Intelligence agency
-
అమెరికాకు ‘స్పేస్ ఎక్స్’ నిఘా ఉపగ్రహాలు!
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్థాపించిన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ కేవలం అంతరిక్ష ప్రయోగాలే కాదు, నిఘా ఉపగ్రహాల తయారీకి సైతం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్పేస్ ఎక్స్‌తో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘ఎన్ఆర్ఓ’ డీల్ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. 2021లోనే ఒప్పందం కుదిరిందని, ఈ కాంట్రాక్టు విలువ 1.8 బిలియన్ డాలర్లు అని తెలియజేశాయి. దీనిప్రకారం ఎలాన్ మస్క్ సంస్థ వందలాది నిఘా ఉపగ్రహాలను తయారు చేసి, ఎన్ఆర్ఓకు అప్పగించాల్సి ఉంటుంది. అమెరికా భద్రతా సంస్థలు, ఎలాన్ మస్క్ కంపెనీ మధ్య బలపడుతున్న బంధానికి ఈ ఒప్పందమే నిదర్శనమని చెబుతున్నారు. ఈ ఉపగ్రహాలు. భూగోళంపై ప్రతి ప్రాంతంపై డేగ కన్నేస్తాయి. అమెరికా సైనిక ఆపరేషన్లకు తోడ్పాటునందిస్తాయి. లక్ష్యాలను కచ్చితంగా గుర్తించడానికి సహకరిస్తాయి. వీటితో అమెరికా ప్రభుత్వానికి, సైన్యానికి చాలా ప్రయోజనాలే ఉంటాయిని నిపుణులు పేర్కొంటున్నారు. -
సరిహద్దుల్లో పటిష్ట నిఘా! కలెక్టర్‌తో వ్యయ పరిశీలకుల భేటీ..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేస్తున్నామని, వాహనాలను నిశిత పరిశీలన చేస్తూ నగదు, మద్యం, ఇతర వస్తువుల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల వివరించారు. కలెక్టర్‌తో శనివారం ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్, అజయ్‌లాల్ చంద్‌లు కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జిల్లాలోని పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు అజయ్‌లాల్ చంద్, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సంజీబ్‌కుమార్ పాల్ వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ని కల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించినట్లు తెలిపారు. సెన్సిటివ్ నియోజకవర్గాలైన ఇల్లెందు, కొత్తగూడెంలలో అదనపు సహా వ్యయ పరిశీలకులను, వీడియో వ్యూయింగ్ టీంలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫిర్యాదులకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లా సరిహద్దుగా ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, ఇతర వస్తువులు రాకుండా చర్యలు తీసుకున్నామని, చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని అన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఖర్చులు పక్కాగా నమోదు చేయాలి.. అభ్యర్థుల ఖర్చులు కచ్చితంగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయపరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల వ్యయ, ఎంసీఎంసీ, ఆబ్కారీ, ఆదాయపన్ను శాఖ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో పాటించాల్ని విషయాలను సోదాహరణంగా వివరించారు. పెయిడ్ న్యూస్‌ను గుర్తించాలి! నిరంతర పర్యవేక్షణతో పెయిడ్ న్యూస్‌ను గుర్తించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ వివిధ దినపత్రికలు, శాటిలైట్ చానల్స్, కేబుల్, సిటీ కేబుల్, సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థుల ప్రచారాలను పరిశీలించాలని చెప్పారు. గుర్తించిన పెయిడ్ న్యూస్, ప్రకటనలపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ద్వారా అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలన్నారు. జిల్లాలో చెక్‌పోస్టుల వద్ద కొనసాగుతున్న పర్యవేక్షణను, సీసీ కెమెరాల రికార్డింగ్ పనితీరును పరిశీలించారు. సీ విజిల్ వచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారాలు, ఎస్ఎస్టీ, ఎఫ్‌ఎస్‌టీి టీముల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పినపాక రిటర్నింగ్ అధికారి ప్రతీక్‌జైన్, వ్యయ నియంత్రణ నోడల్ అధికారులు వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, లైజన్ అధికారులు సంజీవరావు, సీతారాంనాయక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దారా ప్రసాద్, ఎంసీఎంసీ నోడల్ అధికారి, డీపీఆర్వో ఎస్.శ్రీనివాసరావు, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందులో.. ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీవ్‌కుమార్ పాల్, అజయ్ లాల్‌చంద్ సోనేజీ శనివారం ఇల్లెందులో పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంల అకౌంటింగ్ బృందాన్ని కలుసుకున్నారు. ఇవి చదవండి: జంప్ జిలానీలు..! ఉన్న నేతలు ఎప్పుడో ఏ పార్టీలో చేరుతారో? -
పాక్‌లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం?
కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమైన అనంతరం పాకిస్తాన్‌లోనూ అదే తరహా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మౌలానా జియావుర్ రెహ్మాన్ అనే మతపెద్ద కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్లోని ఒక పార్కులో పట్టపగలు హత్యకు గురయ్యాడు. రెహ్మాన్ లష్కరే కార్యకర్త. ఇద్దరు గుర్తుతెలియని దుండగులు రెహమాన్‌ను కాల్చిచంపారు. రెహ్మాన్ సాయంత్రం వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఈ హత్య జరిగింది. ఈ హత్య అతని బంధువులు, స్నేహితులు, అనుచరులను ఆందోళనకు గురిచేసింది. పాకిస్తాన్లో మతపెద్దలు.. మతపరమైన కార్యక్రమాలతో పాటు ఇతర సామాజిక కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్ హత్య తీరులోనే లష్కర్ కార్యకర్త రెహ్మాన్ హత్య జరిగింది. ఉగ్రవాద ఆరోపణలతో భారత్ మోస్ట్ వాటెండ్‌గా ప్రకటించిన పంజ్వార్ను గత మే నెలలో లాహోర్‌లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. BIG BREAKING NEWS - Maulana Tariq Jameel's son Asim Jameel shot dead by UNKNOWN MEN in Talamba, Mian Chunnu of Pakistan 🔥🔥 Radical Maulana Tariq Jameel is well known for his hate speeches against Hindus and Bharat. All Terrorists in fear, ISI shocked after back to back such… pic.twitter.com/xRQ2hrhZUn — Times Algebra (@TimesAlgebraIND) October 29, 2023 పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, టెర్రర్ బాస్‌లు ఈ రెండు హత్యల్లోనూ సారూప్యతలను గమనించారు. ఈ నేపధ్యంలో ఐఎస్ఐ దాదాపు డజను ‘ఆస్తులను’.. ‘సేఫ్ హౌస్’లో ఉంచినట్లు ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్న నిఘా వర్గాలు తెలిపాయి. రావల్కోట్లో అబూ ఖాసిమ్ కాశ్మీరీ, నజీమాబాద్‌లో ఖరీ ఖుర్రామ్ షాజాద్ అనే మరో ఇద్దరు ఎల్ఈటీ కార్యకర్తల హత్యల కారణంగా బహుశా ముందుజాగ్రత్త మరింత అవసరమని ఐఎస్ఐ భావించి ఉండవచ్చునని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలే హత్యకు గురైన రెహ్మాన్.. జామియా అబూ బకర్ అనే మదర్సాలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడని సమాచారం. పాకిస్తాన్ పోలీసులు తమ ప్రెస్ నోట్లో ఈ హత్యను ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. దేశంలో ఉగ్రవాదుల పాత్రను ఇది సూచిస్తోందని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ పోలీసులు దీనిని టార్గెట్ కిల్లింగ్‌గా పరిగణిస్తున్నారు. రెహ్మాన్ హత్య కరాచీలో మత బోధకులపై వరుస దాడుల్లో భాగమని భావిస్తున్నారు. ఈ బోధకులంతా ఐఎస్ఐ ద్వారా ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలను ఏర్పరుచుకున్నారు. వీరు యువతను సమూలంగా మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తగిన శిక్షణ అనంతరం యువతను భారత్‌పై దాడికి పంపిస్తారని తెలుస్తోంది. కాగా గత మార్చి 1న, ఐసీ-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ హైజాకర్ అయిన పైలట్ జహూర్ ఇబ్రహీంను కాల్చి చంపారు. ఈ జైషే మహ్మద్ ఉగ్రవాదిపై గుర్తుతెలియని ముష్కరులు అతి సమీపం నుంచి రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ హత్యల పరంపర పాకిస్తాన్ చట్ట అమలు సంస్థలను, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐని కలవరపరిచింది. అయితే ఈ హత్యలు ప్రత్యర్థుల కారణంగా జరిగాయని కూడా ఐఎస్ఐ పూర్తిగా విశ్వసించడం లేదు. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో వేచిచూడాలి. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌తో యుద్ధం.. హమాస్ కీలక ప్రకటన 🚨 Breaking : Sadiq, Sher Afzal, Fiyaz, Ghulam Rasool & Hafizullah, all Terπ0rists belonging to Lashkar-e-Taiba, have been abducted by #Unknown Gunmen in Neelum Valley, #PoK. News Source : Unknown (not confirmed yet)#IndianArmy #Kashmir#Pakistan #Hamas #ISIS pic.twitter.com/uhrybSj4qf — शून्य (@Shunyaa00) October 28, 2023 -
అమెరికా దగ్గర యూఎఫ్‌వోలు, మానవేతర శరీరాలు?
వాషింగ్టన్: గ్రహాంతర వాసుల అన్వేషణ పరిణామ క్రమంలో మరో ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. మనుషులే కాదు.. ఇతర గ్రహాలపైనా జీవులు ఉన్నాయని.. ఇందుకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని అంటున్నాడు ఓ మాజీ నిఘా అధికారి. అయితే ఆ సాక్ష్యాలను బయటకు రాకుండా అమెరికా దాచిపెడుతోందని ఆరోపించారాయన. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. అమెరికా మాజీ నిఘా అధికారి డేవిడ్ గ్రుష్ అమెరికా ప్రభుత్వంపై సంచలన ఆరోపణలకు దిగారు. యూఎఫ్‌వోలు(ఇప్పుడు ఈ పదం స్థానంలో యూఏపీ(unidentified anomalous phenomenon) వాడుతున్నారు), అందులో నుంచి సేకరించిన మానవేతర అవశేషాలపై సైతం పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నిఘా వర్గాలు గతంలోనే ప్రభుత్వానికి సమర్పించాయని తెలిపారాయన. వాషింగ్టన్లో ఓ కమిటీ ముందు బుధవారం ఆయన ఈ వాంగ్మూలం ఇచ్చారు. క్రాష్డ్ క్రాఫ్ట్స్, దాని పైలట్లు నిజమేనా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. అవును అని తెలిపారాయన. దీని గురించి తనకు ప్రత్యక్ష సమాచారం ఉందని తెలిపారాయన. అంతేకాదు.. దశాబ్దాలుగా ఇందుకు సంబంధించిన ఇందుకు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఇదిలా ఉంటే.. జూన్‌లోనే ఆయన అమెరికా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీంతో రిపబ్లికన్ కమిటీ ఒకటి ఆయన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే.. తాను ప్రత్యక్షంగా వాటిని చూడకపోయినప్పటికీ, హైలెవల్ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి తనకు సమాచారం ఉందని తెలియజేశారాయన. అయితే.. అమెరికా ప్రభుత్వం మాత్రం సాక్ష్యాలను దాచిపెడుతుందన్న గ్రుష్ ఆరోపణలను తోసిపుచ్చింది. పరిశోధకులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని రక్షణ అధికారి ఒకరు తెలియజేశారు. Former US Intelligence Agent David Grusch confirms under oath that ALIENS exist. #DavidGrusch #Grusch #UAP #UAPs #UFO #UFOX #UFOTwitter #UFOs #UFOHearing #UFOHearings #UAPHearing #UAPHearings pic.twitter.com/zAG1uD1Yu3 — LifeandFortune (@LifeandFortune) July 26, 2023 -
క్యూబాలో చైనా గూఢచారులు
వాషింగ్టన్: కమ్యూనిస్ట్ చైనా తమ పొరుగు దేశం క్యూబాలో 2019 నుంచి గూఢచార స్థావరాన్ని నడుపుతోందని అమెరికా ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా నిఘా సమాచార సేకరణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్న ప్రయత్నాల్లో ఇదో భాగమని పేర్కొంది. పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ అధికారి ఈ మేరకు డ్రాగన్ దేశంపై ఆరోపణలు గుప్పించారు. క్యూబాలోని చైనా నిఘా కేంద్రంపై అమెరికా నిఘా సంస్థలు ఓ కన్నేసి ఉంచాయని ఆయన తెలిపారు. చైనా నిఘా కార్యకలాపాల విస్తరణ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నాలను బైడెన్ ప్రభుత్వం ముమ్మరం చేసిందన్నారు. దౌత్యపరమైన, ఇతర మార్గాల్లో చేపట్టిన ఈ ప్రయత్నాలు కొంత సఫలీకృతమయ్యాయని ఆయన అన్నారు. అమెరికాకు అత్యంత సమీపంలో ఉన్న క్యూబా గడ్డపై నుంచి చైనా గూఢచర్యం కొత్త విషయం కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదేనని తమ నిఘా వర్గాలు అంటున్నాయని ఆ అధికారి ఉటంకించారు. అట్లాంటిక్ సముద్రం, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా, ఇండో–పసిఫిక్ ప్రాంతాల్లో నిఘా కేంద్రాల ఏర్పాటుకు చైనా యత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే క్యూబాలోని నిఘా కేంద్రాన్ని 2019లో చైనా అప్‌గ్రేడ్ చేసిందని ఆ అధికారి వివరించారు. క్యూబాలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరణ వ్యవస్థ ఏర్పాటుపై రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్లు గురువారం వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో కథనం వచ్చింది. బదులుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న క్యూబాకు భారీగా ముట్టజెప్పేందుకు చైనా సిద్ధమైందని కూడా అందులో పేర్కొంది. అయితే, వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని క్యూబా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఖండించారు. -
ది కేరళ స్టోరీ విడుదల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి హెచ్చరిక
ది కేరళ స్టోరీ సినిమాపై రాజకీయ దుమారం చల్లారడం లేదు. ఎక్కడ విన్నా ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’ పేరే మార్మోగుతోంది. అంతలా సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. మే 5న విడుదల కానున్న ఈ సినిమాను రిలీజ్ చేయవద్దంటూ కేరళ ప్రభుత్వంతో సహా కాంగ్రెస్, సీపీఐ వంటి పార్టీలు, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ది కేరళ స్టోరీ విద్వేషపూరితంగా చీత్రికరించారని, సినిమా విడుదల చేస్తే సమాజంలో మత సామరస్యాలు దెబ్బతింటాయంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ సినిమా వివాదం కేరళలోనే కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడుకు కూడా పాకింది. రిలీజ్ డేడ్ సమీపిస్తన్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వాన్నికి ఇంటెలిజెన్స్ బృందాలు అలెర్ట్ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. తమిళనాడులో కేరళ స్టోరీ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచన చేసింది. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రిలీజ్ చేస్తే వచ్చే సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన్నట్లు తెలిపాయి. అన్ని థియేటర్లలో పీఎస్-2(పొన్నియన్ సెల్వన్) నడుతస్తోందని, ప్రభుత్వంతోపాటు ధియేటర్ యాజమానులు ది కేరళ స్టోరీని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి. బ్యాన్ కోరుకోవడం లేదు.. కానీ సినిమా మేకర్స్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం విమర్శలు గుప్పించారు. ఈ సినిమా హిందూ, ముస్లిం మధ్య ద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని, దీనిని ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. కేరళను తప్పుగా చిత్రీకరిస్తూ చిత్రాన్ని రూపొందించారని విమర్శించారు. తాను సినిమాను బ్యాన్ చేయాలని కోరుకోవడం లేదంటూనే.. భావప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారదని మండిపడ్డారు. వాస్తవికతను తప్పుగా చూపించారని, దీనిపై గొంతెత్తి నినాదించే హక్కు కేరళ ప్రజలకు ఉందని ఉందని తెలిపారు. మరోవైపు ది కేరళ స్టోరీ చిత్రానికి బీజేపీ మద్దతిస్తోంది. Let me stress, I am not calling for a ban on the film. Freedom of expression does not cease to be valuable just because it can be misused. But Keralites have every right to say loud & clear that this is a misrepresentation of our reality. https://t.co/sEIG91mjSP — Shashi Tharoor (@ShashiTharoor) May 1, 2023 కాగా సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్ అమృత్లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఐసిస్‌లో చేరి ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ది కేరళ స్టోరీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడంతో మే5న విడుదలకు సిద్ధంగా ఉంది. -
గోదావరి తీరంలో నక్సల్స్!
సాక్షిప్రతినిధి, వరంగల్: గోదావరి తీరంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు ఉన్నాయా? అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో నక్సల్స్ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందా?.. అంటే నిజమే అంటున్నాయి పోలీసువర్గాలు. ఏటా జరిగే మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నక్సల్స్ వివిధ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు చెబుతున్నారు. దీనికి తోడు ఏటూరునాగారం, వెంకటాపూర్ ప్రాంతాల్లో బుధవారం మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేరిట కరపత్రాలు, వాల్‌పోస్టర్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి తీరంలో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం సరిహద్దు అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు.. మావోయిస్టు పార్టీ ప్రతి ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఉద్యమంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,700 మందికి పైగా తమ సభ్యులు మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఇటీవల సంవత్సరాల్లో కరోనా, కోవర్టుల కారణంగా ఆ పార్టీ పలువురు ఉద్యమకారులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు కరపత్రాల్లో ప్రకటించింది. దీంతో పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దులో నిఘా పెంచారు. అగ్రనేతల మరణం.. కోలుకోలేని నష్టం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా నక్సల్స్‌పై ప్రభుత్వాల వైఖరి మారలేదు. 2020–22 సంవత్సరాల్లో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అగ్ర నాయకులతోపాటు మొత్తం 173 మంది నక్సల్స్ మరణించారు. ఓ వైపు పోలీసు ఎన్కౌంటర్లు, మరోవైపు కరోనా.. మావోయిస్టు పార్టీ కీలక నేతలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు తప్పకుండా నిర్వహించాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించిన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల ఉన్నతాధికారులు.. అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. -
మూలం కనిపెట్టడంలో అమెరికా విఫలం
వాషింగ్టన్: కరోనా వైరస్ పుట్టుకపై విచారణ జరిపిన అమెరికా ఇంటెలిజెన్స్ ఎటూ ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఆ వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీకయిందా లేదంటే సహజసిద్ధంగానే పుట్టుకొచ్చిందా అనే అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమయ్యారు. అయితే కరోనా వైరస్‌ని జీవాయుధంగా అభివృద్ధి చేశారని తాము భావించడం లేదని ఇంటెలిజెన్స్ తన నివేదికలో స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ అధికారులు వైరస్ పుట్టుకపై విచారణ జరిపి శుక్రవారం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో వ్యాప్తి చాలా స్వల్పంగా ఉందని రాను రాను అది పెద్ద ఎత్తున విస్తరించిందని ఇంటెలిజెన్స్ డైరెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. వూహాన్లో ఈ వ్యాధి లక్షణాలు 2019 నవంబర్లోనే కనిపించాయని, డిసెంబర్ నాటికి చైనా వ్యాప్తంగా విస్తరించాయని చెప్పారు. ‘వైరస్‌ని ఒక జీవాయుధంగా ఎవరూ అభివృద్ధి చేయలేదు. విచారణలో పాల్గొన్న ఇంటెలిజెన్స్ సంస్థలన్నీ దీనిపై ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. అయితే ఈ వైరస్ జన్యుమార్పిడి ద్వారా సృష్టించిన ఆయుధం కాదు అని మాత్రం గట్టిగా నిర్ధారణకు రాలేకపోయాయి. రెండు సంస్థలు మాత్రం దేని పైనా స్పష్టమైన నిర్ణయం రావడానికి తగిన ఆధా రాల్లేవని తెలిపాయి’ అని ఆ నివేదిక వివరిం చింది. కానీ ఆ ఇంటెలిజెన్స్ సంస్థల వివరాలేవీ అమెరికా వెల్లడించలేదు. కరోనా వైరస్ వ్యాప్తి వెలుగులోకి రాక ముందు చైనాలో శాస్త్రవేత్తలకు సైతం దీనిపై కనీస పరిజ్ఞానం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అన్ని విధాల అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించిన తర్వాత ఇంటెలిజెన్స్ సంస్థలు ఈ వైరస్ సహజ సిద్ధంగా అయినా వచ్చి ఉండాలని లేదంటే ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తూ లీక్ అయి ఉండాలని భావి స్తున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది సరైనదో చెప్పడానికి వారికి తగిన ఆధారాలైతే లభించలేదు. అమెరికావన్నీ రాజకీయాలే: చైనా మరోవైపు చైనా ఈ నివేదికపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అమెరికా ఇంకా దీనిపై రాజకీయం చేయాలనుకుంటోందని ఆరోపించింది. వైరస్ పుట్టుకకు కారణాలు వెతికే పని శాస్త్రవేత్తలదే తప్ప ఇంటెలిజెన్స్‌ది కాదని వాషింగ్టన్లో చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా ఇంటెలిజెన్స్ తప్పుల తడక నివేదిక ఇచ్చిందని అభిప్రాయపడింది. కీలక సమాచారం చైనా దగ్గరే ఉంది : బైడెన్ అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికతో పాటు అధ్యక్షుడు జో బైడెన్ ఒక ప్రకటనను విడుదల చేస్తూ కరోనా మూలాలు కనుక్కోవడానికి తమ పాలనా యంత్రాంగం చేయాల్సిన కృషి అంతా చేసిందని అన్నారు. కీలకమైన సమాచారం అంతా చైనా తన గుప్పిట్లో పెట్టుకొని ఉందని, మొదట్నుంచి చైనా అధికారులు అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రపంచ దేశాలను కరోనా అల్లకల్లోలం చేస్తూ మరణాల సంఖ్య పెరిగిపోతున్నా చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని బైడెన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ విచారణలో ఈ వైరస్ వూహాన్లో జంతు మార్కెట్ నుంచి విడుదలైనట్టుగా నివేదిక ఇచ్చినప్పటికీ ఎందరో శాస్త్రవేత్తలకి దానిపై నమ్మకం కుదరలేదు. -
భారత్ తీరు మారింది
వాషింగ్టన్: పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రత్యక్ష, పరోక్ష చర్యలకు మోదీ హయాంలోని భారత్ మిలటరీ పరంగా సత్వరమే స్పందించే అవకాశముందని, భారత్ తీరు గతంలో వలె లేదని అమెరికా నిఘా సంస్థ పేర్కొంది. అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆ దేశ పార్లమెంటుకు సమర్పించిన ‘యాన్యువల్ త్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్(ఏటీఏఆర్)’లో ఈ మేరకు వెల్లడించింది. భారత్, పాక్‌ల మధ్య పరస్పర ఆరోపణలు మరింత పెరిగే అవకాశమున్నప్పటికీ.. ప్రత్యక్ష యుద్ధానికి ఆస్కారం లేదని ఆ నివేదిక తేల్చిచెప్పింది. కశ్మీర్లో అస్థిరత, భారత్‌లో ఉగ్రదాడుల వంటి చర్యలతో అణ్వాయుధ దేశాలైన ఈ రెండింటి మధ్య ఘర్షణాత్మక వాతావరణం మరింత పెరిగే ప్రమాదముందని పేర్కొంది. -
చైనా యాప్స్‌తో ముప్పు: ఇంటెలిజెన్స్
ఢిల్లీ : చైనాకు చెందిన 52 మొబైల్ అప్లికేషన్లపై నిషేధం విధించాలని లేదా ప్రజలు వాటిని వాడకుండా చూడాలని నిఘా వర్గాలు బుధవారం కేంద్రానికి సిఫారసు చేశాయి. వీటి వల్ల దేశ భద్రతకే ముప్పు ఉందని హెచ్చరించాయి. చైనాతో లింక్ ఉన్న యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ద్వారా డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని నిఘా విభాగం అధికారులు తెలిపారు. భద్రతా సంస్థకు చెందిన సిబ్బంది ఎవరూ వీటిని వినియోగించరాదని సూచించారు. జూమ్, టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్ఇట్, క్లీన్ మాస్టర్ సహా 52 ఇతర మొబైల్ అప్లికేషన్ల ద్వారా డేటా తస్కరణకు గురవుతుందని ఓ నివేదికను ప్రభుత్వానికి నిఘా విభాగం సమర్పించింది. ఈ నివేదికపై ఇప్పటికే జాతీయ భద్రతా మండలి సానుకూలంగా స్పందించిందని, దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని ఓ అధికారి వెల్లడించారు. (గాల్వన్ లోయ ప్రాంతం మాదే: చైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు) జూమ్ వీడియో కాలింగ్ యాప్ ద్వారా వినియోగదారుల గోప్యతకు ముప్పు ఉందని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సమావేశాలకు ఈ యాప్‌ని వినియోగించరాదంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే జూమ్ యాప్ వాడకంపై పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించగా, కొన్ని దేశాల్లో పూర్తిగా నిషేధం కొనసాగుతుంది. జర్మనీలో ఈ యాప్‌పై ఆంక్షలు విధించగా, తైవాన్‌లో పూర్తిగా జూమ్ వాడరాదంటూ ప్రభుత్వం నిషేధం పెట్టింది. ఇక అమెరికా కూడా సెనేట్ సభ్యులను జూమ్ యాప్ కాకుండా ఇతర సోషల్ నెట్ వర్కింగ్ యాప్‌లను ఉపయోగించాలని పేర్కొంది. పెద్ద ఎత్తున ఈ యాప్‌పై ఆరోపణలు వస్తుండటంతో యూజర్లకు కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. సరికొత్త రీతిలో జూమ్ రూమ్స్‌ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. (‘భారత మాతా సినిమా’ కథ ముగిసిందా?! ) -
కామారెడ్డి నుంచి ‘సిమ్’లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వెలుగుచూసిన హనీట్రాప్ (వలపు వల) కేసు లో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు మూలాలు కామారెడ్డిలో ఉన్నా యని పోలీసులు గుర్తించారు. భారత ఆర్మీ అధికారులే లక్ష్యంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ విసిరిన వలపువల హైదరాబాద్‌లో బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబం ధించి బుధవారం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా పొల్కంపేటకు చెందిన మహమ్మద్ వాహెద్ పాషా, మహమ్మద్ అహ్మద్ పాషా అనే సోదరులు, మెదక్‌కు చెందిన మహమ్మ ద్ నవీద్ పాషాలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురిలో అన్నదమ్ములిద్దరూ సిమ్‌కార్డులు విక్రయించే ఔట్లెట్ నిర్వాహకులు. నవీద్ ఓ ప్రముఖ సెల్‌ఫోన్ కంపెనీలో టెలికం మేనేజర్. వీరు ముగ్గురూ ఈ కేసులో ప్రధాన నిందితులైన మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్, మహమ్మద్ జాఫర్‌లకు సిమ్‌కార్డులు సరఫరా చేసినట్లు గుర్తించామని సర్కిల్ ఇన్స్పెక్టర్ రుద్రభాస్క ర్, డీఐ ప్రసాదరావు బుధవారం మీడి యాకు తెలిపారు. కాగా, విదేశాల నుంచి వచ్చే కాల్స్‌ను వీఓఐపీ సాంకేతికతతో లోకల్‌కాల్స్‌గా మార్చడంతో తమ సంస్థ ఆదాయానికి భారీగా గండిపడిందని బీఎస్ఎన్ఎల్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు బుధవారం చాంద్రాయణగుట్ట పోలీసులకు బీఎస్ఎన్ఎల్ సంస్థ టెక్నికల్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఎలా చేశారంటే? పాషా సోదరుల వ్యాపారంలో పెద్దగా లాభాల్లేవు. సిమ్‌కార్డులు సమకూరిస్తే రెట్టింపు డబ్బులు ఇస్తానని నవీద్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఒక్కో సిమ్‌కార్డును రూ.300 చొప్పున 160 సిమ్‌కార్డులు విక్రయించారు. తమ వద్ద సిమ్‌లు తీసుకున్న వారి ధ్రువీకరణ పత్రాలతోనే కొత్త సిమ్‌కార్డులు యాక్టివేట్ చేశారు. సదరు సిమ్‌లను నవీద్ తీసుకెళ్లి రూ.500ల చొప్పున ఇమ్రాన్‌ఖాన్‌కు విక్రయించాడు. వీటితోనే హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ఇస్మాయిల్‌నగర్ సమీపం లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెక్నాలజీతో ప్రైవేటు టెలిఫోన్ ఎక్సే్చంజ్‌ని ఏర్పాటు చేశాడు. అలా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మారుస్తూ.. స్థానిక టెలికం కంపెనీల ఆదాయానికి గండికొట్టాడు. పాకిస్తాన్ నుంచి వచ్చే కాల్స్‌ను ఆర్మీ అధికారులకు మళ్లించడం గుర్తించడంతో వీరి వ్యవహారం వెలుగుచూసింది. ప్రధాన నిందితులైన మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్, మహమ్మద్ జాఫర్ పరారీలో ఉండగా.. ఈ కేసులో ఇమ్రాన్ భార్య రేష్మాసుల్తానాపైనా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
గూఢచర్యం ఎలా చేయాలో చెప్పే స్కూళ్లు!
బెర్లిన్: ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో గూఢచారుల రాజధానిగా పేరొందిన బెర్లిన్ నగరంలో కొత్తగా గూఢచార్యం ఎలా చేయాలో చెప్పేందుకు.. జర్మనీ దేశ నిఘూ వర్గాలు పాఠశాలలను ప్రారంభిస్తున్నాయి. ఇక తమ స్పై(వేగు) స్కూల్లో సైబర్‌దాడులను ఎలా అరికట్టాలో నేర్పించడంతో పాటు హ్యాకింగ్, ఉగ్రమూకలను ఏరి పారేయడం, కెమిస్ట్రీ ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసి ఏజెంట్లకు శిక్షణ ఇస్తామని జర్మన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. ఈ క్రమంలోనే సెంటర్ ఫర్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ట్రైనింగ్‌ను గూఢాచార సంస్థల అధిపతులు మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. కాగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీగా విడిపోయిన విషయం తెలిసిందే. ఉద్యోగావకాశాలు, మెరుగైన విద్య కోసం తూర్పు జర్మన్లు 1950-60 మధ్య కాలంలో పశ్చిమ జర్మనీకి వలసపోయారు. అందులో వందలాది మంది ప్రొఫెసర్లు, వైద్యులు, వ్యాపారవేత్తలు ఉండటంతో తూర్పు జర్మనీ ఆర్థిక వ్యవస్థ (బ్రెయిన్ డ్రైన్) బలహీనపడింది. ఈ క్రమంలో వలసలను కట్టడి చేసేందుకు తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961లో బెర్లిన్ గోడను నిర్మించింది. 1980లో సోవియట్ ఆధిపత్య ధోరణి పతనం కావడంతో.. తూర్పు జర్మనీలో ఆంక్షలు సడలి రాజకీయ సరళీకరణ ప్రారంభమైంది. దీంతో నవంబర్ 9, 1989 న బెర్లిన్ గోడను కూల్చివేశారు. ఈ క్రమంలో ఇటీవల బెర్లిన్ గోడ కూలి 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవటంతో అక్కడి ప్రజలు ఘనంగా వేడుకలు చేసుకున్నారు. -
మహిళల ముసుగులో పాక్ ఏజెంట్లు
న్యూఢిల్లీ: ఆన్లైన్లో అపరిచితులతో స్నేహం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సైన్యం హెచ్చరించింది. భారత జవాన్లే లక్ష్యంగా పాక్ గూఢచార సంస్థ పనిచేస్తోందని, ఆధ్యాత్మిక బోధకులు, విదేశీ మహిళలమంటూ స్నేహహస్తం అందించే వారి విషయంలో, ముఖ్యంగా సున్నితమైన సమాచారం పంచుకునే విషయంలో విచక్షణతో మెలగాలని సూచించింది. సున్నిత ప్రాంతాల్లో మెహరించిన సైనికులకు సంబంధించిన సమాచారం, ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు తెలుసుకునేందుకు తప్పుడు ప్రొఫైల్స్‌తో పాక్ ఏజెంట్లు భారత జవాన్లకు ఎరవేస్తున్నారని తెలిపింది. రెండు, మూడేళ్ల క్రితం నాటి ఇటువంటి 150 ప్రొఫైల్స్‌ను ఇప్పటివరకు గుర్తించామని గత నెలలోనే దేశవ్యాప్తంగా ఉన్న కమాండింగ్ సెంటర్లు, డైరెక్టరేట్ల ద్వారా హెచ్చరించినట్లు సైన్యం తెలిపింది. సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్‌కు చెందిన మహిళా ఏజెంట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా అందించారనే ఆరోపణలపై జోథ్‌పూర్‌లో ఒక జవానును తాజాగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పట్టుబడిన జవాను విచిత్ర బెహ్రా ఒడిశాకు చెందిన వారు. విచారణలో బెహ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు మహిళ మారు పేరుతో ఉన్న పాక్ ఏజెంటే అని నిర్ధారణకు వచ్చారు. -
బలవంతుల గుప్పెట్లో నిఘా వ్యవస్థలు
సమాజంలో కొందరు వ్యక్తులను, సంస్థలను ముందుగానే లక్ష్యంగా చేసుకుని, వారిపై భారీస్థాయిలో సాగిస్తున్న నిఘాపై చట్టం తీసుకురావలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పైగా జాతీయ భద్రత పేరిట పౌరుల ప్రాథమిక హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసివేయకూడదని సర్వోన్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. మన భద్రతా యంత్రాంగం మన ఫోన్లను ఎలా ట్యాప్ చేస్తోంది, మన ట్వీట్లను ఎలా అడ్డుకుంటోంది అని ఎవరైనా అడిగితే నిఘా సంస్థలు చూపే ఏకైక కారణం ఈ జాతీయ భద్రతే మరి. నిఘాను ఏయే పద్ధతుల్లో కొనసాగిస్తున్నారో మనం తెలుసుకోనంతవరకు నిఘాపై భవిష్యత్తులో తేబోయే ఏ చట్టం కూడా సమర్థవంతంగా అమలు కాదు. భారత్‌లోనూ, భారత్ వెలుపల ఉన్న పలుకుబడి కలిగిన వ్యక్తులు ఈ నిఘా వ్యవస్థలను ఎలా సేకరించి, ఉపయోగిస్తున్నారన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. భారతీయ సామాజిక, రాజకీయ కార్యకర్తలపై గూఢచర్యం జరపడానికి అధికారంలో ఉన్న శక్తులు ఇజ్రాయెల్ స్పైవేర్ అయిన పెగాసస్‌ను ఉపయోగిస్తున్నారన్న వార్త దేశంలోని అనేకమంది మానవ హక్కుల సమర్థకులు, పౌర సమాజ సభ్యులకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎవరికైనా ఆశ్చర్యం కలిగిందంటే మన దేశంలో ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు, ఎవరిని చేసుకోలేదు అని తెలుసుకోవడం కోసమే కావచ్చు. గోప్యతా చట్టం, నిఘారంగ సంస్కరణల అవసరాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న దేశంలో సాంకేతిక పరిజ్ఞానం మన ప్రాథమిక హక్కులపై ఎంత తీవ్ర ప్రభావం వేస్తున్నదో తెలుసుకోవాలనుకుంటున్న వారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటారు. వారికి సమాధానాలు కనుచూపు మేరలో దొరకవనుకోండి. ఈ ముఖ్య అంశం లోతుల్లోకి వెళ్లి పరిశీలించడంపై ప్రభుత్వవర్గాలు ఆసక్తి చూపడం లేదని కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల చేసిన ప్రకటనలు అత్యంత స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయి. భారత్‌లో రాజ్యవ్యవస్థ, దాని ఏజెంట్లు ఎలా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయనే అంశంపై ప్రజలకు సమాచారం తెలియజేయడం పట్ల వీరికి కించిత్ శ్రద్ధా లేదని ఈ ప్రకటనలు తెలుపుతున్నాయి. సమాజంలో ముందే లక్ష్యాలను ఎంచుకుని, భారీస్థాయిలో సాగిస్తున్న నిఘాపై చట్టం తీసుకురావలసిన అవసరం ఉందని పుట్టస్వామి వర్సెస్ కేంద్రప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పైగా జాతీయ భద్రత పేరిట పౌరుల ప్రాథమిక హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసివేయకూడదని సర్వోన్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. మన భద్రతా యంత్రాంగం మన ఫోన్లను ఎలా ట్యాప్ చేస్తోంది, మన ట్వీట్లను ఎలా అడ్డుకుంటోంది అని ఎవరైనా అడిగితే నిఘా సంస్థలు చూపే ఏకైక కారణం ఈ జాతీయ భద్రతే మరి. వ్యవస్థలు విఫలం కావడం, డేటా రక్షణ చట్టం ఏదీ లేకపోవడం వల్ల పెగాసస్, వాట్సాప్ నిర్వాకాలకు సంబంధించి సమాధానాలు రాబట్టడం కోసం మనం ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది? దిగ్భ్రాంతి కలిగిస్తున్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, ఈ మొత్తం హాస్యాస్పద విషయం గురించి మనం ఎన్నటికైనా తెలుసుకోగలమా అంటే ఎన్నో పరిమితులు ఉంటాయనే చెప్పుకోవాలి. నిఘా నీడలో ఉంటున్న భారతీయ ప్రజారాశులను, వ్యక్తులను వాట్సాప్ సంస్థ హెచ్చరించవచ్చు కానీ ఏ సమాచారాన్ని సేకరించారు, ఏ ఉద్దేశంతో సేకరించారు అనేది వాట్సాప్‌కు కూడా తెలిసి ఉండదు. ఈ స్పైవేర్‌ని సరఫరా చేసిన ఇజ్రాయెల్‌కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్‌ని భారతీయ చట్టాల పరిధిలో విచారించవచ్చు కానీ భోగోళిక పరిమితులు, ఇజ్రాయెల్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం నెరుపుతున్న సంబంధ బాంధవ్యాలు ఈ విచారణకు సమస్యగా మారవచ్చు. స్వదేశానికి సంబంధించినంతవరకు భారతీయ కోర్టులు ఈ వ్యవహారాన్ని పట్టించుకుని విచారణకు ఆదేశించినట్లయితే మనల్ని మనం అదృష్టవంతుల కిందే పరిగణించవచ్చు. పార్లమెంటులో సమాచార సాంకేతికతపై స్టాండింగ్ కమిటీ మన పౌరుల గోప్యతను ఎలా ఉల్లంఘిస్తున్నారో పరిశీలించే జవాబుదారీతనం కలిగిన వేదికల్లో ఒకటిగా ఉంటోంది. అయితే గత చరిత్రకేసి చూసినట్లయితే, నెట్ న్యూట్రాలిటీ, కేంబ్రిడ్జ్ అనలిటికా, ఆధార్ వంటి అంశాలపై కమిటీ పెండింగులో ఉంచిన నివేదికలు... మూసిన తలుపుల మధ్య కమిటీలు జరిపే చర్చలు ఏమాత్రం సరిపోవని మనకు తెలుపుతాయి. వాట్సాప్, ఎన్ఎస్ఓ గ్రూప్, మెల్టీ, ఎమ్హెచ్ఏ వంటి సంస్థలను తన ముందు హాజరు కావాలని పార్లమెంటరీ కమిటీ కోరినప్పటికీ, ప్రజలకు ఉపయోగపడే అంశాలను రహస్యంగా ఉంచే అవకాశం ఉంది. దీంతో వాస్తవమైన, స్థూల ఫలితాలు రాకపోయే అవకాశమే ఉంది. నిఘా పరికరాలను విక్రయించే వాణిజ్య సంస్థలన్నీ రహస్యంగా తమ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. వీటి గోప్యతా ముసుగును ఎత్తివేసేంతవరకు వాటిని ప్రజలకు జవాబుదారీగా చేయడం కష్టసాధ్యమే. నిఘాను ఏయే పద్ధతుల్లో కొనసాగిస్తున్నారో మనం తెలుసుకోనంతవరకు నిఘాపై భవిష్యత్తులో తేబోయే ఏ చట్టం కూడా సమర్థవంతంగా అమలు కాదు. ఇప్పుడు సమస్య ఏదంటే ఎన్ఎస్ఓ గ్రూప్‌కి చెందిన స్పైవేర్ ఎలా పనిచేస్తోంది అని కాదు.. భారత్‌లోని, భారత్ వెలుపల ఉన్న పలుకుబడి కలిగిన వ్యక్తులు ఈ నిఘా వ్యవస్థలను ఎలా సేకరించి, ఉపయోగిస్తున్నారన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. నిఘా పరికరాలు వాటిని ఉపయోగిస్తున్న ప్రక్రియల వెనుక ఉన్న ఉద్దేశాన్ని కనుగొనడమే ప్రస్తుతం అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ప్రభుత్వం కానీ ఇతర అధికారిక శక్తులు కానీ కొనసాగి స్తున్న నిఘా పద్ధతులకు చెందిన సమాచారం లీకుల ద్వారా మాత్రమే బయటకి వస్తోంది. అమెరికా ప్రిజం ప్రోగ్రాంపై ఎడ్వర్డ్ స్నోడెన్ బయటపెట్టిన సమాచారం ఈ లీకులన్నింటిలోనూ సుప్రసిద్ధమైంది. అలాగే హాకింగ్ టీమ్ వెల్లడించిన ఈమెయిల్స్, వికీలీక్స్ వెబ్సైట్లో నిక్షిప్తపర్చిన డాక్యుమెంట్లు వ్యక్తులపై నిఘాకు సంబంధించి జరుగుతున్న కొన్ని విధానాలు, భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరాలకు సంబంధించిన కొంత పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి. దాన్నిబట్టి భారత ప్రభుత్వం 2006లో హాకింగ్ టీమ్‌కి మొట్టమొదటిసారిగా ఉత్తరం రాస్తూ మనం సమావేశమవుదామని చెప్పినట్లు, వారి వద్ద ఉన్న నిఘా పరికరాల గురించి అడిగినట్లు వెల్లడైంది. కొన్ని నెలలక్రితం మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు వాట్సాప్ ఎన్క్రిప్షన్ హక్కును ఉల్లం ఘించి సమాచారాన్ని లాగగలిగే నిఘా పరికరాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇజ్రాయెల్ నుంచి సేకరించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆ వార్తలు తెలిపాయి. ప్రతిపక్షంపై పైచేయి సాధించడానికి, వోటర్ల వివరాలను తెలుసుకోవడానికి ఆధార్ వంటి మూలాధారాలను ఉపయోగించుకోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిఘా వ్యవస్థను ఉపయోగించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు సూచించాయి. ప్రజా ప్రయోజనాల రంగంలో పనిచేస్తున్నవారు తరచుగా జోక్ చేస్తున్నట్లుగా పెగాసస్ ఉదంతం ఒక విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. తాము మాట్లాడుతున్న ప్రతి మాటనూ, చేస్తున్న ప్రతి పనినీ తమ హృదయంలో ఎలాంటి సదుద్దేశాలు పెట్టుకోని వ్యక్తులు, సంస్థలు పరిశీలిస్తున్నారని వీరు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చర్చలకు ఎన్ఎస్ఓ గ్రూప్‌కు వ్యతిరేకంగా వాట్సాప్ పెట్టిన కేసు తప్పనిసరిగా అవసరమైన వాస్తవాన్ని బయటపెట్టింది. మన పౌరులపై నిఘా పెట్టడంలో యధాతతస్థితిని కొనసాగించకూడదు. ఈ విషయానికి సంబంధించి ఇటీవల వెల్లడయిన అంశాలు మనం ఘనంగా ప్రకటించుకుంటున్న పురోగామి ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడిగానే చెప్పాల్సి ఉంటుంది. స్పైవేర్ కథా కమామీషు వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకునే స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయెల్ కంపెనీ వివిధ దేశాల ప్రభుత్వాలకు, ఇతరులకు సరఫరా చేసిం దన్న విషయం ప్రపంచమంతటా ప్రకంపనలు సృష్టించింది. నిఘా పరికరం లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి వాట్సాప్‌ని హ్యాక్ చేయడం ద్వారా ఈ సాఫ్ట్ వేర్ ఆ ఫోన్ లో ఉన్న సమస్త సమాచారాన్ని నిఘా సంస్థలకు, గూఢచారులకు అందుబాటులో ఉంచుతుంది. ఈమెయిల్, ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫాంలు, ఫొటోగ్రాఫ్‌లు, డాక్యుమెంట్లు వంటి సమాచారాన్నంతటినీ ఇజ్రాయెల్ స్పైవేర్ పరికరం ద్వారా నిఘా సంస్థ సులువుగా రాబట్టి తాము ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తికి లేదా సంస్థకు, ప్రభుత్వ ఏజెన్సీకి అందజేస్తుంది. తన కస్టమర్ల ఖాతా వివరాలు తెలి యకుండా ఎండ్ టు ఎండ్ ఎ క్రిప్షన్ ఫీచర్‌ను కలిగివున్న వాట్సాప్‌ను సైతం హ్యాక్ చేయడంతో కోట్లాది కస్టమర్ల గోప్యత బట్టబయలైపోయింది. ప్రభుత్వంపై అసమ్మతి ప్రకటించే పౌర, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్షాలపై ప్రభుత్వాలు నిఘా పెట్టడం, పోన్లు ట్యాప్ చేయడం ఎప్పట్నుంచో జరుగుతూ వస్తున్నప్పటికీ కోట్లాది మంది వ్యక్తిగత యూజర్ల వివరాలపై ఇంత పకడ్బందీ నిఘాకు సాహసించడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఎన్ఎస్ఓ గ్రూప్ అనే ఒకే ఒక్క సంస్థ 45 దేశాల్లోని పౌరులు, నెట్‌వర్క్‌లపై నిఘా పెట్టి విస్తృత సమాచారాన్ని కొల్లగొట్టడం ఆధునిక సాంకేతిక నిఘా విస్తృతిని తెలుపుతోంది. వ్యాసకర్త: శ్రీనివాస్ కొడాలి (ది వైర్‌తో ప్రత్యేక ఏర్పాటు) డేటా, ఇంటర్నెట్పై స్వతంత్ర పరిశోధకులు -
అమర్నాథ్ యాత్రపై ఉగ్ర నీడలు
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రలో యాత్రికులను టార్గెట్ చేస్తూ అదును చూసి విరుచుకుపడాలని ఉగ్రవాదులు సన్నద్ధంగా ఉన్నారని నిఘా సంస్థలు హెచ్చరించాయి. నిఘా సంస్థల సమాచారం ప్రకారం జమ్ము కశ్మీర్‌లోని గందేర్బల్, కంగన్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు బల్తాల్ రూట్ ద్వారా వెళ్లే అమర్నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నట్టు నిఘా సంస్థలు పసిగట్టాయి. జులై 1 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రపై ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని తాజా హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. యాత్ర సాగే మార్గం వెంబడి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అమర్నాథ్ యాత్రలో పాల్గొనే యాత్రికుల భద్రత దృష్ట్యా వారి కదలికలను తెలుసుకునేందుకు ఉపకరించే బార్కోడ్ ఆధారిత స్లిప్‌లు జారీ చేయనున్నారు. యాత్రికుల భద్రతను పెంచేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలని పారామిలటరీ బలగాలు, సీఆర్పీఎఫ్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు జమ్ము కశ్మీర్లో భద్రతా అధికారులతో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా యాత్రికుల భద్రతకు మరిన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
భారీస్థాయిలో డ్రగ్స్ ధ్వంసం
సాక్షి, అగర్తలా(తిపుర): త్రిపురలో దాదాపు 8 కోట్ల రూపాయల విలువైన నిషేధిత మత్తు పదార్థలను పోలీసులు ధ్వంసం చేశారు. గత రెండు, మూడు నెలలుగా వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తుండగా ఈ పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. భారీస్థాయిలో ధ్వంసం చేసిన నిషేధిత పదార్థాలలో 4752 కిలోల గంజాయి, 56 కేజీల దగ్గుమందు సీసాలు, 3500 మందు బిల్లలు, 1.96 కేజీల హెరాయిన్‌ను ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిషేధిత పదార్థాలను ధ్వంసం చేసే ప్రక్రియ నిరంతరం జరుగుతుందని, గడిచిన సంవత్సరంలో 70వేల కేజీల డ్రగ్స్‌ను ధ్వంసం చేశామన్నారు. ప్రతినెల మత్తు పదార్థాలను ధ్వంసం చేస్తున్నామని, గడిచిన నెలలో వేరే పని ఉండటం వల్ల బ్రేక్ పడిందని ఇంటెలిజెన్స్ డీఐజీ డీ డార్లంగ్ తెలిపారు. -
అసలు వాళ్లు ఏపీ పోలీసులేనా?
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరసారాలాడి అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇపుడు పక్క రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్న ఏపీ పోలీసులను తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికలపై ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా సర్వే చేయిస్తున్నారు. ఈసీ ఆదేశాలతో విచారణ చేపట్టిన తెలంగాణ పోలీసులు చంద్రబాబు బండారాన్ని బట్టబయలు చేశారు. జగిత్యాల జిల్లాలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసుల సర్వే చేసిన ఘటనపై తెలంగాణ పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ నెల 27న ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసుల సర్వేపై మంత్రి కేటీఆర్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ సీరియస్ అయ్యారు. జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలీసు శాఖను ఆదేశించింది. వెంటనే రంగంలో దిగిన పోలీసులు సంఘటనపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలోపడ్డారు. ఇందులో భాగంగా ఆదివారం ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ ఏఆర్ డీఎస్పీ సీతారాములు సుదీర్ఘ విచారణ చేపట్టారు. స్థానిక టీడీపీ, టీఆర్ఎస్ నాయకులతోపాటు మొత్తం 16 మందిని విచారణ చేశారు. ధర్మపురిలో అనుమానాస్పదంగా సర్వే నిర్వహిస్తూ స్థానికులకు చిక్కిన ముగ్గురు అసలు ఏపీ పోలీసులేనా? ఎంత మంది వచ్చారు? ఎందుకొచ్చారు? ఎన్ని రోజులుగా మకాం వేశారు? ఎవరెవరిని కలిశారు? ఇక్కడ వారికి ఆశ్రయం కల్పించిందెవరు? ఎవరికైనా డబ్బులు పంపిణీ చేశారా? అనే కోణాల్లో విచారణ నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతూ స్థానికులకు పట్టుబడ్డ ముగ్గురిలో ఒకరు వారం రోజులక్రితమే ధర్మపురికి వచ్చాడని.. నాలుగు రోజుల క్రితం మరో ఇద్దరు వచ్చారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. తర్వాత ముగ్గురూ భక్తులమని చెప్పుకుంటూ స్థానిక టీటీడీ ధర్మశాలలోనే మకాం వేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వీరికి స్థానిక టీడీపీ నాయకులు ఆశ్రయం కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం టీడీపీకి చెందిన పలువురిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.. సర్వే చేసిన ముగ్గురు వ్యక్తులకు వారు ఎలాంటి సహకారం అందించారన్నది ఆరా తీశారు. ఆ ముగ్గురు కొంతమందితో మాట్లాడినట్లు తెలుసుకుని ఓ హోటల్ యజమాని, ఇద్దరు కారు డ్రైవర్ల నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇందులో ఒకరు.. అనుమానాస్పద వ్యక్తి వద్ద ఓ సీల్డ్ కవర్ చూశానని చెప్పాడు. అదేంటని తాను అడిగితే మీకు సంబంధం లేదని అతను బదులిచ్చినట్లు ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. అయితే, ఈ ఘటనపై టీడీపీ సీనియర్ నేత ఒకరు వివరణ ఇస్తూ ‘భారత పౌరులెవరైనా, వారికి ఆశ్రయం ఇవ్వడంలో తప్పు లేదు. అయితే, వచ్చిన వాళ్లు ఇక్కడ ఏం సర్వే చేశారో మాకు తెలియదు. వారినే అడిగితే తెలుస్తుంది. మేం ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆర్డర్ ఇవ్వలేదు. మాకు ఇతరులతో సర్వే చేయించుకోవాల్సిన అవసరం లేద’ని పేర్కొన్నట్టు సమాచారం. ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసుల పర్యటనపై టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్టు జగిత్యాల ఎస్పీ తెలిపారు. -
విశాల్‌పై జీఎస్టీ దాడులు అవాస్తవం
-
ఇది భారత్‌కు ప్రమాదకరం: నిఘావర్గాలు
న్యూఢిల్లీ: ఇరాక్, సిరియాలలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఇటీవలి కాలంలో సంకీర్ణ బలగాల చేతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల నుంచి సిరియా, ఇరాక్‌లకు వెళ్లి అక్కడ ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్న వారు.. తిరిగి స్వదేశాలకు పయనమయ్యే అవకాశాలు పెరిగాయని తెలుస్తోంది. భారత్ నుంచి వెళ్లి ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్న వారి సంఖ్య 40 నుంచి 50 మంది వరకు ఉంటుందని ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అంచనావేస్తున్నాయి. సంకీర్ణ సేనల దాడులతో ఇస్లామిక్ స్టేట్ తమ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలను క్రమంగా కోల్పోతున్న నేపథ్యంలో భారత్ నుంచి వెళ్లిన యువత తిరిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ సీనియర్ ఇంటలిజెన్స్ అధికారి వెల్లడించారు. యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించి.. ఇస్లామిక్ స్టేట్‌తో పూర్తిగా ప్రభావితమై ఉన్న వీరు.. దేశంలో ఉగ్రచర్యలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత ఆన్లైన్ రాడికలైజేషన్ ట్రెండ్ కన్నా ఇది ప్రమాదకరమైనది అని ఆయన వ్యాఖ్యానించారు. -
'నన్ను ఒక పశువులా హింసించారు'
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకొని ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి. ముఖ్యంగా గురుదాస్ పూర్ జిల్లాలోని దాద్వాన్ గ్రామం సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ పేదలు ఎక్కువ. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు ఎన్నో. నిత్యం పేదరికంలో బతికే వారికి అనూహ్యంగా ఒక పని దొరికి అది కూడా దేశానికి సేవ చేసే పని అయితే. అధికారిక గుఢాచారులు చేసే పని తామే చేయాల్సి వస్తే ఎవరు మాత్రం కాదంటారు. ఇలా గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన ఎంతోమంది పేదవారు.. తమపైనే ఆధారపడి బతికే కుటుంబాలను విడిచిపెట్టి రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) కోసం పనిచేసేందుకు కదిలారు. వీరు చేయాల్సిన పని ఏంటంటే పాకిస్థాన్ వెళ్లి అక్కడ కొన్ని ఫొటోలు తీసుకొని రావడం. బ్రిడ్జీలు, రహదారులు, ముఖ్యమైన ప్రదేశాల వీడియోలు పట్టుకురావడం. ఒక్కొక్కరు మూడు రోజులపాటు వెళ్లి రావాల్సి ఉంటుంది. ఇందుకుగానీ, రా వింగ్ వారికి చెల్లించే మొత్తం రూ.3000 వేలు. అయితే, ఇలా వారిని వాడుకుంటున్న రా అధికారులు వారు కష్టాల్లో పడినప్పుడు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు తీసుకుంటే.. దానియెల్ మసియా అనే ఓ వ్యక్తి ఉన్నాడు. అతడు సైకిల్ రిక్షా తొక్కుతూ రోజుకు 150 సంపాధించేవాడు. ఇతడు రా కోసం స్పై ఏజెంట్ గా పనిచేశాడు. కనీసం పన్నెండుసార్లు పాక్ ను సందర్శించి అక్కడి నుంచి ఎంతో విలువైన సమాచారం ఇచ్చాడు. కానీ, అతడిని పాక్ అధికారులు అరెస్టు చేసినప్పుడు మాత్రం రా అధికారుల నుంచి అతడికి గానీ, అతడి కుటుంబానికి గానీ ఎలాంటి సాయం అందలేదు. నాలుగేళ్ల తర్వాత విడుదలై వచ్చాడు. ఈ నాలుగేళ్లపాటు అతడి కుటుంబం పిల్లలు అత్యంత దుర్భర పరిస్థితుల మధ్య గడిపింది. అతడికి కనీస సహాయం కూడా ఇప్పటికీ అందడం లేదు. కానీ, అతడిని పాక్ అధికారులు ఎంత వేధించినా వారికి కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఇక డేవిడ్(50)అనే మరో వ్యక్తి.. ఇతడు కూడా ఇదే పనిపై వెళ్లి పోలీసులకు చిక్కాడు. వారి చేతుల్లో నరకం అనుభవించి విడుదలయ్యాడు. కనీసం అతడికి అయిన గాయాలకు, మెడికల్ ఖర్చులకు ఎవరి నుంచి రూపాయి సాయం అందలేదు. ఇక సునీల్ అనే మరో వ్యక్తి కూడా ఈ విషయంపై సమాధానం చెబుతూ తనకు గుఢాచారిగా ఉండటం అంటే ఇష్టమని అందుకే వెళ్లి తాను కూడా రాకు అనుబంధంగా పనిచేశానని, తనను జంతువును హింసించినట్లే హింసించారని.. ప్రస్తుతం పక్షవాత సమస్య కూడా వచ్చిందని.. కనీసం పెన్షన్ లాంటి సౌకర్యం కూడా అందకపోవడం తమ దౌర్భాగ్యం అని వాపోయాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. రాకు సహాయంగా పనిచేసే ఎంతోమందిది ఇప్పుడు ఇదే బాధ. -
గూఢచార సంస్థల లోగుట్టు!
ముస్లింలను సంస్థలో చేర్చుకోరాదని ‘రా’ ఒక విధానంగా పెట్టుకున్నట్టు పదేళ్ల క్రితం ‘ఔట్లుక్’ మేగజైన్ వెల్లడించింది. ఆ సంస్థలో ఉండే 15,000మంది సిబ్బందిలో ఒక్కరు కూడా ముస్లింలు లేరు. రాయిటర్స్ వార్తా సంస్థ ఈ కథనాన్ని వెలువరించేటపుడు ‘రా’ మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్‌తో మాట్లాడింది. ‘సంస్థలో ముస్లింలను కలిసినట్టు తనకు జ్ఞాపకం లేద’ని ఆయనన్నారట. అంతేకాదు... ‘సంస్థలో ముస్లింలు లేకపోవడమంటే అదొక లోపంకిందే లెక్క. పాకిస్తాన్లో ఉంటున్న ఒక భారతీయ పౌరుడిపై రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(దీన్ని ‘రా’ అని పిలుస్తారు) గూఢచారి అన్న ఆరోపణలు వచ్చాయి. సెల్ఫోన్లో తన కుటుంబంతో మరాఠీలో మాట్లాడాక ఆయనను పట్టుకున్నట్టు పాకిస్తాన్ నుంచి వస్తున్న కథనాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చే కాల్స్‌పై నిఘా ఉంటుంది గనుక అతన్ని గుర్తించి పట్టుకున్నారు. ఆయన దగ్గర భారత పాస్‌పోర్టు కూడా ఉంది. నకిలీ పాస్‌పోర్టులు కలిగి, ఉన్నతస్థాయి శిక్షణ పొందివుండే సినిమాల్లోని గూఢచారికి ఇది భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పుడు పట్టుబడ్డాయన నిజమైన ‘రా’ గూఢచారి అని తేలిన పక్షంలో నేను నిజంగా ఆశ్చర్యపోతాను. ఎందుకంటే ‘రా’ ఏజెంట్లు సీఐఏ, మొస్సాద్, ఐఎస్ఐ ఏజెంట్ల మాదిరే సాధారణంగా దౌత్య కార్యాలయాల్లో దౌత్యపరమైన పాస్ పోర్టులతో నియమితులవుతారు. ఇప్పుడు మన జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ ఆ పద్ధతిలోనే పాకిస్తాన్లో పనిచేశారని చదివాను. అయితే నాకు తెలిసినంతవరకూ ఆయన ‘రా’లో కాక ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లో ఉండేవారు. ఐబీ అనేది అంతర్గత గూఢచర్య సంస్థ. అది దేశ పౌరులపైనే ప్రధానంగా నిఘా ఉంచుతుంది. మర్యాదపూర్వకంగా చెప్పాలంటే అది దేశంలోని కార్యకలాపాలపై గూఢచర్యం నెరపుతుంది. దోవల్ ఐబీ అధికారి అయినప్పుడు ఆయన పాకిస్తాన్లో ఏం చేసేవారు? నాకు సరిగా తెలీదు...ఎందుకంటే ఈ రెండు సంస్థల గురించీ వదంతుల ద్వారానే తప్ప వాస్తవాల ద్వారా తెలిసే అవకాశం లేదు. కొన్నిసార్లు ‘రా’ చీఫ్‌లకు కూడా ఆ సంస్థలో ఏం జరుగుతున్నదో తెలియదు. ముస్లింలను సంస్థలో చేర్చుకోరాదని ‘రా’ ఒక విధానంగా పెట్టుకున్నట్టు పదేళ్ల క్రితం ‘ఔట్లుక్’ మేగజైన్ వెల్లడించింది. ఆ సంస్థలో ఉండే 15,000మంది సిబ్బందిలో ఒక్కరు కూడా ముస్లింలు లేరు. రాయిటర్స్ వార్తా సంస్థ ఈ కథనాన్ని వెలువరించేటపుడు ‘రా’ మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్‌తో మాట్లాడింది. ‘సంస్థలో ముస్లింలను కలిసినట్టు తనకు జ్ఞాపకం లేద’ని ఆయనన్నారట. అంతేకాదు... ‘సంస్థలో ముస్లింలు లేకపోవడమంటే అదొక లోపంకిందే లెక్క. ముస్లింలు లేరంటే వారిని తీసుకోవడానికి అయిష్టతతో ఉన్నట్టే అనుకోవాలి. అంతమంది ముస్లింలు దొరకడం కూడా కష్టమే’ అని దౌలత్ చెప్పారు. మరో ‘రా’ అధికారి గిరీష్ చంద్ర సక్సేనా మాట్లాడుతూ ‘నిఘా సమాచార సేకరణలో ముస్లిం అధికారుల అవసరం ఎంతో ఉంది. ఉర్దూ లేదా అరబిక్ పరిజ్ఞానం ఉన్నవారు చాలా తక్కువ. ఈ సమస్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు. అవసరం అంత తీవ్రమైనది అయినప్పుడు అది లోపం కిందే లెక్క. అలాంటపుడు వారిని ఎందుకు తీసుకోకూడదన్నది నాకు అర్ధంకాని విషయం. ట్రాక్-2 దౌత్యం(ప్రచ్ఛన్న దౌత్యం) చేసినవాడిగా నేను కొంతమంది మాజీ ఐఎస్ఐ చీఫ్‌లను కలిశాను. అందులో అసద్ దుర్రానీ ఒకరు. ఆయనా, నేనూ కొన్నేళ్లు ఒకే పత్రికకు వ్యాసాలు రాయడం చేత మా ఇద్దరికీ పరిచయం ఉంది. లాహోర్‌కు సమీపంలో ఉండే హరప్పాను నేను కొన్నేళ్లక్రితం సందర్శించినప్పుడు ఐఎస్ఐ గురించి కాస్త అర్ధమైంది. ఇప్పటికీ ఎంతో అద్భుతంగా పరిరక్షిస్తున్న సింధులోయ నాగరికతను చూడటానికి నేను అక్కడికి వెళ్లాను. అంతకు చాలా ఏళ్లకు ముందు తొలిసారి నేను అక్కడికి వెళ్లాను. కౌంటర్లో ఉండే వ్యక్తి స్థానికుల దగ్గర వసూలు చేసే మొత్తం కంటే విదేశీయుల దగ్గర ఎక్కువ వసూలు చేసి టికెట్లు ఇస్తున్నాడు. నేను స్థానికుణ్ణి కాదని మీరెలా చెప్పగలరని నేను అతన్ని ప్రశ్నించినప్పుడు ‘యహా కోయీ పాకిస్తానీ నహీ ఆతే’(ఇక్కడికి పాకిస్తానీయులెవరూ రారు) అని జవాబిచ్చాడు. ఈ పర్యాయం నేను టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లినప్పుడు నాకు లోకల్‌కు సంబంధించిన టికెట్ ఇచ్చారు. నేను కూడా భారతీయుడినని చెప్పలేదు. ఆ ప్రాంగణం లోపల మాత్రం సల్వార్, కమీజ్ ధరించిన ఒక వ్యక్తి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించాడు. మేం చాలా నిజాయితీగా చెప్పాం, ‘లాహోర్ నుంచి’ అని. అతడు వెళ్లిపోయాడు. అప్పుడు, ఈ ప్రాంతంలో తిరిగే విదేశీయులకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్ఐ భద్రపరుస్తుందని మా గైడ్ చెప్పాడు. ఆ సంగతి అతడికి తెలుసు. ఇది విని మేం విస్మయానికి గురయ్యాం. మళ్లీ ఆ వ్యక్తే మమ్మల్ని ఆపి, జాతీయతను తెలియచేసే గుర్తింపు కార్డులు చూపించమని అడిగాడు. వాస్తవానికి అలాంటి కార్డులను పాకిస్తాన్ జాతీయులంతా దగ్గర ఉంచుకుంటారు. మేం దొరికిపోయాం. మమ్మల్ని ఐఎస్ఐ కార్యాలయంలోకి తీసుకు వెళ్లారు. ఆ కార్యాలయం కూడా ఆ ప్రాంగణం లోపలే ఉంది. అక్కడ మా పాస్‌పోర్టుల వివరాలన్నీ నమోదు చేసుకుని అప్పుడు వదిలిపెట్టారు. ఇలా చేస్తే విదేశీయులకు ఎంత ప్రమాదమో తెలియదా? అని బాగా చీవాట్లు పెట్టి మరీ వదిలిపెట్టారు. ‘రా’ ఏజెంట్లు దౌత్య పాస్‌పార్టుల మీదే సాధారణంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారని ఇంతకు ముందే చెప్పాను. ‘రా’తో నా అనుభవం, అఫ్ఘానిస్తాన్ యుద్ధ వార్తలు రాయడానికి వెళ్లినప్పటి నుంచి, అంటే 2001, అక్టోబర్ నుంచి ఉంది. అక్కడికి వెళ్లాలంటే మనం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ ద్వారా వెళ్లి, తరువాతి ప్రయాణం కోసం దుషాంబి దగ్గర వేచి ఉండాలి. అక్కడ హోటల్లో నేను మధ్య వయస్కులైన ఇద్దరు భారతీయులను కలుసుకున్నాను. వాళ్లు సూటు, టై ధరించి ఉన్నారు. వాళ్లిద్దరూ ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ దగ్గర, సాయంత్రం బార్ దగ్గర కనిపించేవారు. ఈ ఇద్దరూ చాలా భిన్నమైనవాళ్లు. మా వాహనం తజకిస్తాన్-అఫ్ఘానిస్తాన్ సరిహద్దులలోకి వచ్చిన తరువాత మా పాస్‌పోర్టులను రష్యా సైనికులు తనిఖీ చేశారు. మిగిలిన అందరు విలేకరులను రష్యా వారు అనుమతించారు. ఇద్దరు భారతీయులను మాత్రం వెనక్కి, అంటే దుషాంబి పంపేశారు. నా కార్యక్రమం పూర్తయిన తరువాత రెండువారాలకి నేను హోటల్‌కు తిరిగి చేరుకున్నాను. నేను గుర్రం మీద నుంచి ఒక నదిలో పడిపోవడంతో నా పాస్‌పోర్టు మీద ముద్ర అలుక్కుపోయింది. ఇది నన్ను చాలా ఆందోళనకి గురి చేసింది. ఇక హోటల్ దగ్గర నన్ను ఉజ్బెకిస్తాన్‌కు వరకు తీసుకువెళ్లిన ట్యాక్సీ చెడిపోయింది. నా బ్యాగ్ పెట్టుకుని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అప్పుడు నేను చూసిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు అక్కడే ఉన్నాడు. అతడే అడిగాడు ఎక్కడి వెళుతున్నారు అని. తన కారు ఎక్కమని (వాళ్లది తెల్ల మెర్సిడెజ్ బెంజ్) ఆహ్వానించాడు. నా పాస్‌పోర్టు మీద ముద్ర వేయించుకోవడానికి సరిహద్దు దగ్గర ఆగాం. ఆ ఇద్దరు కారులోనే ఉండిపోయారు. అక్కడ ఉన్న అధికారికి నా కథంతా చెప్పడం మొదలుపెట్టాను. అతడు కారులో ఉన్న ఆ ఇద్దరి కేసి ఒకసారి చూసి, ఇకచాలు అన్నట్టు నాకు చేత్తో సైగ చేశాడు. అప్పుడే ఆ ఇద్దరు ఎవరో నాకు అర్థమైంది. నేను అమాయకుడినే. కానీ రష్యా సైనికులు, ఉజ్బెకిస్తాన్ అధికారులు ‘రా’కు చెందిన వాళ్లని ఒక్క చూపుతో పట్టేశారు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com - ఆకార్ పటేల్ -
కుటుంబ కలహాలే కారణం
న్యూఢిల్లీ: గూఢచార సంస్థ రీసర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) అధికారి అనన్య చక్రవర్తి ఇటీవల భార్యాపిల్లలను హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకోవడానికి కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. దక్షిణఢిల్లీలోని తన స్వగృహంలోనే ఆయన శనివారం ఈ దారుణానికి పాల్పడ్డారు. భార్య జయశ్రీ (42), సంతానం దిశ (12), అర్ణబ్ (17)ను చంపి తాను ఉరి వేసుకున్నారు. భార్యాపిల్లల మృతదేహాలపై తీవ్రగాయాలు కనిపించాయి. వారిని తీవ్రంగా హింసించి చంపినట్టు తేలింది. దీంతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. పొరుగువాళ్లు, నౌకర్లు, అపార్టుమెంట్ వాచ్‌మన్‌ను ప్రశ్నిం చారు. భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నప్పుడల్లా పిల్లలిద్దరూ తల్లికి మద్దతు ఇచ్చేవారని వెల్లడయింది. అయితే శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఎవరూ భోజనం చేయకపోవడంతో సగం ఉడికిన ఆహారం వంటగదిలో కనిపించింది. చక్రవర్తి కుటుంబం స్థానికంగా అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగేది. సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నా.. గొడవల గురించి ఎప్పుడూ ప్రస్తావించేవాళ్లు కాదని పొరుగువాళ్లు చెబుతున్నారు. వీళ్లంతా ఏ సమయంలో మృతి చెందారనే విషయం ఎయిమ్స్ పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. రక్తంతో తడిన సుత్తి, పెద్ద కత్తిని ఘటనాస్థలంలో కనిపించిందని, వీటితోనే చక్రవర్తి హత్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంటి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. అపరిచితులు లోపలికి బలవంతంగా ప్రవేశించినట్టు నిరూపించే ఆధారాలు కూడా లభించకపోవడంతో చక్రవర్తే ఈ హత్యలు చేసినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఈ అధికారికి ఢిల్లీలో దగ్గరి బంధువులు ఎవరూ లేరు. ఇద్దరు అక్కలు ఉన్నా వాళ్లు ఇతర నగరాల్లో నివసిస్తున్నారు. రాలో ఇన్స్పెక్టర్స్థాయి అధికారి అయిన చక్రవర్తి కేబినెట్ సెక్రటేరియెట్‌లో పనిచేసేవాడు. ఘటనాస్థలంలో లభిం చిన ఆధారాలన్నింటినీ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)కి పంపించామని, దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ అధికారి ఆత్మహత్య నగరవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.