గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో తెలియదు. ఒక వేళ ఉంటే...అనే ఊహకు రూపమిస్తూ ఎన్నో సినిమాలు, వార్తలు, వార్తాకథనాలు. చివరకు భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఈ గ్రహాంతర వాసుల గురించి మాట్లాడారు. గ్రహాంతర వాసులు ఉంటే వారు మనకంటే శక్తివంతులు,తెలివిగలవారై ఉంటారని చెప్పారు. గ్రహాంతరవాసుల ఉనికిని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. గ్రహాంతరవాసులను ఎవరు చూడలేదు కానీ ‘ఫ్లైయింగ్ సాసర్’ అని పిలిచే ‘యూఎఫ్‌ఓ’లను చూశామని చాలామంది చెప్పారు