మురుగదాస్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు | Srireddy Sensational Comments On Murugadas | Sakshi
Sakshi News home page

మురుగదాస్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published Wed, Jul 11 2018 7:34 PM | Last Updated on Wed, Jul 11 2018 7:54 PM

Srireddy Sensational Comments On Murugadas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌పై గళమెత్తి పలువురు హీరోలు, దర్శక నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా ప్రముఖ దర్శకుడు స్టార్‌ హీరోలతో భారీ సినిమాలను తెరకెక్కించిన ఏఆర్‌ మురుగదాస్‌పై ఆరోపణలు చేశారు. హాయ్‌ మురుగదాస్‌ అంటూ మొదలెట్టిన శ్రీరెడ్డి గ్రీన్‌ పార్క్‌ హోటల్‌ విషయం మీకు గుర్తుందా అంటూ బాంబు పేల్చారు.

రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ ద్వారా మనం కలిశామని, తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారని మురుగదాస్‌కు గుర్తుచేశారు. ఆ రోజు హోటల్‌లో మనం చాలా...అయినా ఇప్పటి వరకూ మీరు ఎలాంటి ఆఫర్‌ ఇవ్వలేదు..మీరు చాలా గొప్ప వ్యక్తి సార్‌ అంటూ ముగించారు.మరి తనపై చేసిన సంచలన ఆరోపణలకు మురుగదాస్‌ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. పవన్‌ కళ్యాణ్‌, నాని సహా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement