ప్రపంచంలో అమెరికా దగ్గర ఉన్నంత అధునాతన టెక్నాలజీ మరే ఇతర దేశాల దగ్గర చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీ నుంచి ఇతర దేశాలు తప్పించుకోవడం అంత సులభం మాత్రం కాదు. ఇప్పడు ఈ టెక్నాలజీ నుంచి ఏలియన్స్ కూడా తప్పించుకోలేకపోయాయి. ఏలియన్స్ సంబందించి ఒక లీకైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను అమెరికా నౌకాదళ అధికారులు ఓ యుద్ధ నౌక నుంచి తీశారు. అందులో త్రిభుజ ఆకారంలో ఉన్న రెండు ఎగిరేపళ్లాలు వేగంగా వెళ్లాయి.
ఈ వీడియోను గ్రహాంతరవాసులపై అధ్యయనం చేస్తున్న వారు విడుదల చేశారు. దీనిపై అమెరికా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ దీనిపై స్పందించింది. లీకైన ఫొటోలు, వీడియోలను అమెరికా నేవీ దళ సిబ్బందే తీశారని చెప్పింది. ఐతే వాటిలో ఉన్నది యూఎఫ్ఓలే అని మాత్రం చెప్పలేదు. యుఎస్ఎ టుడే ప్రకారం యుఎస్ ప్రభుత్వం యుఎఫ్ఓల గురించి వివరణాత్మక నివేదికను జూన్ 1న విడుదల చేస్తుందని వారు భావిస్తున్నారు.
ఈ వీడియోలు, ఫొటోలను 2020 మే 1న నేవీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి లీక్ అయ్యాయి. గత రెండేళ్లుగా పెంటగాన్ అధికారులు ఏలియన్స్ ఉన్నాయి అనేలా ప్రకటనలు చేస్తున్నారు. కానీ డైరెక్టుగా గ్రహాంతర వాసులు ఉన్నారు అని మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. రకరకాల వీడియోల్లో కనిపిస్తూ సడెన్‌గా మాయమవుతున్న ఆ విచిత్ర వస్తువులు ఏంటన్నది ఎవరికి తెలియట్లేదు. దీనిపై పెంటగాన్ వాస్తవాలు బయటపెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment