రకటించిన యూపీ సీఎం అఖిలేష్ యాదవ్.

ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుందని, అందుకే తమ రాష్ట్రంలో దానికి వినోద పన్ను మినహాయింపు ఇచ్చామని చెబుతూ.. అదే సందర్భంలో నోరు జారారు. చాలా రోజులనుంచి తనను ఈ సినిమా చూడాల్సిందిగా చెబుతున్నారని, అందుకే తాను కొన్ని రోజుల క్రితమే సినిమా డౌన్ లోడ్ చేసుకున్నానని, కానీ ఇన్నాళ్ల బట్టి సమయం దొరక్క గత రాత్రి మాత్రమే చూశానని చెప్పారు. వెంటనే సినిమా నచ్చడంతో దానికి పన్ను రాయితీ ప్రకటించానని, దానివల్ల మరింతమంది సినిమా చూసే అవకాశం దొరుకుతుందని సెలవిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement