కండల వీరుడి కొత్త అవతారం | Salman supervising editing for prem ratan dhan payo | Sakshi
Sakshi News home page

కండల వీరుడి కొత్త అవతారం

Published Sat, Aug 29 2015 8:59 AM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

కండల వీరుడి కొత్త అవతారం

కండల వీరుడి కొత్త అవతారం

'బజరంగీ భాయిజాన్'  విజయం కండల వీరుడు సల్మాన్ ఖాన్కు కొత్త కిక్ ఇచ్చింది. చాలా రోజులుగా వివాదాలతో ఇమేజ్ పాడు చేసుకున్న సల్మాన్ ఈ మూవీ సక్సెస్తో ఒక్కసారిగా అభిమానులతో పాటు సినీ, రాజకీయవర్గాలకు చెందినవారి మనసు కూడా గెలుచుకున్నాడు. అందుకే తన తదుపరి సినిమాలు కూడా అన్ని వర్గాలను అలరించేవిగా ఉండాలని తెగ కష్టపడిపోతున్నాడు. దాంతో యాక్టింగ్తో పాటు మేకింగ్ విషయంలో కూడా తన మార్క్ కనిపిచేలా జాగ్రత్త పడుతున్నాడు సల్లూబాయ్..

ఇప్పటి వరకు నటుడిగానే కొనసాగిన కండల వీరుడు ప్రస్తుతం ఇండస్ట్రీలోని ఇతర రంగాల మీద కూడా పట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. హీరోగా చాలా అనుభవం ఉన్న సల్మాన్ నిర్మాతగా కూడా సక్సెస్ సాదించాడు. తనకున్న మాస్ ఇమేజ్కు భిన్నంగా ఓ ఎమోషనల్ ట్రావెల్ డ్రామను నిర్మించి సమ్ థింగ్ స్పెషల్ అని ప్రూవ్ చేసుకున్నాడు. బజరంగీ భాయిజాన్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాసిన సల్మాన్ తన ప్రొడక్షన్ లో వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం ఆదిత్య పంచోలి తనయుడు  సూరజ్ పంచోలిని హీరోగా  పరిచయం చేస్తూ నిర్మిస్తున్నచిత్రం కోసం సల్మాన్ ఖాన్ గాయకుడిగా కూడా మారాడు. అంతేకాకుండా ఎడిటింగ్ను కూడా తానే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.  అలాగే సల్మాన్ హీరోగా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' ఎడిటింగ్ కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇటీవలే ఈ సినిమా రషెస్ చూసిన అతడు స్వయంగా ఎడిటింగ్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే హీరో నుంచి నిర్మాతగా మారిన సల్మాన్, గాయకుడిగా, ఎడిటర్గా కూడా మారటంతో ముందు ముందు ఇంకెన్ని అవతారాలు చూపిస్తాడో తెలియాలంటే వెయిట్ అండ్ సీ...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement