
మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ దసరా ఉత్సవాల కోసం మైసూరులో గజరాజులు వివిధ రకాల శిక్షణలో నిమగ్నమయ్యాయి. 14 ఏనుగుల తాలీము జోరుగా కొనసాగుతోంది. సోమవారం కుశాల తోపులో గజరాజులు, గుర్రాల ముందు ఫిరంగి పేలుళ్లను నిర్వహించారు. దసరా రోజున జంబూసవారీ ఊరేగింపులో ఫిరంగులను పేలుస్తారు, వాటి శబ్ధాలకు అలవాటు పడేలా ఇప్పటినుంచే శిక్షణ ఆరంభించారు. 30 మంది పోలీసు సిబ్బంది 7 ఫిరంగుల్లో మందుగుండును కూర్చి పేల్చారు. పెద్ద ఎత్తున పొగ, శబ్ధం వచ్చినా ఏనుగులు, గుర్రాలు ఏమాత్రం బెదరలేదు. 21 సార్లు పేలుళ్లు జరిపారు.
(చదవండి: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..సంతోషం ఆవిరి)