టార్గెట్‌లో త్రీ కిలోస్‌ బ్యాలెన్స్‌! | Kareena Kapoor and Sonam Kapoor to start 'Were the Wedding' shooting in August | Sakshi
Sakshi News home page

టార్గెట్‌లో త్రీ కిలోస్‌ బ్యాలెన్స్‌!

Published Mon, Jun 5 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

టార్గెట్‌లో త్రీ కిలోస్‌ బ్యాలెన్స్‌!

టార్గెట్‌లో త్రీ కిలోస్‌ బ్యాలెన్స్‌!

ఏదో ఫ్యాషన్‌ షోలో పిల్లాణ్ణి చంకలో పెట్టుకుని క్యాట్‌ వాక్‌ చేస్తున్నట్టు... చేతుల్లో తైమూర్‌ను ఎత్తుకుని చక చకా అడుగులేస్తున్న కత్తిలాంటి కరీనా కపూర్‌ను చూసి బీ–టౌన్‌ ఖంగుతింది. హిందీ నటుడు తుషార్‌ కపూర్‌ కుమారుడి ఫస్ట్‌ బర్త్‌డే ఫంక్షన్‌కు కుమారుడు తైమూర్‌ను తీసుకొచ్చిన కరీనాను చూసి... ‘‘వార్నీ! కరీనాలో ఎంత మార్పు. ఈవిణ్ణి ఆర్నెల్ల పిల్లాడికి తల్లంటే ఎవరూ నమ్మరు’’ అంటూ బీ–టౌన్‌లో ఒకటే డిస్కషన్‌.


మేటర్‌ ఏంటంటే... ప్రెగ్నెన్సీ టైమ్‌లో కరీనా 18 కిలోలు బరువు పెరిగారు. మహిళలందరూ ప్రెగ్నెన్సీ టైమ్‌లో బరువు పెరగడం కామన్‌. డెలివరీ తర్వాత ఆ బరువు తగ్గడానికి కొంచెం టైమ్‌ పడుతుంది. కానీ, కరీనా మాత్రం స్పీడుగా బరువు తగ్గుతున్నారు. డెలివరీ తర్వాత రెండు నెలలు రెస్ట్‌ తీసుకున్న కరీనా, గత మూడు నెలలుగా జిమ్‌లో బాగా చెమట చిందిస్తున్నారు. రెగ్యులర్‌గా యోగా చేస్తున్నారు. రిజల్ట్‌... మూడు నెలల్లో 16 కిలోలు తగ్గారు. టోటల్‌గా 19 కిలోలు తగ్గాలని కరీనా టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఎందుకంటే... ఆగస్టులో సోనమ్‌కపూర్‌ కలసి నటించనున్న ‘వీరే ది వెడ్డింగ్‌’ షూటింగ్‌ మొదలు కానుంది. అందులో మునుపటిలా, స్లిమ్‌గా కనిపించాలని డిసైడ్‌ అయ్యారు. మూడు నెలల్లో 16 కిలోలు తగ్గిన కరీనాకు... మరో రెండు నెలల్లో మూడు  కిలోలు తగ్గడం పెద్ద కష్టం కాదేమో కదా!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement