అమూల్యమైన ప్రేమ నాకు దక్కింది! | Excited about 'Prem Ratan Dhan Payo': Sonam Kapoor | Sakshi
Sakshi News home page

అమూల్యమైన ప్రేమ నాకు దక్కింది!

Published Wed, Apr 2 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

అమూల్యమైన ప్రేమ నాకు దక్కింది!

అమూల్యమైన ప్రేమ నాకు దక్కింది!

సూరజ్ బర్జాత్యా చిత్రంలో కథానాయికగా అవకాశం రావడమంటే సదరు హీరోయిన్‌కు సుడి తిరిగినట్టే. భాగ్యశ్రీ, మాధురీదీక్షిత్, కరిష్మాకపూర్, కరీనా కపూర్... వీరందరూ సూరజ్ సినిమాల్లో నటించి పేరు సంపాదించుకున్నవారే. త్వరలో ఆ జాబితాలోకి అనిల్‌కపూర్ కుమార్తె సోనమ్‌కపూర్ కూడా చేరబోతున్నారు. సూరజ్ బర్జాత్యా చిత్రంలో ఛాన్స్ కొట్టేశారామె. పైగా ఈ సినిమాలో కథానాయకుడు ఎవరనుకున్నారు? బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్. ఇందులో సల్మాన్ ద్విపాత్రాభినయం చేస్తుండటం మరో విశేషం. ఇందులో ఓ పాత్ర పేరు ‘ప్రేమ్’. సూరజ్ దర్శకత్వంలో సల్మాన్ ఇప్పటికి మూడు సినిమాల్లో నటించారు. 
 
 ఆ మూడింటిలో ఆయన పేరు ప్రేమ్. ఈ నాలుగో సినిమాలో కూడా సల్మాన్ పాత్ర పేరు ‘ప్రేమ్’ కావడం విశేషం. మరో పాత్ర ‘విజయ్’. ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ అనే టైటిల్‌ని కూడా సూరజ్ ఖరారు చేశారు. ‘అమూల్యమైన ప్రేమ్ ప్రేమ నాకు దక్కింది’ అని ఈ టైటిల్‌కి అర్థం. ‘పాయోజీ రామ్ రతన్ ధన్ పాయో’ అని సాగే మీరాబాయి కీర్తన నుంచి స్ఫూర్తి పొంది ఈ టైటిల్‌ని ఖరారు చేశారాయన. ఈ సినిమాలో నాయికగా నటిస్తుండటంతో సోనమ్ ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ‘‘‘హమ్ ఆప్‌కే హై కౌన్’లోని ‘దీదీ తేరా దేవర్ దీవానా’ పాట, ఆ పాటలో ఆకుపచ్చ డ్రస్‌లో మాధురీ దీక్షిత్.. నేను జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం అది. నేనే గనుక నటినైతే... ఎప్పటికైనా ఇలాంటి దుస్తుల్ని ధరించి, అంత మంచి పాటలో నర్తించి, మాధురిలా మన్ననలను పొందాలని కలలు కనేదాన్ని. ఆ కోరిక ఇంత తేలిగ్గా నెరవేరుతుందనుకోలేదు’’ అని ఆనందం వ్యక్తం చేశారు సోనమ్. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement