షాకింగ్‌ చంద్రగ్రహణ వీడియో : వైరల్‌ | Shock super moon alien claims go viral | Sakshi
Sakshi News home page

చంద్రగ్రహణం రోజు ఆకాశంలో అంతుచిక్కని వస్తువు 

Published Sat, Feb 3 2018 1:58 PM | Last Updated on Sat, Feb 3 2018 2:36 PM

Shock super moon alien claims go viral - Sakshi

సూపర్‌ మూన్‌

ఆకాశంలో అరుదైన అద్భుతమైన దృశ్యం జనవరి 31న ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. చంద్రుడు... సూపర్‌ మూన్‌, బ్లూ మూన్‌, బ్లడ్‌ మూన్‌లను ఒకేసారి తన వెంట పెట్టుకుని వచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు జనాలు ఎగబడ్డారు. జనవరి 31న ప్రపంచం మొత్తం చంద్రగ్రహణాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు. సోషల్‌ మీడియా సైతం ఈ సూపర్‌ మూన్‌ పిక్చర్లను విపరీతంగా షేర్‌చేసింది. అయితే ఈ గ్రహణ సమయంలో చంద్రుని పక్కనుంచి మెరుపు వేగంతో వెళ్లిన ఓ వస్తువుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సూపర్‌ మూన్‌ సందర్భంగా ఇలా వెళ్లిన వస్తువును ఏలియన్లుగా భావిస్తున్నారు. నాసా విడుదల చేసిన వీడియోలో ఈ వస్తువు కనిపించింది. ఆ వస్తువు కనిపించడం ద్వారా ఏలియన్స్ ఉన్నారనేందుకు నిదర్శనమని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. మనుషులు తయారు చేసిన వాహనమైతే ఇంత వేగంగా వెళ్లడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుణి చుట్టూ తిరిగిన గుర్తు తెలియని ఈ వస్తువు కచ్చితంగా ఏలియన్స్‌కు చెందినదేనని అంటున్నారు. ''మెరుపు వేగంగా చంద్రునికి ఎడమ వైపుకు కిందకి పడిపోతూ ఉందని, అలా కిందకి ట్రావెల్‌ చేసినట్టు'' శాస్త్రవేత్తలు చెప్పారు. యూట్యూబ్‌ ఛానల్‌ యూఎఫ్‌ఓమానియాలో ఈ వీడియోను అప్‌లోడ్‌ చేశారు. ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement