భారత్‌ తీరు మారింది | India under PM Modi more likely to respond with military force to Pakistan | Sakshi
Sakshi News home page

భారత్‌ తీరు మారింది

Published Thu, Apr 15 2021 4:33 AM | Last Updated on Thu, Apr 15 2021 4:33 AM

India under PM Modi more likely to respond with military force to Pakistan - Sakshi

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌ రెచ్చగొట్టే ప్రత్యక్ష, పరోక్ష చర్యలకు మోదీ హయాంలోని భారత్‌ మిలటరీ పరంగా సత్వరమే స్పందించే అవకాశముందని, భారత్‌ తీరు గతంలో వలె లేదని అమెరికా నిఘా సంస్థ పేర్కొంది. అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఆ దేశ పార్లమెంటుకు సమర్పించిన ‘యాన్యువల్‌ త్రెట్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌(ఏటీఏఆర్‌)’లో ఈ మేరకు వెల్లడించింది. భారత్, పాక్‌ల మధ్య పరస్పర ఆరోపణలు మరింత పెరిగే అవకాశమున్నప్పటికీ.. ప్రత్యక్ష యుద్ధానికి ఆస్కారం లేదని ఆ నివేదిక తేల్చిచెప్పింది. కశ్మీర్లో అస్థిరత, భారత్‌లో ఉగ్రదాడుల వంటి చర్యలతో అణ్వాయుధ దేశాలైన ఈ రెండింటి మధ్య ఘర్షణాత్మక వాతావరణం మరింత పెరిగే ప్రమాదముందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement