చైనా యాప్స్‌తో ముప్పు: ఇంటెలిజెన్స్ | 52 China Linked Apps Red Flagged By Indian Intelligence | Sakshi
Sakshi News home page

52 చైనా యాప్‌పై నిషేధం దిశ‌గా చ‌ర్య‌లు!

Published Wed, Jun 17 2020 5:07 PM | Last Updated on Wed, Jun 17 2020 6:26 PM

52 China Linked Apps Red Flagged By Indian Intelligence - Sakshi

ఢిల్లీ :  చైనాకు చెందిన 52 మొబైల్ అప్లికేష‌న్ల‌పై నిషేధం విధించాల‌ని లేదా ప్ర‌జ‌లు వాటిని వాడ‌కుండా చూడాల‌ని నిఘా వర్గాలు బుధ‌వారం కేంద్రానికి సిఫార‌సు చేశాయి. వీటి వ‌ల్ల దేశ భ‌ద్ర‌త‌కే ముప్పు ఉంద‌ని హెచ్చ‌రించాయి. చైనాతో లింక్ ఉన్న యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగించ‌డం ద్వారా డేటా చోరీకి గురయ్యే అవ‌కాశం ఉంద‌ని నిఘా విభాగం అధికారులు తెలిపారు. భ‌ద్ర‌తా సంస్థ‌కు చెందిన సిబ్బంది ఎవ‌రూ వీటిని వినియోగించ‌రాద‌ని సూచించారు. జూమ్, టిక్‌టాక్, యూసీ బ్రౌజ‌ర్, జెండ‌ర్, షేర్ఇట్, క్లీన్ మాస్ట‌ర్ స‌హా 52 ఇత‌ర మొబైల్ అప్లికేష‌న్ల ద్వారా డేటా త‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంద‌ని  ఓ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి నిఘా విభాగం స‌మ‌ర్పించింది. ఈ నివేదిక‌పై ఇప్ప‌టికే జాతీయ భద్రతా మండలి సానుకూలంగా స్పందించిందని, దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఓ అధికారి వెల్ల‌డించారు. (గాల్వన్‌ లోయ ప్రాంతం మాదే: చైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు)

జూమ్‌ వీడియో కాలింగ్ యాప్  ద్వారా వినియోగ‌దారుల గోప్య‌త‌కు ముప్పు ఉంద‌ని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ స‌మావేశాలకు ఈ యాప్‌ని వినియోగించ‌రాదంటూ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అయితే జూమ్ యాప్ వాడ‌కంపై ప‌లు దేశాలు ఇప్ప‌టికే ఆంక్షలు విధించ‌గా, కొన్ని దేశాల్లో పూర్తిగా నిషేధం కొన‌సాగుతుంది. జ‌ర్మనీలో ఈ యాప్‌పై ఆంక్షలు విధించ‌గా, తైవాన్‌లో పూర్తిగా జూమ్ వాడ‌రాదంటూ ప్ర‌భుత్వం నిషేధం పెట్టింది. ఇక అమెరికా కూడా సెనేట్ సభ్యులను జూమ్ యాప్ కాకుండా ఇత‌ర సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ యాప్‌ల‌ను ఉప‌యోగించాల‌ని పేర్కొంది.  పెద్ద ఎత్తున ఈ యాప్‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌టంతో యూజ‌ర్ల‌కు కొత్త వెర్ష‌న్‌ను అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. సరికొత్త రీతిలో జూమ్‌ రూమ్స్‌ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్‌ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. (‘భారత మాతా సినిమా’ కథ ముగిసిందా?! )

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement