
పీకే రీమేక్ లో కమల్ హాసన్?
చెన్నై: కమలహాసన్ అద్భుతమైన నటుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. విలక్షణమైన నటనతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరుచుకున్న కమల్.. వైవిధ్యభరితమైన పీకే రీమేక్ లో నటించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈమధ్యనే బాలీవుడ్ లో తెరెకెక్కి సంచలన విజయాన్ని నమోదు చేసిన పీకే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాణం సంస్థ జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది.
ఇందులో భాగంగానే కమల్ హాసన్ ను ఆ సంస్థ సంప్రదించినట్లు.. అందుకు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర దర్శకుడు కమల్ ను పిలిచే చర్చించారని.. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతున్నట్లు తెలుస్తోంది.