
దర్శకుడు మురుగదాస్
గురువారం రాత్రి చెన్నైలో దర్శకుడు మురుగదాస్ ఇంటి వద్ద చిన్నపాటి డ్రామా నడిచింది. తన లేటెస్ట్ చిత్రం ‘సర్కార్’తో తమిళనాడులో పొలిటికల్ పార్టీల ఆగ్రహానికి గురయ్యారని, అందుకే ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లారని సమాచారం. ఈ విషయాన్ని ‘సర్కార్’ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ‘మురగదాస్‌ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటివద్దకు వెళ్లారు’ అని ట్వీట్ చేశారు. ఆ వెంటనే ‘‘మా ఇంటికి పోలీసులు వచ్చారు. నేను లేనని తెలుసుకొని తిరిగి వెళ్లిపోయారు’ అని మురుగదాస్ ట్వీట్ చేశారు. ఈ పరిస్థితుల్లో మురుగదాస్ ముందస్తు బెయిల్‌కి దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 27 వరకూ ఆయన్ని అరెస్ట్ చేయకూడదని చెన్నై కోర్ట్ ఆదేశించింది. ఈ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ చేసి, మూడు సన్నివేశాల్లో చిన్న కట్స్ చేయమని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment