న్యూఢిల్లీ: దేశంలో విక్రయించే పొగాకు ఉత్పత్తుల ప్యాక్‌లపై డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ‘టొబాకో కాజెస్ పెయిన్‌ఫుల్ డెత్’ అనే కొత్త ఆరోగ్య హెచ్చరిక, కొత్త చిత్రం ముద్రితమవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అవి ఏడాది పాటు కొనసాగుతాయని వివరించింది. 2023 డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ప్రమాదాన్ని తెలిపే మరో కొత్త చిత్రంతోపాటు ‘టొబాకో యూజర్స్ డై యంగర్’ అని ముద్రితమవుతుందని పేర్కొంది.
ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సిగరెట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ రూల్స్–2008 చట్టానికి 2022 జూలై 21వ తేదీన చేసిన సవరణ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది. పొగాకు ఉత్పత్తుల తయారీదారు, దిగుమతి దారు, పంపిణీదారులు ఎవరైనా సరే ఈ హెచ్చరికలను ముద్రించకుంటే జైలు శిక్ష, జరిమానా విధించేందుకు చట్టం వీలు కల్పిస్తోందని హెచ్చరించింది.
ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు
Comments
Please login to add a commentAdd a comment