
మెక్సికో : మెక్సికో దేశంలోని బాజా రాష్ట్రంలో కనిపించిన మిస్టరీ వస్తువు ప్రజలను ఆందోళనకు గురి చేసింది. దీంతో ఆకాశంలో కనిపించింది ఏలియన్ సంబంధిత ఆకారమే అనే డిబేట్ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మొదలైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
ఇప్పటివరకూ డిస్క్(ఏలియన్ వాహక నౌకగా భావిస్తున్నాం) ఆకారంలో ఉన్న వస్తువును పలుమార్లు గుర్తించిన విషయం తెలిసిందే. తొలిసారి హ్యుమనాయిడ్ రూపంలో ఉన్న గుర్తు తెలియని వస్తువు ఆకాశంలో కనిపించింది. కాగా, 2018లో ఏలియన్లు భూమిపైకి వచ్చాయనే రిపోర్టు రావడం ఇదే తొలిసారి.
దీనిపై మాట్లాడిన కాన్‌స్పిరసీ థియరిస్టు రమీరెజ్.. ఏలియన్లు మన చర్యలను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నాయని చెప్పారు. అంతరిక్షంలోకి మనం చేస్తున్న ఉపగ్రహ ప్రయోగాలను కూడా అవి క్షుణ్ణంగా గమనిస్తున్నాయని తెలిపారు. మనం చేస్తున్న ప్రయోగాలను యుద్ధానికి సన్నాహకాలుగా అవి భావిస్తున్నాయని అన్నారు. 2017లో యూఎఫ్‌ఓ సైటింగ్స్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment