వందకోట్ల క్లబ్బులోకి తొమ్మిదోసారి! | Salman Khan's Prem Ratan 100 Crore Box Office Dhan Payo | Sakshi
Sakshi News home page

వందకోట్ల క్లబ్బులోకి తొమ్మిదోసారి!

Published Sun, Nov 15 2015 7:45 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

వందకోట్ల క్లబ్బులోకి తొమ్మిదోసారి!

వందకోట్ల క్లబ్బులోకి తొమ్మిదోసారి!

బాలీవుడ్ సూపర్‌ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మధ్య నటిస్తున్న ప్రతి చిత్రం వందకోట్ల క్లబ్బులో చేరుతున్నది. తాజాగా ఆయన నటించిన 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' కూడా మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తొలిమూడు రోజుల్లోనే వందకోట్ల కలెక్షన్ రాబట్టింది. సూరజ్‌ బర్జాత్యా దర్శకత్వంలో సల్మాన్, సోనం కపూర్ జంటగా నటించిన 'ప్రేమ్‌రతన్‌ ధన్‌పాయో' దీపావళి కానుకగా ఈ నెల 12న విడుదలైంది.

పండుగరోజు వసూళ్లు పెద్దగా ఆకట్టుకోకపోయినా వీకెండ్‌ కలెక్షన్లు భారీగా వచ్చాయి. దేశీయ మార్కెట్‌లో ఈ సినిమా రూ. 101.47 కోట్లు వసూలు చేయగా, విదేశాల్లో గురు, శుక్రవారాల్లో రూ. 25.58 కోట్లు వసూలు చేసింది. తొలిరెండు రోజుల వసూళ్ల విషయంలో ఈ సినిమా ఇప్పటికే సల్మాన్ బ్లాక్‌బ్లాస్టర్‌ హిట్ బజరంగీ భాయ్‌జాన్‌ను దాటేసింది.

గతంలోనూ సల్మాన్‌ఖాన్‌ పలు సినిమాలు వందకోట్ల క్లబ్బులో చేరాయి. 'ప్రేమ్‌రతన్‌ ధన్‌పాయో' ఈ క్లబ్బులో చేరిన ఆయన తొమ్మిదో సినిమా. అదేవిధంగా వందకోట్లు వసూలు చేసిన ఐదో సినిమా. 2015లో ఇప్పటివరకు భజరంగీ భాయ్‌జాన్, తను వెడ్స్ మను రిటర్న్స్, బాహుబలి (హిందీ), ఏబీసీడీ-2 సినిమాలు వందకోట్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement