UFO
-
గ్రహాంతరవాసుల సీక్రెట్స్ రష్యాకు తెలుసా..?
గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? అన్న అంశంపై దశాబ్ధాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి అగ్రరాజ్యం అమెరికాతో పాటు రష్యాలో ఎందరో పరిశోధకులు గ్రహాంతరవాసుల విషయంలో ఆసక్తికర పరిణామాలకు సాక్షులుగా ఉన్నారు. గ్రహాంతర వాసులు కొన్నేళ్ల క్రితం వరకు అయితే కేవలం ఊహాజనితమైన జీవులు. కానీ కొన్ని పరిశోధనల్లోనూ...కొందరి అనుభవాల్లోనూ చోటు చేసుకున్న ఘటనలను పరిశీలిస్తే గ్రహాంతర వాసులు కచ్చితంగా ఉన్నారని తెలుస్తోంది. అగ్రరాజ్యాలు మాత్రం గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకో దాచి పెడుతున్నాయంటున్నారు పరిశోధకులు. ఈ విషయంలో అమెరికా, రష్యా రెండూ దొందూ దొందే అంటున్నారు వారు.పదిహేనేళ్ల క్రితం నాటి మాట..రష్యాలో గ్రహాంతర వాసులను ప్రత్యక్షంగా చూసిన నేవీ అధికారులు ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఇంత వరకు రష్యాలోని పుతిన్ ప్రభుత్వం దాన్ని బయట పెట్టలేదు. అయితే కొందరు అధికారుల ద్వారా అసలు విషయం లీక్ కావడంతో యుఎఫ్‌వో(అన్ ఐడెంటిఫైడ్ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్)లపై పరిశోధనలు చేస్తున్నవారికి కావల్సినంత మేత దొరికినట్లయ్యింది.అసలేం జరిగిదంటే..2009 జులైలో రష్యా నావికాదళానికి చెందిన ఓ సబ్ మెరైన్ సాగర గర్భంలో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా డిస్క్ ఆకారంలో ఉన్న ఆరు వస్తువులు అత్యంత వేగంగా సబ్ మెరైన్ పక్కనుంచి వెళ్లడాన్ని దాని పైలట్ గమనించాడు. అవి నీటి గర్భంలో గంటకు 256 మైళ్ల వేగంతో దూసుకుపోవడాన్ని గమనించి సబ్ మెరైన్ పైలట్ ఆశ్చర్యపోయాడు.సబ్ మెరైన్ లోని ఇతర సిబ్బందికి విషయం చెప్పాడు. ఆ ఆకారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఎవరివి? శత్రుసేనలవా? అని వారు కంగారు పడ్డారు. ఆ ఆరు డిస్క్ లు విష్ణు చక్రాల్లా గిర గిరా తిరుగుతూ ముందుకు దూసుకుపోతున్నాయి. అవి ఏవైనా వాహనాలా? కొత్త రకం సబ్ మెరైన్ లా? అని వారు తమలో తాము ప్రశ్నించుకున్నారు. అవి మరోసారి సబ్ మెరైన్ కు సమీపం నుంచి దూసుకుపోయాయి. పైలట్ లో భయం మొదలైంది. ఎందుకొచ్చిందని సబ్ మెరైన్ ను అమాంతం నీటి ఉపరితలానికి తీసుకుపోయాడు. ఆ తర్వాత చూస్తే సాగర గర్భం నుంచి ఆ ఆరు వస్తువులు వేగంగా నీటి ఉపరి తలానికి దూసుకురావడమే కాకుండా గాల్లోకి ఎగిరి వేగంగా ఆకాశంవైపు వెళ్లిపోయాయి.ఆ డిస్కులు కచ్చితంగా గ్రహాంతర వాసులు ప్రయాణించే అంతరిక్ష నౌకలే కావచ్చునని నేవీ అధికారులు భావించారు.అంతరిక్షంలో ఎగరడమే కాదు నీటి గర్భంలోకి దూసుకుపోవడం అంటే గ్రహాంతర వాసుల సాంకేతిక పరిజ్ఞానం ఎంత అడ్వాన్స్ స్టేజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాము చూసిన దాన్ని సబ్‌మెరైన్ సిబ్బంది నేవీలోని ఇతర సహచరులకు చెప్పారు. చాలా మంది నమ్మలేదు. కానీ తర్వాత వారు దానిపై ఓ నివేదిక రూపొందించి ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ నివేదికను రష్యా ప్రభుత్వం చాలా సీక్రెట్‌గా దాచి పెట్టింది.అలా ఎందుకు చేసిందో ఇప్పటికీ పరిశోధకులకు అర్ధం కావడంలేదు. 27 ఏళ్ల కిందట బైకాల్ సరస్సులో వింత ఆకారాలుఈ ఘటనకు 27 సంవత్సరాల క్రితం 1982లో సైబీరియా ప్రాంతంలో మరో సంచలన ఘటన. బైకాల్ సరస్సులోకి ఏడుగురు డైవర్లు దూకి నీటి అడుక్కి వెళ్లారు. వారు 50 మీటర్ల దూరం వెళ్లే సరికి తమని ఎవరో గమనిస్తున్నారన్న అనుమానం వచ్చింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన డైవర్లు ఆశ్చర్యం..భయంతో ఉండిపోయారు. వారిని భారీ పరిమాణంలో ఉన్న ఓ వింత ఆకారం చూస్తోంది. ఆ ఆకారం మనిషి పోలికలతో ఉంది. కాకపోతే హెల్మెట్ వంటి పరికరాన్ని ధరించినట్లు ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్లే సరికి వింత మానవ ఆకారాలు కనిపించాయి. మనుషుల్లాగే కాళ్లూ చేతులతో ఉన్న ఆ జీవులు 9 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఆ జీవులను చూసి విస్తుపోయిన డైవర్లు ధైర్యం చేసి ఓ ఆకారాన్ని పట్టుకోడానికి ప్రయత్నించారు.ఊహించని విధంగా పెద్ద శక్తి ఆ డైవర్లను అమాంతం నీటి ఉపరితలం వైపుకు చాలా బలంగా నెట్టేసింది. అంతటి శక్తి ఆ ఆకారాలకు ఎలా సాధ్యమైందో డైవర్లకు అర్ధం కాలేదు. ఆ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అసలు నీటి కింద ఆక్సిజన్ సిలెండర్ల అవసరం లేకుండా ఆ జీవులు ఎలా ఉండగలుగుతున్నాయో అర్ధం కాలేదు.గడ్డ కట్టుకుపోయే నీటిలోనూ ఆ జీవిలు మనుగడ సాగించగలగడం ఎలా సాధ్యమో తెలియలేదు. అవి కచ్చితంగా ఏదో ఓ గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర వాసులేనని డైవర్లు భావిస్తున్నారు. వారు తాము చూసింది చూసినట్లు పూసగుచ్చి అధికారులకు వివరించారు. దాన్ని ఓ నివేదిక గా రూపొందించారు. ఈ నివేదిక కూడా రష్యాప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం నాలుగు దశాబ్దాలు దాటినా ఈ నివేదికను గుట్టుగా ఉంచడం వెనుక కారణాలేంటో అర్ధం కావడం లేదంటున్నారు పరిశోధకులు.ఈ గ్రహాంతర వాసులేంటో..వారి శక్తి సామర్ధ్యాలేంటో.. వారి స్పేస్‌క్రాఫ్ట్‌ల ప్రత్యేకతలేంటో అంటూ సైంటిస్టులు ఇప్పటికీ జుట్టు పీక్కుంటున్నారు. మనం చూడలేదు కాబట్టి గ్రహాంతర వాసులు లేరని ఎలా అనేయగలం? అంటున్నారు గ్రహాంతర వాసులపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్న వారు. ఇటువంటి ఘటనలు రష్యాలో చాలానే చోటు చేసుకున్నాయని వారంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఓ సీక్రెట్ రీజన్ తోనే వాటిని దాచి పెడుతోందని వారు అభిప్రాయ పడుతున్నారు. -
ఇంఫాల్ గగనతలంలో కలకలం.. రంగంలోకి రఫెల్
ఇంఫాల్: ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై గుర్తు తెలియని వస్తువు(యూఎఫ్ఓ)ను గాలించేందుకు భారత వాయుసేన రఫెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. హసిమారా నుంచి రెండు రఫెల్ విమానాలను ప్రయోగించింది. కానీ రఫెల్ విమానాలు ఆ అనుమానిత వస్తువును గుర్తించలేకపోయాయి. ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో తిరిగొచ్చాయని అధికారులు తెలిపారు. గగనతలంలో గుర్తుతెలియని వస్తువులు ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్‌వే పరిసరాల్లో ఎగురుతూ కనిపించినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు. అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ కమాండ్ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత ఆ వస్తువు కనిపించకుండా పోయిందని తెలిపారు. గుర్తు తెలియని వస్తువులను పసిగట్టడానికి వాయు సేన హషిమార నుంచి రఫెల్ యుద్ధ విమానాన్ని పంపించింది. అత్యాధునిక సెన్సార్లు కలిగిన ఈ విమానం అత్యంత ఎత్తులో గాలించినప్పటికీ ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో వెనక్కి వచ్చింది. కాసేపటికీ మరో రఫెల్‌ను అధికారులు పంపించారు. అప్పుడు కూడా ఎలాంటి వస్తువు కనిపించకలేదని అధికారులు తెలిపారు. యూఎఫ్‌వో కారణంగా మూడు గంటల పాటు విమానరాకపోకలకు అంతరాయం కలిగింది. ఇదీ చదవండి: Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు -
గ్రహాంతరవాసీ... నీవున్నావా?
విశ్వాంతరాళాల్లో గ్రహాంతరవాసుల ఉనికి, గుర్తుతెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్‌వో)ల జాడకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయని కొందరు ఔత్సాహికులు ఆరోపిస్తుంటే తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని, ఈ విషయంలో పారదర్శకత అవసరమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వివిధ దేశాల పార్లమెంటరీ కమిటీలూ ఈ విషయమై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రహాంతరవాసులు, యూఎఫ్‌వోలకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం ఏమిటి, వాటి నిజానిజాలు ఎంత అన్నది పరిశీలిద్దాం. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఇటీవల మెక్సికో కాంగ్రెస్‌లో ఓ ప్రత్యేక సమావేశం జరిగింది. అయితే అనూహ్యంగా సమావేశ మందిరంలో ప్రదర్శించిన వింత ఆకారంలోని రెండు భౌతికకాయాలు యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ప్రముఖ జర్నలిస్టు, యూఎఫ్‌వో పరిశోధకుడు జైమీ మౌసాన్ ప్రదర్శనకు పెట్టిన ఆ భౌతికకాయాలు 45 ఏళ్ల క్రితం ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్పీల్బర్గ్ గ్రహాంతరవాసులపై కల్పిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రం ఈటీ (ఎక్స్ట్రా టెరె్రస్టియల్)లో చూపిన గ్రహాంతరవాసిని పోలినట్లుగా ఉన్నాయి. అవి పెరు దేశంలోని కుస్కో ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయని, వాటిని కార్బన్ డేటా ద్వారా పరీక్షించగా దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తేలిందని జైమీ మౌసాన్ చెప్పారు. డీఎన్ఏ పరీక్షలోనూ ఈ దేహాల్లో 30 శాతానికిపైగా గుర్తుతెలియని పదార్థాలు ఉన్నట్లు తేలిందని, ఆ భౌతికకాయాలు భూమిపై జన్మించిన జీవులు కాదని, ఇతర గ్రహాల నుంచి వచ్చిన వారివేనని ఆయన వాదించారు. అయితే ఈ వాదనపై ‘నాసా’అనుమానాలు వ్యక్తం చేసింది. తమ వద్ద ఉన్న అపారమైన సమాచారం మేరకు ఇంతవరకు గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఏమైనా అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వస్తే వాటిని శాస్త్రవేత్తల పరిశీలనకు అందుబాటులో ఉంచాలని కోరింది. అమెరికాలోనూఇదే తంతు... యూఎఫ్‌వోలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ కూడా ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అందులో అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేవిడ్గ్రుస్ అమెరికా ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని, కూలిపోయిన యూఎఫ్‌వోలు వాటితోపాటు వచ్చిన గ్రహాంతరవాసుల భౌతికకాయాలు అమెరికా అదీనంలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. అమెరికా ప్రభుత్వం ఈ గ్రహాంతర వాహనాలను రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా మళ్లీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన పరిశోధనలో తెలిసిందని కూడా డేవిడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అమెరికా నౌకాదళ మాజీ పైలట్ ర్యాన్గ్రేవ్స్ మాట్లాడుతూ గతంలో తాను విమానం నడుపుతున్నప్పుడు రెండు సందర్భాల్లో యూఎఫ్వోలను చూశా నని వాంగ్మూలం ఇచ్చారు. అయితే అమెరికా రక్షణశాఖ ఈ వాదనలను తిరస్కరించింది. గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదని పెంటగాన్ ప్రతినిధి సూగ్రౌఫ్ ప్రకటన విడుదల చేశారు. ఊహాగానాలకు నెలవుగా ఏరియా 51 అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఉన్న నిషేధిత ఏరియా 51 ప్రాంతం అనాదిగా వాదవివాదాలకు, ఊహాగానాలకు కేంద్రంగా నిలిచింది. ఈ నిషేధిత ప్రాంతంలో గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై అనేక పుస్తకాలు, టీవీ సీరియల్స్ సైతం వచ్చాయి. కొందరు ఔత్సాహికులు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టేందుకు విఫలయత్నాలు చేశారు. గ్రహాంతరవాసుల కథనాలతోపాటు అమెరికా చంద్రునిపై కాలుపెట్టిన ఉదంతం వాస్తవానికి ఏరియా 51లో కృత్రిమంగా రూపొందించారన్న ప్రచారం కూడా ఉంది. యాభైయ్యవ దశకంలో ఈ ప్రాంతంలో గ్రహాంతర వాహనాలు తరచూ కనిపించడం వల్లే ఏరియా 51కి అమెరికా అంతటా ఆసక్తి రేకెత్తింది. 2013లో సీఐఏ బహిర్గతం చేసిన రహస్య పత్రాల్లో అసలు విషయం బయటపడింది. యాభైయ్యవ దశకంలో ప్రయాణికుల విమానాలు 10 వేల నుంచి 20 వేల అడుగుల ఎత్తులో మాత్రమే పయనించగలిగేవి. కొన్ని రకాల యుద్ధవిమానాలు 40 వేల అడుగుల ఎత్తు వరకు పయనించేవి. 1955లో అప్పటి అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ మరింత ఎత్తులో ఎగిరే యుద్ధవిమానాలు యు–2ల నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ఈ విమానాలు 60 వేల అడుగుల ఎత్తులో పయనించగలిగేవి. సాధారణ విమాన ప్రయాణికులకు ఈ విషయం తెలియక వాటిని గ్రహాంతర వాహనాలుగా ప్రచారం చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వైమానికదళ అధికారులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తరువాతి కాలంలో అత్యాధునిక యుద్ధవిమానాలను ఏరియా 51లో పరీక్షించేవారు. అల్లంత దూరాన చిగురిస్తున్న ఆశలు... జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపిన సమాచారాన్ని విశ్లేíÙంచిన ‘నాసా’భూమికి సుదూరంగా ఉన్న కే2–18బీ అనే గ్రహంలో నీటితో నిండిన సముద్రాలు, అందులో జీవచరాలు ఉండే అవకాశం ఉందని ఇటీవల వెల్లడించింది. భూమికి కనీసం 8.6 రెట్లు పెద్దదైన ఈ గ్రహం మనకు 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహం వాతావరణంలో అత్యధిక స్థాయిలో హైడ్రోజన్ ఉండటమే కాకుండా అదే స్థాయిలో మీథేన్, కార్బన్ డయాక్సైడ్, స్వల్ప పరిమాణంలో అమ్మోనియా వాయువులు ఉండటం వల్ల అక్కడ సముద్రజలాలు ఉండే అవకాశం ఉందని నాసా అంచనా వేసింది. అంతకుమించి కే2–18బీ గ్రహ వాతావరణంలో డిమిౖథెల్ సల్ఫైడ్ (డీఎంఎస్) అణువులు కూడా ఉన్నట్లు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొంది. భూమిపై ఈ డీఎంఎస్ను సముద్రంలో వృక్షజాతికి చెందిన నాచులాంటి మొక్కలు మాత్రమే ఉత్పత్తి చేయగలవు. దాంతో కే2–18బీపై కూడా జీవం ఉండే ఆస్కారం మెండుగా ఉందని నాసా భావిస్తోంది. శుక్రుడిపైనా జాడలు... తాజాగా శుక్రగ్రహంపై జీవం ఉండే ఆస్కారం ఉందనడానికి తగిన ఆధారాలు లభించాయి. యూకేలోని వేల్స్లో ఉన్న కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేపట్టిన పరిశోధనల్లో శుక్రుడిపై వాతావరణంలో ఫాస్ఫైన్ వాయువులు ఉన్నట్లు బయటపడింది. కార్టిఫ్ బృందానికి చెందిన గ్రీవ్స్ అనే శాస్త్రవేత్త ఇటీవల రాయల్ ఆ్రస్టానామికల్ సొసైటీ జాతీయ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫాసై్పన్ వాయువుపై ఇంత ఆసక్తి ఎందుకంటే భూమిపై ఈ వాయువు కేవలం జీవజాలాల నుంచే వెలువడుతుంది. భూమిపై స్వచ్ఛమైన హైడ్రోజన్ తక్కువ పరిమాణంలో ఉన్న చోట జీవజాలం గుండా ఫాస్పైన్ ఉత్పత్తి జరు గుతుంది. శుక్రుడు వాతావరణంలో దిగువ భాగంలోనే ఈ ఫాసై్పన్ మేఘాలు ఆవరించి ఉండటంతో అక్కడ జీవం ఉండే ఆస్కారం అత్యధికంగా ఉందనేది కార్డిఫ్ బృందం అభిప్రాయం. మూడేళ్ల క్రితం ఈ విషయం బయటపడ్డా అప్పట్లో శాస్త్రవేత్తలు అంతగా ఆసక్తి చూపలేదు. కేవలం ఫాస్పైన్ ఉన్నంత మాత్రాన జీవం ఉందని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. కానీ ఇటీవల జరిగిన మరిన్ని పరిశోధనల ఫలితంగా ఇప్పుడు శుక్రుడిపై జీవం జాడలు కనుగొనేందుకు ఆసక్తి పెరిగింది. ఆధారాలను కనుగొనే దిశగా... గ్రహాంతరవాసులపట్ల మనిషికి అనాదిగా ఆసక్తి ఉంది. వాటి కోసం నిరంతర అన్వేషణ జరుగుతూనే ఉంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రోదసిలో ఈ గ్రహాంతర జీవుల కోసం వెదుకుతూనే ఉన్నాం. అయినా ఇంతవరకూ కచ్చితమైన ఆధారాలేమీ దొరకలేదు. మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించిన భౌతికకాయాలపై జరుగుతున్న పరీక్షలు వాటిని గ్రహాంతరవాసులుగా తేలిస్తే అవే మనకు మొదటి ఆధారాలు కాగలవు. అంగారకుడిపై ఎప్పుడైనా జీవం ఉన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంతోపాటు అంగారకుడిపై జీవం మనుగడకు అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలించడానికి నాసా ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది. నాసాకు చెందిన ప్రిసర్వేరన్స్ రోవర్ గత జనవరిలో అంగారకుడిపై అనేక ట్యూబ్ లను వదిలింది. ఇవి అక్కడి మట్టి, రాళ్లను సేకరిస్తాయి. వాటిని తిరిగి భూమిపైకి తేవడానికి మార్స్ శాంపిల్ రిటర్న్ (ఎంఎస్ఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాసా అంచనా ప్రకా రం ఇది 2030 నాటికి పూర్తవుతుంది. విశ్వంలో జీవానికిమెండుగా అవకాశాలు... అసలు గ్రహాంతరవాసులు ఉన్నాయా లేక కేవలం భూమిపైనే జీవం ఉందా అనే ప్రశ్నకు శాస్త్ర ప్రపంచం ఇచ్చే సమాధానం ఒక్కటే. అనంతకోటి విశ్వంలో భూమిని పోలిన పరిస్థితులు ఉన్న గ్రహాలు ఇంకా ఉండేందుకు అవకాశం మెండుగా ఉంది. విశ్వం మొత్తంలో కోటానుకోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్క మన పాలపుంత (మిల్కివే) గెలాక్సీలోనే 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇన్నింటి మధ్య భూమిలాంటి వాతావరణం ఉన్న గ్రహాలు అనేకం ఉండే ఆస్కారం ఉంది. అలాంటిచోట జీవం ఆవిర్భవించే అవకాశాలూ ఉన్నాయి. ఏమో ఏదో రోజు మనకు ఈ గ్రహాంతర వాసులతో ములాఖత్ జరిగే అవకాశమూ ఉంది. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
అమెరికా దగ్గర యూఎఫ్‌వోలు, మానవేతర శరీరాలు?
వాషింగ్టన్: గ్రహాంతర వాసుల అన్వేషణ పరిణామ క్రమంలో మరో ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. మనుషులే కాదు.. ఇతర గ్రహాలపైనా జీవులు ఉన్నాయని.. ఇందుకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని అంటున్నాడు ఓ మాజీ నిఘా అధికారి. అయితే ఆ సాక్ష్యాలను బయటకు రాకుండా అమెరికా దాచిపెడుతోందని ఆరోపించారాయన. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. అమెరికా మాజీ నిఘా అధికారి డేవిడ్ గ్రుష్ అమెరికా ప్రభుత్వంపై సంచలన ఆరోపణలకు దిగారు. యూఎఫ్‌వోలు(ఇప్పుడు ఈ పదం స్థానంలో యూఏపీ(unidentified anomalous phenomenon) వాడుతున్నారు), అందులో నుంచి సేకరించిన మానవేతర అవశేషాలపై సైతం పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నిఘా వర్గాలు గతంలోనే ప్రభుత్వానికి సమర్పించాయని తెలిపారాయన. వాషింగ్టన్లో ఓ కమిటీ ముందు బుధవారం ఆయన ఈ వాంగ్మూలం ఇచ్చారు. క్రాష్డ్ క్రాఫ్ట్స్, దాని పైలట్లు నిజమేనా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. అవును అని తెలిపారాయన. దీని గురించి తనకు ప్రత్యక్ష సమాచారం ఉందని తెలిపారాయన. అంతేకాదు.. దశాబ్దాలుగా ఇందుకు సంబంధించిన ఇందుకు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఇదిలా ఉంటే.. జూన్‌లోనే ఆయన అమెరికా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీంతో రిపబ్లికన్ కమిటీ ఒకటి ఆయన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే.. తాను ప్రత్యక్షంగా వాటిని చూడకపోయినప్పటికీ, హైలెవల్ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి తనకు సమాచారం ఉందని తెలియజేశారాయన. అయితే.. అమెరికా ప్రభుత్వం మాత్రం సాక్ష్యాలను దాచిపెడుతుందన్న గ్రుష్ ఆరోపణలను తోసిపుచ్చింది. పరిశోధకులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని రక్షణ అధికారి ఒకరు తెలియజేశారు. Former US Intelligence Agent David Grusch confirms under oath that ALIENS exist. #DavidGrusch #Grusch #UAP #UAPs #UFO #UFOX #UFOTwitter #UFOs #UFOHearing #UFOHearings #UAPHearing #UAPHearings pic.twitter.com/zAG1uD1Yu3 — LifeandFortune (@LifeandFortune) July 26, 2023 -
వీడు ఏలియన్ కాదు.. మరెవరు?
ఏలియన్లు ఎలా ఉంటాయి? ఆకుపచ్చ రంగు శరీరం.. పెద్ద తల.. పెద్ద పెద్ద కళ్లు.. ఇలా ఉంటాయి.. లేదా ప్రపంచాన్ని నాశనం చేసేలా భీకర స్థాయిలో ఉంటాయి.. ఇప్పటివరకూ చాలామందికి గ్రహాంతర జీవులు అంటే మదిలో మెదిలేది ఇదే.. సినిమాలు మనకు అలాగే చూపించాయి.. ఒకవేళ నిజంగానే మన సౌర కుటుంబంలోనే ఏలియన్లు ఉంటే.. అవి ఎలా ఉంటాయి? అచ్చంగా మనిషిలాగా ఉంటాయా లేక సినిమాల్లో చూపించినట్లుగానే ఉంటాయా? దీనిపై ప్రపంచవ్యాప్తంగా కొందరు శాస్త్రవేత్తలు అన్నింటినీ విశ్లేషించి అంచనా వేశారు. సదరు గ్రహం/ఉపగ్రహంపై ఉండే గ్రావిటీ (గురుత్వాకర్షణ శక్తి), వాతావరణం సాంద్రత, ఉష్ణోగ్రతలు వంటి అంశాల ఆధారంగా వాటి రూపురేఖలను రూపొందించారు. యూఎఫ్‌వోలు కనిపించడంతో.. ఇటీవల అమెరికా గగనతలంలో ‘గుర్తుతెలియని ఎగిరే వస్తువులు (యూఎఫ్‌వో)’లు కనిపించాయంటూ వార్తలు రావడం, వీడియోలు, ఫొటోలు కూడా వెల్లువెత్తడంతో.. మళ్లీ గ్రహాంతరవాసుల (ఏలియన్ల)పై చర్చ మొదలైంది. ఏలియన్లు భూమ్మీదికి రావడానికి ప్రయత్నిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిపోయింది. ఈ క్రమంలో మన సౌరకుటుంబంలో ఏలియన్లు ఉన్నాయా? ఉంటే ఎలా ఉండొచ్చు? అన్నదానిపై డైలీమెయిల్ వెబ్సైట్ పలువురు శాస్త్రవేత్తలతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఏ ఆకారంలోనైనా.. మన సౌర కుటుంబంలోనే కాదు.. విశ్వంలో లక్షల కోట్ల కొద్దీ ఉన్న నక్షత్ర మండలాల్లో ఎక్కడైనా జీవం ఉండేందుకు అవకాశం ఎక్కువేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ గ్రహాల్లో నెలకొని ఉన్న పరిస్థితులకు అనుగుణంగా.. మనుషులు, జెల్లీఫిష్‌లు, నత్తలు, స్క్విడ్ (ఆక్టోపస్ వంటివి)లు, ఎగిరే కీటకాలు, సూక్ష్మజీవులు.. ఇలా ఏ రూపంలో అయినా ఏలియన్లు ఉండవచ్చని అంటున్నారు. ►సౌర కుటుంబంలో అంగారక, శుక్ర గ్రహాలతోపాటు గురుడి ఉపగ్రహాలు యురోపా,గనిమీడ్, కలిస్టో.. శని ఉపగ్రహాలు ఎన్సెలాడస్, టైటాన్.. నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రిటాన్, మరుగుజ్జు గ్రహం సెరెస్లపై జీవం ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ►భూమిని పోలిన పరిస్థితులు, వాతావరణం ఉన్నచోట.. భూమ్మీది తరహాలోనే విడిగా తల, కాళ్లు, చేతుల వంటి అవయవాలు, పెద్ద మెదడుతో కూడిన జీవులు ఉండొచ్చని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పాలియాంటాలజిస్ట్ సిమన్ కోన్వే మోరిస్ తెలిపారు. ఒకవేళ నక్షత్రానికి దూరంగా ఉండి, కాంతి తక్కువగా పడే గ్రహాల్లో అయితే కళ్లు బాగా పెద్దవిగా ఉంటాయన్నారు. అయితే ఆ జీవుల ఆకారం మనుషుల్లా ఉండొచ్చు, లేకపోవచ్చని పేర్కొన్నారు. ►ప్రస్తుత పరిస్థితులను బట్టి.. ఒకవేళ సౌర కుటుంబంలోనే జీవాన్ని కనుగొన్నా అవి ఏక కణ సూక్ష్మజీవులే అయి ఉంటాయని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రొఫెసర్ ఆండ్రూ కోట్స్ స్పష్టం చేశారు. కానీ విశ్వంలోని కోట్లాది నక్షత్ర లాల్లో చాలా చోట్ల ఏలియన్లు జీవించి ఉండే అవకాశం ఉందన్నారు. భూమిలా ఉంటే.. భూమిపై ఉన్నట్టుగానే కాస్త అటూఇటూగా గ్రావిటీ, వాతావరణం, ఉష్ణోగ్రతలు ఉంటే.. ఏలియన్లు మనుషుల మాదిరిగానే ఉండే అవకాశాలు ఎక్కువ. గ్రావిటీ ఎక్కువగా ఉంటే.. భూమికన్నా పరిమాణంలోపెద్దగా ఉండే గ్రహాల్లో గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. మిగతా పరిస్థితులు భూమిలా ఉన్నా, గ్రావిటీ ఎక్కువుంటే.. ఏలియన్లు ఎత్తు తక్కువగా, దృఢమైన కండరాలతో కూడి ఉంటాయి. గ్రావిటీ తక్కువగా ఉంటే.. చిన్నగా ఉండే గ్రహాలు/ ఉపగ్రహాల్లో గ్రావిటీ తక్కువగా ఉంటుంది. అలాంటి చోట తేలికగా, ఎక్కువ ఎత్తుతో, బలహీనమైన కండరాలతో కూడిన జీవులు ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. వాతావరణం తక్కువగా ఉంటే.. గ్రహం/ఉపగ్రహం సైజుతో సంబంధం లేకుండా, వాతావరణం తక్కువ సాంద్రత (డెన్సిటీ)తో ఉంటే.. తక్కువ బరువుతో, చాలా పెద్ద రెక్కలతో కూడిన ఏలియన్లు ఉండొచ్చు. నిండా మంచుతో కప్పి ఉంటే.. గురుడి ఉపగ్రహం యూరోపా మాదిరిగా మొత్తంగా మంచుతో కప్పబడి, దాని దిగువన నీటి సముద్రాలు ఉంటే.. పీతలు, ఆక్టోపస్‌ల వంటి ఆకారాల్లో ఏలియన్లు ఉండేందుకు చాన్స్ ఎక్కువ. పొడిగా ఉండే గ్రహాలైతే.. శుక్రుడు, మార్స్ వంటి పొడిగా ఉండే వాతావరణ పరిస్థితులు ఉన్న గ్రహాలు/ఉపగ్రహాల్లో జీవం సూక్ష్మజీవుల తరహాలో ప్రాథమిక స్థాయిలో ఉండొచ్చు. వాతావరణం అనుకూలంగా మారితే పరిణామక్రమంలో ఎదిగి.. పెద్దస్థాయి జీవులుగా మారొచ్చు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఏలియన్స్ సంచారం.. క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌజ్
వాషింగ్టన్: ఒకవైపు గగనతలంలో చైనా నిఘా బెలూన్ల కూల్చేసిన అమెరికా.. అదే సమయంలో గుర్తుతెలియని వస్తువులనూ నేల కూల్చినట్లు ప్రకటించి యావత్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తించింది. పైగా గ్రహాంతర వాసుల చర్య, ఏలియన్ల పనే అనే కోణాలను కొట్టిపారేయలేమంటూ ఆ దేశానికే చెందిన ఓ అధికారి(మాజీ) వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది కూడా. ఈ తరుణంలో.. వైట్‌హౌజ్ స్పందించింది. ఏలియన్లు, గ్రహాంతర వాసులు, యూఎఫ్‌వోల వాదనను కొట్టిపారేసింది. కూలిన వస్తువులకు.. ఏలియన్లు, గ్రహాంతరజీవుల కదలికలకు సంబంధం లేదని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ ప్రకటించారు. ‘‘తాజా కూల్చివేతలపై వైట్‌హౌజ్ నుంచి వెలువడుతున్న సుస్పష్టమైన ప్రకటన ఇది. ప్రపంచ దేశాల్లో.. ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందరో ఆరాలు తీస్తున్నారు. కానీ, ఇది గ్రహాంతర వాసుల చర్య అనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇది మాత్రం క్లియర్ అని ప్రకటించారామె. పైగా ఆ సమయంలో.. ఏలియన్ సినిమాల పేర్లను ప్రస్తావించి ప్రెస్మీట్లో నవ్వులు పూయించారు కూడా. ఇక స్పై బెలూన్ల కూల్చివేత తర్వాత.. ఉత్తర అమెరికా ఎయిర్‌స్పేస్‌లో రెండు, కెనడా ఎయిర్‌స్పేస్‌లో ఒకటి.. గుర్తుతెలియని వస్తువులను యుద్ధవిమానాలతో నేలకూల్చేసింది అమెరికా సైన్యం. కానీ, అవి ఏంటన్నదానిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. ఏలియన్లు, గ్రహాంతరవాసుల వాదన తెర మీదకు వచ్చింది. నేలకూల్చిన ఆ వస్తువులు కమ్యూనికేషన్‌కు సంబంధించి పరికరాలు కావని, అవి ప్రజలకు హాని కలిగించేవిగా కూడా లేవనే విషయం స్పష్టమైంది వైట్‌హౌజ్ పేర్కొంది. అధ్యక్షుడు జో బైడెన్ అవేంటో గుర్తించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించారు. అయితే.. నేల కూల్చిన వస్తువుల శిథిలాలను ఇంకా తాము సేకరించలేదని యూఎస్ డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్ ఇదివరకే స్పష్టం చేశారు. అసలు అవి ఏంటి? వాటి స్వభావం.. ఇతర విషయాలను వాటిని సేకరించిన తర్వాతే ఓ స్పష్టత వస్తుందని పేర్కొన్నారాయన. -
Mystery: డ్యానీని హెచ్చరించింది ఎవరు? అది ఏలియన్స్ పనా? లేదంటే..
ఆసక్తిని రేపే వింతలు.. అనుకోకుండా తారసపడినప్పుడు.. శోధించాలనే జిజ్ఞాస మనిషిని నిమిషం కూడా కుదురుగా నిలువనివ్వదు. కునుకు పట్టనివ్వదు. ఈ కథలో జరిగిందీ అదే. ఓ పక్క నిజం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా నిరూపించలేని నిస్సహాయత వెక్కిరిస్తుంటే.. మరోపక్క విశ్లేషించే క్రమంలో ఉద్దేశపూర్వకంగా అవాంతరాలు అడుగడుగునా హెచ్చరిస్తుంటే సాహసంతో ముందుకు నడిచాడు ఓ జర్నలిస్ట్. అది 1987.. అమెరికాలోని వర్జీనియాలో వైథెవిల్ అనే ప్రాంతవాసులు రాత్రి అయితే చాలు భయంతో గజగజా వణికేవారు. ఆ భయానికి కారణం ఆకాశంలో ఎగిరే ఓ వింత ఆకారం (ఎగిరే పళ్లెం, ‘యూఎఫ్ఓ–అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్’). ఏ ఇద్దరు మాట్లాడుకున్నా అదే కలకలం. ఆనోటా ఈనోటా ఆ వింత.. ‘వేవ్ రేడియో’ రిపోర్టర్ డ్యానీ చెవినా పడింది. అక్టోబర్ 7న అదే విషయాన్ని పెద్ద జోక్‌గా శ్రోతలతో షేర్ చేసుకున్నాడు డ్యానీ. విన్నవారు మాత్రం జోక్‌గా తీసుకోలేదు. నిజమేనంటూ సీరియస్ అయ్యారు. ఆ వింతను మేమూ చూశామనే ఫోన్‌కాల్స్ పెరిగాయి. రోజులు గడుస్తున్నాయి. అక్టోబర్ 17న నైట్ డ్యూటీలో ఉన్న డ్యానీకి.. వైథెవిల్ చుట్టుపక్కల ప్రజల నుంచి ఫోన్‌కాల్స్ పోటెత్తాయి. ‘ఆకాశంలో ఓ వింత ఆకారం కనిపించింది. శబ్దం రావట్లేదు కానీ మెరుస్తోంది. చూడటానికి చాలా పెద్దగా ఉంది. దానికి రంగురంగుల లైట్స్ ఉన్నాయి.. మాకు భయంగా ఉంది’ అని చెప్పారు ఫోన్ చేసినవాళ్లంతా. దాంతో డ్యానీ.. ‘అమెరికా ప్రయోగాత్మకంగా యుద్ధ విమానాలను పరీక్షిస్తుండొచ్చు, కంగారు పడాల్సిన పనిలేదు’ అంటూ ధైర్యం చెప్పుకొచ్చాడు. అయితే డ్యానీ ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు. పెంటగాన్ అధికారుల దగ్గర ఆరా తీశాడు. వాళ్లేమో ‘ప్రభుత్వం ఎలాంటి ప్రయోగాలు చెయ్యడం లేదని.. జనావాసం మధ్యలో అలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తామ’ని ఎదురు ప్రశ్నించారు. దాంతో డ్యానీకి యూఎఫ్ఓల రాక నిజమేనన్న అనుమానం మొదలైంది. నాలుగు రోజుల తర్వాత డ్యానీ తన స్నేహితుడు రోజర్ హాల్‌తో కలసి కారులో.. వైథెవిల్కి దక్షిణ దిశగా బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్లాక ఎంతసేపు ఎదురు చూసినా ఎలాంటి అలజడి లేదు. ప్రజలు అనవసరంగా భయపడుతున్నారని తీర్మానించుకుని వెనుదిరిగారు ఇద్దరూ. కారు స్టార్ట్ చేసి కాస్త ముందుకు వెళ్లేసరికి.. కారు అద్దంలోంచి మెరుపులు విరజిమ్మడం చూసి ఆశ్చర్యపోయారు. కారు దిగి, ఆ వింతని కళ్లారా చూశారు. విశాలమైన ఆకాశంలో ఓ పెద్ద క్రాఫ్ట్ గిర్రున తిరుగుతూ.. మరో గుండ్రటి ప్లేట్‌ని తనలో కలుపుకుని ఒక్కసారిగా అంతర్ధానమైపోయింది. ఆ షాక్‌లో ఇద్దరూ ఫొటోలు తియ్యలేకపోయారు. అందుకే మరునాడు రాత్రి అదే సమయానికి అదే చోటికి వెళ్లి.. ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఆధారాలు ఉన్నాయనే నమ్మకంతో యూఎఫ్ఓ ఫొటోలు తీశామని తెలుపుతూ.. ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని ప్రకటించాడు డ్యానీ. అయితే అదే రోజు రాత్రి డ్యానీకి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి. దాదాపుగా బెదిరింపు కాల్స్ లాంటివి. ముందు కాల్ చేసిన వ్యక్తి.. ‘అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థ(సీఐఏ)కీ, అమెరికా ప్రభుత్వానికి యూఎఫ్‌ఓపై చాలా ఆసక్తి ఉంది’ అని చెప్పగా.. తర్వాత కాల్ చేసిన వ్యక్తి.. ‘యూఎఫ్ఓలపై ప్రయోగాలొద్దు. అదంతా ప్రభుత్వ వ్యవహారం. ఈ విషయంలో గోప్యత చాలా అవసరం. అదే అందరికీ మంచిది’ అంటూ హెచ్చరించాడు. దాంతో మరునాడు(అక్టోబర్ 23న) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నోరు విప్పలేకపోయాడు డ్యానీ. ‘పూర్తి సమాచారం రాగానే యూఎఫ్‌ఓపై మాట్లాడతాను’ అంటూ కాన్ఫరెన్స్ని ముగించాడు. తీరా ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి కానీ యూఎఫ్ఓ ఫొటోలు మాత్రం కనిపించలేదు. డ్యానీకి అర్థమైంది.. ఇదంతా రాత్రి కాల్ చేసినవాళ్ల పనేనని. డిసెంబర్ చివరి నాటికి యూఎఫ్ఓ చూసిన సాక్ష్యుల సంఖ్య పెరగసాగింది. దాంతో ఈ విషయంపై మాట్లాడటానికి.. డ్యానీ పెంటగాన్‌లోని రక్షణశాఖ అధికారులని కలిశాడు. ‘యూఎఫ్ఓలు ఉన్నట్లు ప్రభుత్వం నమ్ముతోంది. కానీ ప్రజలకు ఎలాంటి నష్టం జరగదనేది ప్రభుత్వాభిప్రాయం’ అని చెప్పారు. దాంతో డ్యానీ సమాధానపడలేదు. యూఎఫ్ఓలపై దూకుడు పెంచాడు. మరో రెండు నెలలు దాటింది. 1988 మార్చి 19న వర్జీనియా బీచ్‌లో బ్రాడ్‌కాస్టర్స్ కాన్ఫరెన్స్ కోసం వెళ్లాడు డ్యానీ. ‘డ్యానీని పిలుస్తారా?’ అంటూ అక్కడికో ఫోన్ వచ్చింది. కాసేపటికి రిసీవర్ అందుకున్న డ్యానీ.. ‘ఐయామ్ డ్యానీ.. హూ ఈజ్ దిస్’ అనగానే ఓ వృద్ధ స్వరం గంభీరంగా పలికింది. ‘నేను రిటైర్డ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని. కావాలంటే నా మాటలను రికార్డ్ చేసుకో. నేను నీకు వార్నింగ్ ఇస్తున్నట్లు నిరూపించేందుకు ఈ వాయిస్ టేప్ నీకు ఉపయోగపడుతుంది. నీలాగే యూఎఫ్ఓలపై పరిశోధనలు చేసిన నా కొడుకు ల్యుకీమియాతో చనిపోయాడు. నీకు అదే గతిపడుతుంది. ఎందుకంటే అమెరికా ప్రభుత్వానికి నీలాంటి వాళ్ల ధోరణి నచ్చదు. నా మాట విని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలెయ్. విడిచిపెట్టకపోతే నీపైన, నీ కుటుంబం పైనా రసాయన ప్రయోగాలు జరిగే ప్రమాద ముంది’ అని హెచ్చరించాడు ఆ పెద్దాయన. ‘డోంట్ లుక్ అప్’ పుస్తకం విడుదల ‘రోనోకే టైమ్స్’ బ్యూరో రిపోర్టర్ పాల్ డెల్లింగర్ 1866 నుంచి వైథెవిల్లోనే నివాసముండేవాడు. 1988లో అతడు కూడా డ్యానీలానే యూఎఫ్ఓని ప్రత్యక్షంగా చూసి పలు కథనాలు రాశాడు. ఆ వింతను ప్రత్యక్షంగా చూసినవారినెందరినో ఇంటర్వ్యూలూ చేశాడు. ఈ క్రమంలోనే డ్యానీతో జతకట్టాడు. రోనోకే టైమ్స్, వేవ్ రేడియో ఒకే బిల్డింగ్‌లో ఉండటంతో డ్యానీకి, పాల్కి స్నేహం కుదిరింది. దాంతో ఇద్దరూ కలసి యూఎఫ్‌ఓకి సంబంధించిన వాస్తవ సంఘటనలతో ‘డోంట్ లుక్ అప్’ అనే పుస్తకాన్ని రచించి, ప్రచురించారు. 208 పేజీలతో నిండిన ఈ పుస్తకంలో కేవలం వైథెవిల్ యూఎఫ్ఓ సంఘటనలే కాకుండా కామన్వెల్త్ అంతటా ఉన్న రహస్యాల గురించి ప్రస్తావించారు. ఈ పుస్తకం వేల కాపీల్లో అమ్ముడుపోయినప్పటికీ ఆ మిస్టరీలు నాటికీ, నేటికీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అదే పనిగా వాటి గురించి ఆలోచిస్తూ.. యూఎఫ్ఓ స్ట్రెస్‌కు లోనయ్యాడు డ్యానీ. అతడి పరిస్థితి చూసి, కుటుంబ సభ్యులు.. ఇదంతా వదిలిపెట్టేయమంటూ ఒత్తిడి తెచ్చారు. 1990 డిసెంబర్ తర్వాత డ్యానీకి యూఎఫ్ఓలు కనిపించలేదు. 1992లో ‘అన్ సాల్వ్డ్ మిస్టరీస్’ అనే పలు సిరీస్‌లు ప్రేక్షకుల్ని అలరించాయి. అయితే పుస్తకంలో చెప్పినట్లు ‘నేను పైకి చూడను.. నేను దేనికోసం వెతకను.. కానీ నిజంగా ఆ రోజు నేను ఈ బుక్ రాయకుండా ఉండి ఉంటే ప్రపంచానికి తెలిసేదే కాదు. కథ అనేది ఎప్పటికీ నిలిచిపోతుందని నేను నమ్ముతాను’ అంటారు డ్యానీ. 2022 జనవరిలో డ్యానీ మరో పోరాటం మొదలుపెట్టాడు. నెట్‌ఫ్లిక్స్‌లో 2021లో విడుదలైన ‘డోంట్ లుక్ అప్’ సినిమా టైటిల్‌ను తమ బుక్ నుంచే తీసుకున్నారని.. కేవలం ఆశ్చర్యార్థకాన్ని తొలగించి.. ఆ పేరును యథాతథంగా వాడుకున్నారని, దానికి తన అనుమతి తీసుకోలేదంటూ బాధ్యుల మీద దావా వేశాడు డ్యానీ. అదలా ఉండగా ఆనాటి యూఎఫ్ఓలు ప్రభుత్వం పనా? లేక ఏలియన్స్ పనా? మరి డ్యానీని హెచ్చరించింది ఎవరు? ఇలా పలు ప్రశ్నలతోనే మిస్టరీగా చరిత్రలో చేరింది ఈ కథ. -సంహిత నిమ్మన చదవండి: టేస్టీ ఐలాండ్.. అక్కడ మట్టిని కూరల్లో మసాలాగా వాడతారు! -
ఆకాశంలో నాలుగు చుక్కలు.. గ్రహాంతర వాసులులేనా!?
గ్రహాంతరవాసులు.. ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మనలో ఏదో తెలియని ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. విశ్వంలో ఏలియన్స్ ఉన్నారని వారికి మనుషుల కంటే అధిక శక్తులు ఉంటాయని, టెక్నాలజీ గురించి కూడా తెలుసని చాలాకాలం నుంచి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? చర్చ ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు తాము అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్ఓ)లను చూశామని ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. అయితే ఒకవేళ నిజంగా ఏలియన్స్ ఆకాశం చక్కర్లు కొడితే.. అవి భూమి మీదికి ఎందుకు రాలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చైనా దిగ్గజ కంపెనీలో చీకటి యవ్వారాలు.. కామ పిశాచాలపై ‘నో’ యాక్షన్ అయితే తాజాగా.. ఏలియన్స్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వార్తల్లోకి వచ్చింది. ఆకాశంలో అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ చక్కర్లు కొట్టిన వీడియో ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్ మారింది. అది ఏలియన్స్ పంపిన యూఎఫ్ఓనా లేదా ఏదైనా ఏయిర్ క్రాఫ్టా? అని చర్చ జరుగుతోంది. అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ అంటే.. ఆకాశంలో ఎగురుతూ కనిపించే గుర్తు తెలియని వస్తువు లేదా ఏలియన్స్ ఫ్లైయింగ్ మిషిన్. ఏదైన ఏయిర్ క్రాఫ్టు లేదా స్పేస్ షిప్‌లు ఆకాశంలోకి ఎగిరినప్పుడు వాటికి సంబంధించిన రాడార్ సిగ్నల్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే యూఎఫ్ఓ వంటి వాటికి రాడార్ సిగ్నల్స్ ఉండవు. ఇక కొన్ని సార్లు రాడార్లుకు సంబంధించిన సిగ్నల్ కాకుండా వింత మిషన్లు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంటాయి! అయితే వాటివి ఇతర గ్రహాల నుంచి వచ్చిన మిషన్‌గా సైంటిస్టులు భావిస్తుంటారు. భూమిపై నుంచి ఎలాంటి ఫ్లైట్ లేదా స్పేస్ షిప్ గాల్లోకి ఎగిరిగినా అందుకు సంబంధించిన రాడార్ సిగ్నల్స్ ఉంటాయి. పైలెట్స్ వాటిని సులభంగానే గుర్తిస్తారు కూడా. తాజాగా ఓ పైలెట్‌కు ఆకాశంలో వింత ఆకారంలో యూఎఫ్ఓ కనిపించింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఓ పైలెట్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. కొంత దూరం ప్రయాణించాక నాలుగు చుక్కలు ఒకదాని పక్కన ఒకటి ప్రయాణించిటం గమనించాడు. ఆ దృశ్యాన్ని చూసిన పైలెట్ ఆశ్చర్యానికి గురై తన కెమెరాలో బంధించాడు. కొంత దూరం ప్రయాణించిన ఆ చుక్కలు.. ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. అవి ఏలియన్స్ యూఎఫ్ఓలని నెటిజన్లు సోషల్ మీడియలో కామెంట్లు చేస్తున్నారు. యూఎఫ్‌వోలకు సంబంధించిన పలు వీడియోలు గతంలో చాలా సార్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. A pilot claims he saw a fleet of #UFOs over the Pacific Ocean. The video was shot at around 39,000 feet. 🛸👽 The suspected #alien aircraft took the form of ‘weird’ rotating lights moving across the sky. 😳 What are your thoughts on the footage? 👀🤔 pic.twitter.com/N0I2WS2kYq — Chillz TV (@ChillzTV) December 7, 2021 -
మన ఫ్రెండ్స్‌లో, మనకి జరిగిన కథే ‘పోస్టర్’
విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా తాజా చిత్రం ‘పోస్టర్’. టి. మహిపాల్ రెడ్డి (టీఎంఆర్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి.శేఖర్ రెడ్డి, ఏ. గంగారెడ్డి, ఐజీ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ సంస్థ యూఎఫ్ఓ ఎంతో గ్రాండ్ గా సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ‘యూ ఎఫ్ ఓ వంటి పెద్ద సంస్థ మా సినిమాను రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది చిన్న సినిమాలలో ఒక పెద్ద సినిమా అవుతుంది అనే నమ్మకం ఉంది. మా సినిమా రిలీజ్ లో మాకు ఎంతగానో సహకరిస్తున్న యూ ఎఫ్ ఓ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు’ తెలిపారు. ఈ సినిమా మన ఊరిలో, మన ఇంటి పక్కన , మనకి జరిగిన కథలాగే ఉంటుందన్నారు హీరో విజయ్ ధరన్. శివాజీ రాజ, మధుమణి, రామరాజు, కాశీ విశ్వనాధ్, స్వప్నిక, అరుణ్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శాండీ అద్దంకి సంగీతం అందిస్తున్నాడు. -
‘ఆ మర్మాలకు సంబంధించి ఇప్పటికిప్పుడు నిర్ధారణకు రాలేము’
ఆకాశంలో ఎగురుతూ దర్శనమిచ్చిన(యూఎఫ్‌వో) ఘటనలపై దర్యాప్తు ఫలితాన్ని.. శుక్రవారం అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ విడుదల చేసింది. ఈ నివేదికపై ఎంతో ఉత్కంఠంగా, ఆసక్తిగా ఎదురుచూసినవాళ్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఏదో చెబుతాయనుకుంటే.. మళ్లీ పాతపాటే పాడాయి నిఘా వర్గాలు. అవి ఏంటో అనే విషయంపై ఎలాంటి నిర్ధరాణకు రాలేదని సింపుల్‌గా తేల్చి చెప్పాయి. వాషింగ్టన్: వరుసగా యూఎఫ్‌వో ఘటనలు.. అది కూడా మిలిటరీ ఎయిర్‌స్పేస్‌లోనే దర్శనమివ్వడంతో పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూఎఫ్‌వో ఘటనలపై సమగ్ర నివేదికను సమర్పించాలని రక్షణ దళాల్ని ఆదేశించింది అమెరికన్ పార్లమెంట్(కాంగ్రెస్). దీంతో కిందటి ఏడాది ఆగష్టులో యూఎపీటీఎఫ్(Unidentified Aerial Phenomena Task Force)ను ఏర్పాటు చేయించింది పెంటగాన్. అటుపై 2004 నుంచి 144 ఘటనలపై నివేదికలు తెప్పించుకుని.. వాటిపై మళ్లీ నిఘా వర్గాలతో దర్యాప్తు చేయించి తుది నివేదికను తయారు చేయించింది. అయితే సుదీర్ఘ విచారణ, దర్యాప్తుల తర్వాత వాటిపై అంచనాకి రాలేకపోయామని తేల్చేసింది. శత్రుదేశాల పనికాదు! వేల పేజీల రిపోర్టులను పరిశీలించి.. సింపుల్‌గా కొన్నిపేజీల(పదిలోపే) ఫలితాన్ని ప్రకటించడం కొసమెరుపు. ‘‘ఆ వీడియోల్లో కనిపించినవి వేరే గ్రహానికి చెందినవని, ఏలియన్ సాంకేతిక పరిజ్ఞానానికి చెందినవని చెప్పడానికి నిఘా వర్గాలకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అలాగని రష్యా, చైనాలాంటి దాయాది దేశాల సాంకేతిక పన్నాగమూ అని కూడా నిర్ధారణ కాలేదు’’ అని పెంటగాన్ ప్రకటించింది. అయితే ఆ మర్మాలకు సంబంధించి ఒక నిర్ధారణకు మాత్రం ఇప్పటికిప్పుడే రాలేమని, అలాగని ప్రచారపు సిద్ధాంతాలను కొట్టిపారేయడానికి తగిన ఆధారాలు లేవని పెంటగాన్ ప్రకటించడం విశేషం. కొత్తగా ఏముందంటే.. శోధించి.. పరిశీలించి.. జాబితాను రూపొందించినట్లుగా పెంటగాన్ ప్రకటించడంపై సెటైర్లు పడుతున్నాయి. పైగా పెంటగాన్ ఇప్పుడు తుది నివేదిక ప్రత్యేకంగా చెప్పింది ఏం లేదన్నది చాలామంది మాట. అయితే పదకొండు ఘటనల్లో మాత్రం దాదాపుగా ‘ఢీ కొట్టేంత పని చేశాయన్న పైలెట్ల వివరణ’ను ప్రకటించడం మాత్రం కొత్తేనని అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు, గ్రహాంతర విషయాలపై ఆసక్తికనబరిచే పరిశోధకులు. పైగా వాటి ఆకారాలపై కూడా దాదాపుగా ఒక అంచనాకి రావడం(విమానాల తరహాలోనే ఉన్నప్పటికీ.. బెలూన్ల షేప్ ఆకారాలు వాటికి తగిలించి ఉన్నాయని) పరిశోధనలో ఒక ముందడుగుగా భావిస్తున్నారు. ఇక యూఎఫ్వోకి బదులు యూఏపీ(Unidentified Aerial Phenomena) ప్రతిపాదనను బలపరచడం, కిందటి ఏడాది ఏప్రిల్‌లో యూఎస్ నేవీ రిలీజ్ చేసిన వీడియోల్ని పరిగణిస్తున్నామని ప్రకటించడం ద్వారా యూఎఫ్‌వో థియరీలను ఇంకా సజీవంగానే ఉంచాలని పెంటగాన్ భావిస్తోందని తెలుస్తోంది. -
అర్థరాత్రి ఆకాశంలో వింత కాంతి.. ఆందోళనలో జనాలు
గాంధీనగర్: గుజరాత్ జునాగఢ్‌లో రాత్రి, ఆకాశంలో మెరుస్తున్న ప్రకాశవంతమైన లైట్ల వరుసలు జనాలను భయభ్రాంతులకు గురి చేశాయి. జనాలు వీటిని యూఎఫ్ఓలు అని అనుమానించి.. తీవ్రంగా కంగారు పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిలో, సుమారు నాలుగు నుంచి ఏడు ప్రకాశవంతమైన మెరిసే లైట్లు ఒకదాని వెంట లైన్‌గా పయనించడం గమనించవచ్చు. ఈ సందర్భంగా గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (గుజ్కోస్ట్) సలహాదారు నరోత్తం సాహూ మాట్లాడుతూ.. ‘‘అసహజమైన కాంతి దృశ్యాలను జనాలు యూఎఫ్ఓలుగా భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు.. ఇవి శాటిలైట్లు. భూమికి తక్కువ ఎత్తులో పయనించే ఈ శాటిలైట్లు ఇలా కనిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేశాయి తప్పి ఇవి యూఎఫ్ఓలు కాదు’’ అన్నారు. "సౌరాష్ట్ర ప్రాంతంలో జనాలు జూన్ 22 తెల్లవారుజామన ఆకాశంలో అనుమానాస్పద రీతిలో 30-40 కాంతి పుంజాలు సరళ రేఖలో పయనించడం గమనించారు. జనాల్లో గూడు కట్టుకున్న సందేహాలు, మూఢనమ్మకాల వల్ల వీటిని యూఎఫ్ఓలుగా భావించారు. అయితే, అంతరిక్ష శాస్త్రం ప్రకారం, ఇటువంటి కాంతి మూడు సందర్భాలలో కనిపిస్తుంది. ఒక ఉల్కకు సంబంధించిన చిన్న భాగం భూమి ఉపరితలంలోకి ప్రవేశించినప్పుడు ఇలా కాంతి కనిపిస్తుంది. దీన్ని షూటింగ్ స్టార్’’ అంటారు అని గుజ్కోస్ట్ సలహాదారు సాహు తెలిపారు. UFOs again in #Rajkot? Even few months back these types of lights were seen in many cities of #Gujarat pic.twitter.com/v5GokrUpVC — Divyesh Trivedi (@DivyeshTrivedi_) June 21, 2021 "కానీ, ఇక్కడ కనిపించిన ఈ ప్రత్యేక దృశ్యంలో ఎక్కువ లైట్లు కనిపించాయి. దీనికి కారణం భూమికి తక్కువ ఎత్తు కక్ష్యలో పయనించే ఉపగ్రహాలు అయి ఉంటాయి. ప్రస్తుతం భూమి దిగువ కక్ష్యలో 3000 కి పైగా ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి" అని తెలిపారు. ఎలోన్ మస్క్ స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్‌ను ప్రయోగించినప్పుడు అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఇలా లైట్లు కనిపించాయని సాహూ తెలిపారు. ఈ లైట్లు కచ్చితంగా ఉపగ్రహాలే. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. చదవండి: అమెరికన్ యుద్ధ నౌకను చుట్టుముట్టిన యూఎఫ్ఓలు -
అమెరికన్ యుద్ధ నౌకను చుట్టుముట్టిన యూఎఫ్ఓలు
వాషింగ్టన్: యూఎఫ్ఓల (అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్) గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికి ఆసక్తే. ఇప్పటికే చాలా మంది తాము యూఎఫ్ఓలను చూశామని ప్రకటించారు. వీరి వ్యాఖ్యలను నమ్మే వారు ఎందరుంటారో.. కొట్టి పారేసేవారు కూడా అంతే మంది ఉంటారు. ఈ క్రమంలో యూఎఫ్ఓలు ఉన్నాయనే వాదనకు బలం చేకూర్చింది అమెరికన్ నేవీ. కొద్ది రోజుల క్రితం యూఎస్ నేవీ యూఎఫ్ఓలకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2019లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అమెరికన్ నేవీ తెలిపింది. ఈ క్రమంలో పరిశోధనాత్మక చిత్రాల దర్శకుడు జెరెమీ కోర్బెల్ అదే సంఘటనకు సంబంధించిన మరో వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. దీనిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 యూఎఫ్ఓలు ఉన్నాయి. ఇవి అమెరికన్ నేవీ యుద్ధ నౌక ఒమాహాను చుట్టుముట్టినట్లు కోర్బెల్ తెలిపాడు. వీటి వేగం గంటకు 70-250 కిలోమీటర్ల వరకు ఉందని.. ఒమాహాతో పోల్చితే మూడు రెట్లు వేగవంతమైనవని కోర్బెల్ వెల్లడించాడు. రాడార్ స్క్రీన్ మీద ఈ యూఎఫ్ఓలు కనిపించాయన్నాడు కోర్బెల్. 2019 US Navy warships were swarmed by UFOs; here's the RADAR footage that shows that. Filmed in the Combat Information Center of the USS Omaha / July 15th 2019 / this is corroborative electro-optic data demonstrating a significant UFO event series in a warning area off San Diego. pic.twitter.com/bZS5wbLuLl — Jeremy Corbell (@JeremyCorbell) May 27, 2021 కోర్బెల్ ప్రకారం, ఈ వీడియోను ఓడ కమాండ్ సెంటర్లో చిత్రీకరించారని.. ఫుటేజ్‌ని ఇంకా వర్గీకరించలేదన్నాడు. ఇతను గతంలో అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా టాస్క్ ఫోర్స్(యూఏపీటీఎషఫ్) దగ్గర ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. వీటిని అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, పెంటగాన్ కూడా ధ్రువీకరించింది. పెంటగాన్ ప్రతినిధి సుసాన్ గోఫ్ ఏప్రిల్‌లో ది బ్లాక్ వాల్ట్‌తో మాట్లాడుతూ.. "యూఏపీటీఎఫ్ ఈ సంఘటనలను వారి కొనసాగుతున్న పరీశోధనలలో చేర్చింది" అని వెల్లడించారు. మే 15 న కోర్బెల్ షేర్ చేసిన వీడియోలో, “గోళాకార” యూఎఫ్ఓ ఒకటి సముద్రంలో అదృశ్యమైనట్లు పెంటగాన్ మరోసారి ధ్రువీకరించింది. కోర్బెల్ గతంలో విడుదల చేసిన ఫుటేజ్ ప్రామాణికమైనదని.. టాస్క్ ఫోర్స్ యూఎఫ్ఓల కదలికలను పరిశీలిస్తున్నట్లు అమెరిక రక్షణ శాఖ తెలిపింది. చదవండి: ‘‘ఏలియన్స్ నన్ను 50 సార్లు కిడ్నాప్ చేశారు’’ -
‘ఏలియన్స్ నన్ను 50 సార్లు కిడ్నాప్ చేశారు’’
వాషింగ్టన్: ఈ సువిశాల విశ్వంలో కేవలం భూమ్మీద మాత్రమే జీవం మనుగడ సాగించగల్గుతుందా.. మిగతా గ్రహాల్లో ఏవైనా జీవులు ఉంటాయా.. ఉంటే ఎలాంటివి ఉంటాయి అనే అనుమానం జనాల్లో ఎప్పటి నుంచో ఉంది. దీని గురించి తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు జరిగాయి.. జరుగుతున్నాయి. ఇక అమెరికాలోని ఏరియా 51లో గ్రహాంతర జీవులున్నాయిని.. అక్కడ రహస్య పరిశోధనలు జరుగుతున్నాయని నమ్ముతారు చాలా మంది. ఇక వాస్తవం ఏంటో ప్రభుత్వాలకే తెలియాలి. కాకపోతే అప్పుడప్పుడు జనాలకు వింత వింత అనుభవాలు ఎదురువుతాయి. ఇప్పటికే చాలా మంది తాము యూఎఫ్ఓలను చూశామని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ మహిళ ఏకంగా ఏలియన్స్ తనను ఇప్పటి వరకు 52 సార్లు కిడ్నాప్ చేశాయని.. వాటి సాంకేతికతను తనకు చూపించాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సదరు మహిళ వ్యాఖ్యలు మరోసారి గ్రహాంతర జీవుల ఉనికిపై ఆసక్తి రేకేత్తించాయి. ఆ వివారలు.. పౌలా అనే మహిళ బాల్యం నుంచి ఇప్పటి వరకు దాదాపు 52 సార్లు ఏలియన్స్ తనను కిడ్నాప్ చేశాయని తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘బాల్యం నుంచి ఇప్పటి వరకు 52 అసాధారణ అనుభవాలను ఎదుర్కొన్నాను. వాటి గురించి ఎలాంటి హెచ్చరిక లేదు.. కనీసం ముందస్తు సూచన కూడా లేదు. అలా జరిగిపోయాయి. సాధరణ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో.. అవి కూడా అలానే జరిగాయి’’ అన్నారు పౌలా. 1982లో తొలిసారి కిడ్నాప్... ‘‘నా జీవితంలో మొదటిసారి 1982 తొలిసారి స్పేస్‌షిప్‌ను చూశాను. కొన్ని క్షణాల తర్వాత నేను దాని లోపల ఉన్నాను. అప్పుడు నేను చాలా చిన్నపిల్లను. స్పేస్‌షిప్ లోపలంతా సైలెంట్‌గా ఉంది. నా హార్ట్‌బీట్ నాకే వినిపించేంత నిశ్శబ్దంగా ఉందక్కడ. కళ్లునులుముకుని చూసినా ఏం కనిపించడం లేదక్కడ. ఇంతలో ఓ వింత ఆకారం నా కళ్ల ముందుకు వచ్చింది’’ అని గుర్తు చేసుకున్నారు పౌలా. ‘‘దానికి మూడు చేతులున్నాయి. ప్రతి చేతి చివర్లో ఓ లైట్ ఉంది. మొత్తం మూడు లైట్లలో ఒకటి ఆకుపచ్చ, మరోకటి నీలం.. ఇంకో రంగు నాకు గుర్తు లేదు. నేను ఉన్న స్పేస్‌షిప్ విమానం ప్రొపెల్లర్ బ్లేడ్లాగా ఉంది. ఇది సుమారు 30 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో.. నల్లగా ఉంది. దాని చివర్లలో నీలం, ఆకుపచ్చ రంగులు కనిపిస్తున్నాయి. ఆ స్పేస్‌షిప్ నిశ్శబ్దంగా.. క్లాక్‌వైజ్‌గా తిరుగుంది’’ అంటూ వర్ణించారు పౌలా. ఆ ఫోటోలు మనిషి అత్యాశకు నిదర్శనం.. ‘‘ఆ వింత ఆకారాలను చూసి నేను భయపడ్డాను. పారిపోవాలని ప్రయత్నించాను. కానీ అదేంటో అక్కడ నాకు పట్టు దొరకడం లేదు. ఇసుకలాగా జారిపోతున్నట్లు అనిపించసాగింది. ఆ తర్వాత అంతా నల్లగా మారిపోయింది. ఇక ఆ ఏలియన్స్ నాకు తమ సాంకేతికతను చూపించసాగాయి. స్లైడ్‌షో ద్వారా తొలుత అందమైన చిత్రాలను చూపించాయి. వాటిలో నిర్మలమైన నది, నీలాకాశం కనిపించాయి. ఆ తర్వాత వచ్చిన ఫోటోల్లో నల్లగా మారిపోయిన నది.. ఎర్రగా మారిన ఆకాశం గోచరించాయి. మనిషి దురాశ వల్ల భూమి ఇలా మారిపోతుందని నేను గ్రహించగలిగాను. ఆ తర్వాత అంతా నల్లగా మారిపోయింది. నాకు మెలకువ వచ్చేది’’ అని తెలిపారు పౌలా. ‘‘నా బాల్యం నుంచి నాకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఏలియన్స్ నా బెడ్రూమ్ కిటికి గుండా నన్ను తమతో పాటు తీసుకెళ్లేవి. ఈ సంఘటన జరిగిన ప్రతిసారి నేను నాలుగు గంటల పాటు కనిపించకుండా పోయేదాన్ని. నా తల్లిదండ్రులు నా కోసం గాలించేవారు. ఆ తర్వాత నేను బెడ్రూంలో కనిపించడం చూసి ఆశ్చర్యపోయేవారు’’ అంటూ చెప్పుకొచ్చారు పౌలా. తాను చూసిన ఏలియన్స్ ఎలా ఉంటాయో ఊహాచిత్రం గీయించారు పౌలా. ఇక ఏలియన్స్ తనను కిడ్నాప్ చేసిన సమయంలో అయిన గాయాలను కూడా చూపించారు పౌలా. కొందరు ఈమె మాటలను కొటి పారేస్తుండగా చాలా మంది మాత్రం నిజమే కాబోలు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఏలియన్స్ నిజంగానే ఉన్నారా? మార్స్‌పై ఏలియన్స్? -
ఏలియన్స్ నిజంగానే ఉన్నారా?
ప్రపంచంలో అమెరికా దగ్గర ఉన్నంత అధునాతన టెక్నాలజీ మరే ఇతర దేశాల దగ్గర చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీ నుంచి ఇతర దేశాలు తప్పించుకోవడం అంత సులభం మాత్రం కాదు. ఇప్పడు ఈ టెక్నాలజీ నుంచి ఏలియన్స్ కూడా తప్పించుకోలేకపోయాయి. ఏలియన్స్ సంబందించి ఒక లీకైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోను అమెరికా నౌకాదళ అధికారులు ఓ యుద్ధ నౌక నుంచి తీశారు. అందులో త్రిభుజ ఆకారంలో ఉన్న రెండు ఎగిరేపళ్లాలు వేగంగా వెళ్లాయి. ఈ వీడియోను గ్రహాంతరవాసులపై అధ్యయనం చేస్తున్న వారు విడుదల చేశారు. దీనిపై అమెరికా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ దీనిపై స్పందించింది. లీకైన ఫొటోలు, వీడియోలను అమెరికా నేవీ దళ సిబ్బందే తీశారని చెప్పింది. ఐతే వాటిలో ఉన్నది యూఎఫ్ఓలే అని మాత్రం చెప్పలేదు. యుఎస్ఎ టుడే ప్రకారం యుఎస్ ప్రభుత్వం యుఎఫ్ఓల గురించి వివరణాత్మక నివేదికను జూన్ 1న విడుదల చేస్తుందని వారు భావిస్తున్నారు. View this post on Instagram A post shared by JEREMY KENYON LOCKYER CORBELL (@jeremycorbell) ఈ వీడియోలు, ఫొటోలను 2020 మే 1న నేవీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి లీక్ అయ్యాయి. గత రెండేళ్లుగా పెంటగాన్ అధికారులు ఏలియన్స్ ఉన్నాయి అనేలా ప్రకటనలు చేస్తున్నారు. కానీ డైరెక్టుగా గ్రహాంతర వాసులు ఉన్నారు అని మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. రకరకాల వీడియోల్లో కనిపిస్తూ సడెన్‌గా మాయమవుతున్న ఆ విచిత్ర వస్తువులు ఏంటన్నది ఎవరికి తెలియట్లేదు. దీనిపై పెంటగాన్ వాస్తవాలు బయటపెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. చదవండి: కరోనా ఎఫెక్ట్: భారత రైల్వే కీలక నిర్ణయం -
‘తెల్లగా, సూట్‌కేస్ సైజ్‌లో ఉంది’
వాషింగ్టన్: యూఎఫ్ఓ (అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్)ల గురించి తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో గత నెలలో అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ గుర్తు తెలియని వస్తువులకు సంబంధించిన మూడు వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో మరోసారి ఈ యూఎఫ్‌వోల గురించి చర్చ ప్రారంభమయ్యింది. ఈ చర్చలు ఇలా కొనసాగుతుండగానే ది డ్రైవ్ అనే మిలిటరీ వెబ్సైట్ ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొన్ని నివేదికలను ప్రచురించింది. వీటిలో ఏడు నివేదికలు 2013, 2014 మధ్య కాలం నాటికి సంబంధించినవి కాగా, ఎనిమిదవ నివేదిక 2019 సంవత్సరానికి సంబంధించింది. వీటిలో అమెరికా నావీ అధికారుల తమకు ఎదురైన అనుభవాలను తెలియజేశారు. జూన్ 27, 2013 నాటి మొదటి నివేదికలో ఇలా ఉంది ...స్ట్రైక్ ఫైటర్ స్క్వాడ్రన్ 11 ఒక విమానాన్ని గుర్తించింది. అది తెలుపు రంగులో ఉండి డ్రోన్ లేదా మిస్సైల్ పరిమాణంలో ఉంది’ మార్చి 26, 2014 నాటి నివేదికలో ఇలా ఉంది "చిన్నగా సూట్‌కేస్ పరిమాణంలో, వెండి రంగులో విమానం ఆకారంలో ఉన్న ఓ చిన్న గుర్తు తెలియని విమానాన్ని గుర్తించాం. పైలట్ దానికి 1,000 అడుగుల సమీపం వరకు వెళ్లగలిగాడు.. కానీ దాన్ని గుర్తించలేకపోయాడు అని వెల్లడించింది. తాజాగా 2019, ఫిబ్రవరి 13న వెల్లడించిన రిపోర్టులో ఓ యుద్ధ విమాన సిబ్బంది 27 వేల అడుగుల ఎత్తున ఓ ఎర్రనివాతావరణ బెలూన్ లాంటి ఆకారాన్ని చూసినట్లు ఈ నివేదిక వెల్లడించింది. అమెరికన్ నావీ విడుదల చేసిన ఈ నివేదికలు ప్రస్తుతం యూఎఫ్ఓలకు సంబంధించిన చర్చను మరోసారి తెరమీదకు తెచ్చాయి. (చదవండి: ఆకాశంలో అంతు చిక్కని వస్తువు! ) -
ఆకాశంలో అంతు చిక్కని వస్తువు!
వాషింగ్టన్ : గ్రహాంతర వాసులు, ఫ్లయింగ్ సాసర్స్ (గ్రహాంతర వాసులు వీటిని నడుపుతారని ఊహాగానం) గురించి ఇప్పటివరకు ఎన్నో కథనాలు వచ్చాయి. ప్రజలకూ వాటి గురించి తెలుసుకోవాలని అమితాసక్తి. తాజాగా దీనికి సంబంధించి మూడు వీడియోలను అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ విడుదల చేసింది. వీటిని "ఆకాశంలో గుర్తించడానికి వీలులేని దృశ్యాలు" అని వ్యాఖ్యానించింది. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికే వీటిని రిలీజ్ చేశామని వెల్లడించింది. అయితే ఈ వీడియోలు అంతరిక్ష పరిశోధనలకు ఎలాంటి ఆటంకం కలిగించవని స్పష్టం చేసింది. ఒక వీడియోలో వస్తువు లాంటిది ఆకాశంలో తిరుగుతోంది. (ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్) దీన్ని విమానం నడుపుతున్న ఇద్దరు నేవీ పైలట్లు 2004లో కెమెరాల్లో బంధించారు. మరో రెండు వీడియోల్లో గాలిలో ఏదో వస్తువులాంటిది కదలడం కనిపిస్తుంది. వీటిని 2015లో చిత్రీకరించారు. అయితే ఈ వీడియోలు 2007, 2017లో సోషల్ మీడియాలో లీకవగా ఇన్నేళ్ల తర్వాత అమెరికా రక్షణ సంస్థ వీటిని ధృవీకరించడంతో మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ట్విటర్లో ట్రెండింగ్‌గా నిలిచిన ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఏలియన్స్ వస్తున్నాయేమో.." అంటూ కొందరు అనుమానం వెలిబుచ్చగా, "అదేమై ఉంటుందో క్లారిటీ ఇస్తే బాగుండేద"ని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. (ఈ వింత జీవి పేరేంటో మీకు తెలుసా?) -
నీటిలో తేలియాడుతున్న ‘యూఎఫ్ఓ’
పారిస్: యూఎఫ్ఓల గురించి ప్రపంచవ్యాప్తంగా జనాలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తుంటారు. విదేశాల్లో అయితే వీటికి మరింత క్రేజ్. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు చెందిన అంథేనియా అనే కంపెనీ ఓ వినూత్న ఆలోచన చేసింది. యూఎఫ్ఓను పోలి ఉన్న అత్యంత విలాసవంతమైన గదిని నిర్మించింది. సడెన్‌గా చూస్తే.. యూఎఫ్ఓనే నీటిలో తేలియాడుతున్నదా అన్నట్లుగా ఉన్న ఈ ప్రత్యేక నిర్మాణాన్ని.. ట్రెబర్డన్ నౌకాశ్రయంలో నిర్మించారు. దీనిని ఈ నెల 10న ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. -
ఏలియన్స్ మమ్మల్ని ఎత్తుకెళ్లాయి
వాషింగ్టన్ : మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. సాధరణ మానవుడికైతే ఏలియన్స్ ఉనికి గురించి తెలుసుకోవడం మహా సరదా. ఇప్పటికి అమెరికాలో రహస్యంగా ఏలియన్స్ గురించి పరిశోధనలు జరుగుతున్నాయని జనాల్లో ఓ బలమైన నమ్మకం. వీటి ఆధారంగా తెరకెక్కిన హలీవుడ్ చిత్రాలకు లెక్కేలేదు. ఈ క్రమంలో ఏలియన్స్, యూఎఫ్ఓల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అమెరికాకు చెందిన పార్కర్. తను, తనతో పాటు మరో వ్యక్తిని ఏలియన్స్ అపహరించాయి అంటున్నారు. అయితే ఈ సంఘటన 1973 ప్రాంతంలో జరిగిందని తెలిపారు. వివరాలు.. ‘1973 ప్రాంతంలో నేను, హిక్సన్ ఓ షిప్‌యార్డ్‌లో కూలీలుగా పని చేసేవాళ్లం. ఓ రోజు మేమిద్దరం విధులు ముగిసిన తర్వాత చేపలు పడుతూ కూర్చున్నాం. ఆ సమయంలో మా వెనక ఏదో వాహనం ఆగిన శబ్దం వినిపించింది. తిరిగి చూస్తే.. నీలం రంగు వెలుతురు మా వైపు రావడం కనిపించింది. ఆ వెనకే ఓ 30 అడుగుల భారీ నౌక లాంటిది అక్కడ దిగింది. అందులో నుంచి మూడు చిన్న వింత ఆకారాలు బయటకు వచ్చాయి. వాటిని చూడగానే మేం ఇద్దరం స్తంభించిపోయాం. ఆ వింత జీవులు మమ్మల్ని తాము వచ్చిన వాహనం వైపు లాగడం ప్రారంభించాయి. లోపలికి వెళ్లిన తర్వాత మేమిద్దరం గాలిలో తేలుతున్నాం’ అన్నారు పార్కర్. ఇంతలో ఆ వింత జీవులు తమ శరీరం మీద ఉన్న పెద్ద కన్ను వంటి ఆకారంతో తమని పరీక్షించాయన్నారు. కాసేపటి తర్వాత ఆ వింత జీవులు తామిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాయో అక్కడే వదిలి వెళ్లాయన్నారు. తమకు స్పృహ వచ్చే సరికి తామిద్దరూ ఆకాశం వైపు చేతులు ఎత్తి సాయం కోసం ఆర్ధిస్తున్నట్లు ఉన్నామని గుర్తు చేసుకున్నారు. తమ అర చేతులకు గాయాలు కూడా అయినట్లు గుర్తించామన్నారు. అయితే ఈ విషయాన్ని చెప్పినప్పుడు తొలుత అధికారులు ఎవరూ నమ్మలేదు. మేం తాగి ఉన్నాం అనుకున్నారు. కానీ మేం పాలిగ్రాఫ్ పరీక్ష(నిజ నిర్థారణ పరీక్ష)లో పాస్ కావడంతో మా మాటలను నమ్మారు. ఆ తర్వాత ఈ విషయం గురించి వాషింగ్టన్ పోస్ట్‌లో కూడా వచ్చింది అన్నారు. కాగా హిక్సన్ 2011లో మరణించాడు. -
మోదీ నివాసం వద్ద యూఎఫ్ఓ...?
న్యూఢిల్లీ : ఇన్నాళ్లు అమెరికాలో మాత్రమే కనిపించిన యూఎఫ్ఓ (ఎగిరే సాసర్ లాంటి వస్తువు)లు ఇప్పుడు భారతదేశంలో కూడా కనిపిస్తున్నాయి. అది కూడా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసం దగ్గర. వివరాల ప్రకారం...ఈ నెల 7 న న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసమైన ‘లోక్ కళ్యాణ్ మార్గ్’ వద్ద ఆకాశంలో ఒక గుర్తు తెలియని వస్తువు తిరగడం చూసామని సీనియర్ సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే ఆ వస్తువెంటో తెలుసుకుందామని ప్రయత్నించామని కానీ దాని గురించి ఎటువంటి సమాచారం దొరకలేదని తెలిపారు. దాంతో భద్రతా అధికారులు ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన నివేదికలో ‘అంతా సవ్యంగానే ఉంద’ని తెలిపారన్నారు. ఈ విషయం గురించి ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర పథక్ ‘ప్రధాని నివాసం వద్ద ఏదో గుర్తుతెలియని వస్తువు ఆకాశంలో చక్కర్లు కొట్టడం అయితే వాస్తమే. కానీ తర్వాత జరిపిన భద్రతా తనిఖీల్లో ప్రమాదకరమైనదేది మా దృష్టికి రాలేద’ని తెలిపారు. అంతేకాక భద్రతా కారణాల దృష్ట్యా అది యూఎఫ్ఓనా లేకా మరేదైన వస్తువా అనే విషయం గురించి మాత్రం తాము బయటకు వెల్లడించలేమని తెలిపారు. ఇలా గుర్తు తెలియని..అనుమానాస్పద వస్తువులు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సెప్టెంబర్ 17 రాత్రి 10 గంటల ప్రాంతంలో డ్రోన్లాంటి వస్తువేదో పార్లమెంట్ భవనం చుట్టూ చక్కర్లు కొట్టినట్లు ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చింది. కానీ ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) రాడార్‌లో మాత్రం అటువంటిదేమి రికార్డవ్వలేదని సెక్యూరిటి అధికారులు తెలిపారు. -
అమెరికాలో ఏలియన్స్ కలకలం
అరిజోనా, అమెరికా : ఫోనిక్స్ నగర గగనతలంలో అర్థరాత్రి వింత వెలుతురు ప్రజలను ఆందోళనకు గురి చేసింది. కొండ ప్రాంతంలో ఓ వింత ఆకారంలోని వస్తువు ఎగరడాన్ని గమనించిన ఓ వ్యక్తి దాన్ని వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, నెటిజన్లు మాత్రం ఈ వీడియోపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అది యూఎఫ్ఓ(అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్) అవునో.. కాదో అర్థం కావడం లేదని కొందరు కామెంట్ చేస్తుంటే.. ముమ్మాటికి ఇది అమెరికన్ మిలటరీ పనే అని మరికొందరు అంటున్నారు. కాగా, కొద్దిరోజులుగా ఏలియన్స్ భూమికి వచ్చి వెళ్తున్నాయన్న వార్తలు సోషల్‌మీడియాలో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. -
విమానాన్ని వెంటాడిన ఏలియన్స్..!!
న్యూ హ్యాంప్‌షైర్ : యుద్ధవిమానాన్ని ఏలియన్స్ వెంటాడాయా?. సోషల్‌మీడియాలో షేర్ అవుతోన్న కొన్ని ఫొటోలు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. యూఎఫ్ఓ జెట్ ప్లేన్‌ను వెంటాడినట్లు కాన్స్పిరసీ థియరిస్టులు చెబుతున్నారు. కొద్దిసేపు యుద్ధ విమానాన్ని వెంబడించిన యూఎఫ్ఓ తర్వాత దాన్ని ఓవర్టేక్ చేసింది. న్యూ హ్యాంప్‌షైర్‌లో ఆకాశ అందాలను చిత్రిస్తున్న ఫొటోగ్రాఫర్ కెమెరాకు ఈ ఫొటోలు చిక్కాయి. 10 సెకన్ల పాటు ఈ దృశ్యం కనిపించిందని అనంతరం చెట్లు అడ్డు వచ్చాయని కెమెరామెన్ పేర్కొన్నారు. -
ఆ వీడియోలో ఉన్నదదేనా.....?
వాషింగ్టన్ : గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో తెలియదు. ఒక వేళ ఉంటే...అనే ఊహకు రూపమిస్తూ ఎన్నో సినిమాలు, వార్తలు, వార్తాకథనాలు. చివరకు భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఈ గ్రహాంతర వాసుల గురించి మాట్లాడారు. గ్రహాంతర వాసులు ఉంటే వారు మనకంటే శక్తివంతులు,తెలివిగలవారై ఉంటారని చెప్పారు. గ్రహాంతరవాసుల ఉనికిని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. గ్రహాంతరవాసులను ఎవరు చూడలేదు కానీ ‘ఫ్లైయింగ్ సాసర్’ అని పిలిచే ‘యూఎఫ్ఓ’లను చూశామని చాలామంది చెప్పారు. వీటి ఫోటోలు కూడా పేపర్లలో వచ్చాయి. ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకోవడానికి కారణం ఈ మధ్యే అమెరికా రక్షణ శాఖ వారు విడుదల చేసిన ఒక వీడియో. 35సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. స్టార్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వారి ఎఫ్/ఏ-18 సూపర్ హర్నెట్ మిలిటరీ జెట్ విమానం తూర్పు తీరం వెంట ఒక అసాధారణ వస్తువును కనుగొన్నది.అది చూడ్డానికి గుడ్డు ఆకారంలో ఉండి చాలావేగంతో ప్రయాణిస్తుంది. ఈ వింత వాహనాల గురించి తెలుసుకోవడానికి వీరు 2007 నుంచి 2012 వరకు ‘అడ్వాన్స్డ్ ఏవీయేషన్ థ్రెట్ ఐడెంటిఫికేషన్’ అనే కార్యక్రమం ద్వారా ప్రయోగాలు చేశారు. గతంలో... 1947-1969 మధ్యకాలంలో దాదాపు 12వేల కంటే ఎక్కువ మంది వీటిని చూశామని చెప్పారు. కానీ ఎవ్వరూ నిరుపించలేకపోయారు. 2004లో అమెరికాకు చెందిన నావీ పైలెట్ కమాండర్ డెవిడ్ ఫ్రేవర్ తాను గతంలో ఎన్నడూ చూడని ఒక అరుదైన వస్తువు ఆకాశంలో విహరించడం చూశానని చెప్పారు. ఆ వస్తువు తన విమానం అంత పెద్దగా ఉండి అత్యధిక వేగంతో ప్రయాణిస్తుందని చెప్పారు. 80,000 అడుగుల నుంచి 20,000 అడుగులు కిందకు ప్రయాణించిన ఆ వస్తువు అనంతరం కనిపించకుండా పోయిందని చెప్పారు. ఫ్రేవర్ మాట్లాడుతూ ఆ వస్తువు సమీపంలోకి వెళ్లినప్పుడు నా ముక్కును వెనక్కు నెట్టుతున్నట్లు అనిపించింది. అంత వేగంతో ప్రయాణించే వస్తువును నా జీవితంలో ఇంతవరకూ చూడలేదు అన్నారు. ఇన్నేళ్ల తర్వాత... మళ్లీ 13 సంవత్సారాల తర్వాత సరిగ్గా అలాంటి వస్తువునే స్టార్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వారి ఎఫ్/ఏ-18 సూపర్ హర్నెట్ మిలిటరి జెట్ విమానం గుర్తించింది. ఈ వస్తువు కచ్చితంగా భూమికి సంబంధించినది మాత్రం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
ఆ వీడియోలో ఉన్నదదేనా.....?
-
కట్టుబడాలి.. లేదా తప్పుకోవాలి – ప్రతాని రామకృష్ణ గౌడ్
‘‘సౌత్ ఫిల్మ్ చాంబర్ మెంబర్స్ అందరూ కలిసికట్టుగా 10 వేల థియేటర్స్‌ను బంద్ చేయటం రికార్డ్. ఈ బంద్‌కు సహకరించిన నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్ కార్మికులు.. అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సిసి) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. డిజిటల్ సర్వీస్ (క్యూబ్, యూఎఫ్ఒ, పీఎక్స్‌డి) ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ దక్షిణ చలన చిత్రనిర్మాతలు థియేటర్ మూతకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ధియేటర్స్ క్లోజ్ అయ్యాయి. శనివారం ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ‘‘డిజిటల్ వ్యవస్థపై పోరాటం చేస్తూ అన్ని రాష్ట్రాలు ఒకే తాటి మీదకు రావటం చాలా గ్రేట్. హిందీ సినిమాలకు ఇది వర్తించదు. బట్ వాళ్లు కూడా బంద్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ వారు ఐదేళ్ల తర్వాత ఫ్రీ సర్వీస్ ఇస్తాం అని అగ్రిమెంట్ చేసి, ఇప్పుడు అధికంగా వసూలు చేస్తున్నారు. అగ్రిమెంట్‌కు కట్టుబడాలి.. లేదా తప్పుకోవాలి. మేం కొత్త సర్వీస్ ప్రొవైడర్స్‌ను తెచ్చుకుంటాం. ఇది తేలే వరకు బంద్ కొనసాగుతూనే ఉంటుంది’’ అన్నారు. ‘‘డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ 5 ఏళ్లే అగ్రిమెంట్ అని చెప్పి 13 సంవత్సరాలుగా నిర్మాతల రక్తాన్ని పీల్చుకుంటున్నారు. కోట్ల లాభాలు ఆర్జించారు. ఈ బంద్‌ను కంటిన్యూ చేయాలి. ఇది వారం రోజులైనా పది రోజులైనా ఒకే మాట మీద ఉందాం. చార్జీలు కొంత వరకు పెట్టినా ఓకే కానీ చిన్న సినిమాలకు జీరోగా నిర్ణయించాలి’’ అని టీఎఫ్íసీసీ సెక్రటరీ సాయి వెంకట్ అన్నారు. -
రేపటి నుంచి సినిమాల ప్రదర్శన బంద్
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు(క్యూబ్, యూఎఫ్ఓ) వసూలు చేస్తున్న వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) తగ్గించనందుకు నిరసనగా శుక్రవారం నుంచి థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)’ స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ కమిటీ చైర్మన్ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ముత్యాల రాందాస్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2007–2008 కాలం నుంచి సినిమా ప్రింట్ నుంచి డిజిటల్లోకి మారుతూ వచ్చింది. వీపీఎఫ్ నామమాత్రమే చెల్లించండి.. ఐదేళ్ల తర్వాత చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రకటనల రూపంలో మేం ఆదాయం సమకూర్చుకుంటామంటూ చెప్పిన క్యూబ్, యూఎఫ్ఓ యాజమాన్యాలు ఇప్పుడు మాట మారుస్తున్నాయి. ప్రకటనల ద్వారా అధిక ఆదాయం పొందడంతో పాటు వీపీఎఫ్నూ అధికంగా వసూలు చేస్తున్నాయి. ఇది సినిమా వర్గాలకు భారంగా మారుతోంది. కొన్ని సినిమాలకు వీపీఎఫ్ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీనిపై కలిసికట్టుగా పోరాటం చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ చిత్రవర్గాలు నిర్మాత డి.సురేశ్‌బాబు చైర్మన్‌గా, నిర్మాత కిరణ్ కన్వీనర్‌గా ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ’ని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ అధ్యక్షతన ఫిబ్రవరి 16న చెన్నైలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించాం. ప్రస్తుతం వసూలు చేస్తున్న వీపీఎఫ్‌ని 25శాతానికి తగ్గించి.. ఏడాది తర్వాత ఆ ఫీజు మొత్తం వసూలు చేయకూడదనీ.. రెండు సినిమా యాడ్స్ మాకు ఇవ్వాలనీ.. వాణిజ్య ప్రకటనలు 8 నిమిషాలకు మించి ప్రదర్శించరాదని చెప్పాం. ఫీజును 10 శాతం తగ్గిస్తామని వారు అంటే ఒప్పుకోలేదు. ఫిబ్రవరి 23న బెంగళూరులో మరో సమావేశం నిర్వహించగా, 9శాతం మాత్రమే తగ్గిస్తామన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతికే ఓ వ్యక్తి ‘ఆల్ ది బెస్ట్ టు ఇండస్ట్రీ’ అని వ్యంగ్యంగా అంటూ సమావేశం నుంచి వెళ్లిపోయాడు. మా డిమాండ్లకు ఒప్పుకోకుంటే మార్చి 2నుంచి సినిమా ప్రదర్శన నిలిపివేస్తామని వారికి స్పష్టం చేశాం. మా నిర్ణయానికి సౌత్ ఇండస్ట్రీలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా క్యూబ్, యూఎఫ్ఓ కంపెనీలు అడ్డుకుంటున్నాయి. ప్రస్తుత డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు మా డిమాండ్లు ఒప్పుకుంటే సినిమాల ప్రదర్శన ఉంటుంది. వారు ఒప్పుకున్నా కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వెనకడుగు వేయం’’ అన్నారు.