cannon blasts
-
ఫిరంగి శబ్ధం.. తొణకని గజం
మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ దసరా ఉత్సవాల కోసం మైసూరులో గజరాజులు వివిధ రకాల శిక్షణలో నిమగ్నమయ్యాయి. 14 ఏనుగుల తాలీము జోరుగా కొనసాగుతోంది. సోమవారం కుశాల తోపులో గజరాజులు, గుర్రాల ముందు ఫిరంగి పేలుళ్లను నిర్వహించారు. దసరా రోజున జంబూసవారీ ఊరేగింపులో ఫిరంగులను పేలుస్తారు, వాటి శబ్ధాలకు అలవాటు పడేలా ఇప్పటినుంచే శిక్షణ ఆరంభించారు. 30 మంది పోలీసు సిబ్బంది 7 ఫిరంగుల్లో మందుగుండును కూర్చి పేల్చారు. పెద్ద ఎత్తున పొగ, శబ్ధం వచ్చినా ఏనుగులు, గుర్రాలు ఏమాత్రం బెదరలేదు. 21 సార్లు పేలుళ్లు జరిపారు. (చదవండి: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..సంతోషం ఆవిరి) -
అంగారకుడిపై అణుయుద్ధం?!
అంగారక గ్రహం ఒకనాడు ఆవాసయోగ్యంగా ఉండేదా? అక్కడ మనుషులు జీవించారా? అక్కడ అణు యుద్ధాలు జరిగాయా? యుద్దానంతరం.. జీవరాశిని గ్రహాంతరవాసులు నాశనం చేశారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. వాషింగ్టన్ : అంగారక గ్రహం మీద దశాబ్దాలుగా నాసాసహా పలు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు రీసెర్చ్ కొనసాగిస్తున్నాయి. ఒకప్పుడు అంగారకుడిపై జీవరాశి ఉండేదన్న నమ్మకాన్ని నాసా పలు సందర్భాల్లో వ్యక్తం చేసింది. తాజాగా ఈ నమ్మకం నిజమనే ఆధారం వెలుగులోకి వచ్చింది. తాజాగా అంగారక గ్రహం మీద ఒక ఫిరంగి గుండు ఉన్న చిత్రాన్ని నాసా విడుదల చేసింది. అంగరాకుడి మీదున్నప్రజలకు, గ్రహాంతర వాసులకు మధ్య జరిగిన యుద్ధంలో ప్రజలంతా నాశనమయ్యారనే వాదన వినిపిస్తోంది. అంగారకుడి మీదకు నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ ఇందుకు సంబంధించిన ఒక వీడియోను పంపింది. ఆ వీడియోలో అంగారకుడి భూ ఉపరితలానికి సంబందించి అతి దగ్గరగా ఫొటోలను రోవర్ చిత్రీకరించింది. అందులో ఫిరంగి గుండులాంటి ఒక పదార్థాన్ని రోవర్ గుర్తించింది. వందల వేల ఏళ్ల కిందట అంగారకుడిపై జీవరాశి ఉండేదని.. అదే సమయంలో అక్కడి జీవరాశికి, గ్రహాంతరవాసుల మధ్య అణుయుద్ధంజరిగిందనే వాదన వినిపస్తోంది. ఈ అణు యుద్ధంలో అంగారకుడిపైనున్న జీవరాశి మొత్తం సర్వనాశనం అయిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఆ యుద్ధంలో పేలకుండా మిగిలిపోయిన ఫిరంగిగుండుగా దీనిని అనుమానిస్తున్నారు. గ్రహాంతర వాసులపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న స్కాట్ సీ వార్నింగ్‌కూడా ఈ వీడియో ఇటువంటి అభిప్రాయన్నే వ్యక్తం చేయడం గమనార్హం. -
దసరా ఏనుగులకు ‘అగ్ని పరీక్ష’
మైసూరు : విశ్వ విఖ్యాత దసరా సంబరాల్లో జరిగే జంబూ సవారీలో పాల్గొనే ఏనుగుల చేత చేయిస్తున్న రిహార్సల్స్‌లో భాగంగా శనివారం ఫిరంగి పేలుళ్లు నిర్వహించారు. రాజ ప్రాసాదం దక్షిణ ద్వారంలోని కోట మారమ్మ దేవస్థానంలో ఈ రిహార్సల్స్ జరిగాయి. దసరా ఉత్సవాల్లో జంబూ సవారీని నిర్వహించేటప్పుడు బన్ని మంటపం వద్ద 21 సార్లు ఫిరంగుల ద్వారా పేల్చుతారు. ఆ సందర్భంగా ఏనుగులు, గుర్రాలు బెదిరి పోకూడదనే ఉద్దేశంతో ముందుగానే శిక్షణనిస్తారు. అందులో భాగంగా ఎనిమిది సార్లు ఫిరంగి పేలుళ్లు జరిపారు. అక్టోబరు మూడే తేదీ వరకు మూడు రోజులకోసారి ఉదయం ఏడు నుంచి ఎనిమిది వరకు, పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఈ శిక్షణ ఉంటుంది. రాజప్రాసాదం ఆవరణలో విడిది చేసిన అర్జున నాయకత్వంలోని తొలి బృందానికి ఇదంతా పరిచయమే కనుక ఇనుప గొలుసులతో వాటిని బంధించలేదు. రెండో బృందంలోని ఏనుగులను మాత్రం గొలుసులతో బంధించారు. ఈ బృందంలోని దుర్గా పరమేశ్వరి, గోపీ అనే ఏనుగులు మాత్రం పేలుడు శబ్దాలకు కొంత గాబరా పడ్డాయి.