విజయ్ ది గోట్ మూవీ.. తొలి రోజు ఊహించని కలెక్షన్స్‌! | Vijay film The Goat World Wide Collections On Day one | Sakshi
Sakshi News home page

The Goat Collections: 'ది గోట్' మూవీ కలెక్షన్స్‌.. ఆ సినిమాను దాటలేకపోయింది!

Published Fri, Sep 6 2024 9:23 AM | Last Updated on Fri, Sep 6 2024 10:39 AM

Vijay film The Goat World Wide Collections On Day one

కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం  ది గోట్‌. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేశారు. భారీ బడ్జెట్‌ సినిమా కావడంతో గోట్‌ అభిమానుల్లో మరింత అంచనాలు పెంచేసింది. టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఇండియన్‌-2 సినిమాను అధిగమించి రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసింది.

అంచనాలకు తగ్గట్టుగానే తొలిరోజు కలెక్షన్ల గోట్ దూసుకెళ్లింది. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన గోట్‌ చిత్రానికి ఇండియాలో రూ.55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ రాగా.. రూ.43 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. తమిళంలో రూ.38.3 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్టు కలెక్ట్ చేసింది. మొదటి రోజు థియేటర్లలో 76.23 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముంది. ఓవర్‌సీస్‌ కలెక్షన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే మరిన్నిరికార్డులు బద్దలు కొట్టనుంది. అయితే తొలిరోజు విజయ్ లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.148.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ రికార్డ్‌ను గోట్ అధిగమించలేకపోయింది.  ఈ సినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై దాదాపు రూ.380 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ విషయాన్ని  నిర్మాత అర్చన కల్పతి  ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, జయరామ్, లైలా, అజ్మల్ అమీర్ కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement