
విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా తాజా చిత్రం ‘పోస్టర్’. టి. మహిపాల్ రెడ్డి (టీఎంఆర్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి.శేఖర్ రెడ్డి, ఏ. గంగారెడ్డి, ఐజీ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ సంస్థ యూఎఫ్ఓ ఎంతో గ్రాండ్ గా సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ‘యూ ఎఫ్ ఓ వంటి పెద్ద సంస్థ మా సినిమాను రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది చిన్న సినిమాలలో ఒక పెద్ద సినిమా అవుతుంది అనే నమ్మకం ఉంది. మా సినిమా రిలీజ్ లో మాకు ఎంతగానో సహకరిస్తున్న యూ ఎఫ్ ఓ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు’ తెలిపారు. ఈ సినిమా మన ఊరిలో, మన ఇంటి పక్కన , మనకి జరిగిన కథలాగే ఉంటుందన్నారు హీరో విజయ్ ధరన్. శివాజీ రాజ, మధుమణి, రామరాజు, కాశీ విశ్వనాధ్, స్వప్నిక, అరుణ్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శాండీ అద్దంకి సంగీతం అందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment