వాషింగ్టన్: గ్రహాంతర వాసుల అన్వేషణ పరిణామ క్రమంలో మరో ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. మనుషులే కాదు.. ఇతర గ్రహాలపైనా జీవులు ఉన్నాయని.. ఇందుకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని అంటున్నాడు ఓ మాజీ నిఘా అధికారి. అయితే ఆ సాక్ష్యాలను బయటకు రాకుండా అమెరికా దాచిపెడుతోందని ఆరోపించారాయన. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది.
అమెరికా మాజీ నిఘా అధికారి డేవిడ్ గ్రుష్ అమెరికా ప్రభుత్వంపై సంచలన ఆరోపణలకు దిగారు. యూఎఫ్‌వోలు(ఇప్పుడు ఈ పదం స్థానంలో యూఏపీ(unidentified anomalous phenomenon) వాడుతున్నారు), అందులో నుంచి సేకరించిన మానవేతర అవశేషాలపై సైతం పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నిఘా వర్గాలు గతంలోనే ప్రభుత్వానికి సమర్పించాయని తెలిపారాయన. వాషింగ్టన్‌లో ఓ కమిటీ ముందు బుధవారం ఆయన ఈ వాంగ్మూలం ఇచ్చారు.
క్రాష్డ్ క్రాఫ్ట్స్, దాని పైలట్లు నిజమేనా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. అవును అని తెలిపారాయన. దీని గురించి తనకు ప్రత్యక్ష సమాచారం ఉందని తెలిపారాయన. అంతేకాదు.. దశాబ్దాలుగా ఇందుకు సంబంధించిన ఇందుకు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలియజేశారు.
ఇదిలా ఉంటే.. జూన్‌లోనే ఆయన అమెరికా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీంతో రిపబ్లికన్ కమిటీ ఒకటి ఆయన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే.. తాను ప్రత్యక్షంగా వాటిని చూడకపోయినప్పటికీ, హైలెవల్ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి తనకు సమాచారం ఉందని తెలియజేశారాయన.
అయితే.. అమెరికా ప్రభుత్వం మాత్రం సాక్ష్యాలను దాచిపెడుతుందన్న గ్రుష్ ఆరోపణలను తోసిపుచ్చింది. పరిశోధకులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని రక్షణ అధికారి ఒకరు తెలియజేశారు.
Former US Intelligence Agent David Grusch confirms under oath that ALIENS exist. #DavidGrusch #Grusch #UAP #UAPs #UFO #UFOX #UFOTwitter #UFOs #UFOHearing #UFOHearings #UAPHearing #UAPHearings pic.twitter.com/zAG1uD1Yu3
— LifeandFortune (@LifeandFortune) July 26, 2023
Comments
Please login to add a commentAdd a comment