'ఈ గౌరవం పొందటానికి చాలా ఏళ్లు పట్టింది' | salman khan about hollywood entry | Sakshi
Sakshi News home page

'ఈ గౌరవం పొందటానికి చాలా ఏళ్లు పట్టింది'

Published Tue, Nov 17 2015 11:05 AM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

'ఈ గౌరవం పొందటానికి చాలా ఏళ్లు పట్టింది'

'ఈ గౌరవం పొందటానికి చాలా ఏళ్లు పట్టింది'

ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సల్లూభాయ్, ఫ్లాప్ సినిమాలతో కూడా వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించేస్తున్నాడు. తాజాగా ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ప్రూవ్ చేసుకున్న సల్మాన్, తన హాలీవుడ్ ఎంట్రీపై మాట్లాడాడు.

'హాలీవుడ్లో నటులు చాలా కష్టపడి సినిమా చేస్తారు. మన దగ్గర సక్సెస్ అవ్వడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. హాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి, అక్కడ ఈ స్థాయి గౌరవం పొందడానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఇంత సక్సెస్, మర్యాద ఉన్నప్పుడు హాలీవుడ్కు వెళ్లాల్సిన పని ఏంటి..? ఇక్కడ ఈ స్థాయిని సాధించడానికి చాలా ఏళ్లు కష్టపడ్డాం.. మళ్లీ అక్కడ కూడా కష్టపడటం ఎందుకు..?' అంటూ తనకు హాలీవుడ్ వెళ్లే ఉద్దేశం లేదని తేల్చేశాడు సల్మాన్ ఖాన్.

సల్మాన్ కొత్త సినిమా తొలి వారంలోనే 130 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం సుల్తాన్ సినిమాలో నటిస్తున్న కండల వీరుడు, ఆ సినిమాలో మరింత భారీ ఖాయంతో కనిపించటం కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈసినిమాను 2016 రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement