అంగారకుడిపై అణుయుద్ధం?! | Cannonball Found on Mars, | Sakshi
Sakshi News home page

అంగారకుడిపై అణుయుద్ధం?!

Published Wed, Dec 6 2017 2:22 PM | Last Updated on Wed, Dec 6 2017 2:22 PM

Cannonball Found on Mars, - Sakshi

అంగారక గ్రహం ఒకనాడు ఆవాసయోగ్యంగా ఉండేదా? అక్కడ మనుషులు జీవించారా? అక్కడ అణు యుద్ధాలు జరిగాయా? యుద్దానంతరం.. జీవరాశిని గ్రహాంతరవాసులు నాశనం చేశారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.

వాషింగ్టన్‌ : అంగారక గ్రహం మీద దశాబ్దాలుగా నాసాసహా పలు దేశాల అంతరిక్ష పరిశోధనా సం‍స్థలు రీసెర్చ్‌ కొనసాగిస్తున్నాయి. ఒకప్పుడు అంగారకుడిపై జీవరాశి ఉండేదన్న నమ్మకాన్ని నాసా పలు సందర్భాల్లో వ్యక్తం చేసింది. తాజాగా ఈ నమ్మకం నిజమనే ఆధారం వెలుగులోకి వచ్చింది. తాజాగా అంగారక గ్రహం మీద ఒక ఫిరంగి గుండు ఉన్న చిత్రాన్ని నాసా విడుదల చేసింది. అంగరాకుడి మీదున్నప్రజలకు, గ్రహాంతర వాసులకు మధ్య జరిగిన యుద్ధంలో ప్రజలంతా నాశనమయ్యారనే వాదన వినిపిస్తోంది.


అంగారకుడి మీదకు నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్‌ ఇందుకు సంబంధించిన ఒక​ వీడియోను పంపింది. ఆ వీడియోలో అంగారకుడి భూ ఉపరితలానికి సంబందించి అతి దగ్గరగా ఫొటోలను రోవర్‌ చిత్రీకరించింది. అందులో ఫిరంగి గుండులాంటి ఒక పదార్థాన్ని రోవర్‌ గుర్తించింది.


వందల వేల ఏళ్ల కిందట అంగారకుడిపై జీవరాశి ఉండేదని.. అదే సమయంలో అక్కడి జీవరాశికి, గ్రహాంతరవాసుల మధ్య అణుయుద్ధం​జరిగిందనే వాదన వినిపస్తోంది. ఈ అణు యుద్ధంలో అంగారకుడిపైనున్న జీవరాశి మొత్తం సర్వనాశనం అయిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఆ యుద్ధంలో పేలకుండా మిగిలిపోయిన ఫిరంగిగుండుగా దీనిని అనుమానిస్తున్నారు. గ్రహాంతర వాసులపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న స్కాట్‌ సీ వార్నింగ్‌కూడా ఈ వీడియో ఇటువంటి అభిప్రాయన్నే వ్యక్తం చేయడం గమనార్హం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement