
‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’కు డాక్టర్ ఆర్థో ప్రమోషన్..!
సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రానికి కో-ప్రమోటర్‌గా వ్యవహరించనున్నట్లు ప్రముఖ నొప్పి నివారిణి డాక్టర్ ఆర్థో ఉత్పత్తి సంస్థ- ఎస్‌బీఎస్ బయోటెక్ ప్రకటించింది. కుటుంబం మొత్తం ఐకమత్యంగా మెలగడానికి, సుఖ సంతోషాలతో జీవించడానికి చిత్రంలో కథానాయకుడు చేసే ప్రయత్నానికి సంబంధించిన కథాంశం సంస్థను ఆకర్షించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే స్ఫూర్తితో డాక్టర్ ఆర్థో కూడా పలు వయస్సుల వారికి వచ్చే నొప్పులను దూరం చేస్తూ... వారి సుఖ సంతోషాలకు పాటు పడుతోందని పేర్కొంది. ఎనిమిది రకాల సమర్థవంతమైన మూలికలతో కూడిన ఔషధం ద్వారా... నాసి రకం మందులు మనుషులపై ప్రభావం చూపకుండా తన వంతు కృషి చేస్తోందని వివరించింది.