నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : ఇన్నాళ్లు అమెరికాలో మాత్రమే కనిపించిన యూఎఫ్‌ఓ (ఎగిరే సాసర్ లాంటి వస్తువు)లు ఇప్పుడు భారతదేశంలో కూడా కనిపిస్తున్నాయి. అది కూడా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసం దగ్గర. వివరాల ప్రకారం...ఈ నెల 7 న న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసమైన ‘లోక్ కళ్యాణ్ మార్గ్’ వద్ద ఆకాశంలో ఒక గుర్తు తెలియని వస్తువు తిరగడం చూసామని సీనియర్ సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే ఆ వస్తువెంటో తెలుసుకుందామని ప్రయత్నించామని కానీ దాని గురించి ఎటువంటి సమాచారం దొరకలేదని తెలిపారు. దాంతో భద్రతా అధికారులు ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన నివేదికలో ‘అంతా సవ్యంగానే ఉంద’ని తెలిపారన్నారు.
ఈ విషయం గురించి ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర పథక్ ‘ప్రధాని నివాసం వద్ద ఏదో గుర్తుతెలియని వస్తువు ఆకాశంలో చక్కర్లు కొట్టడం అయితే వాస్తమే. కానీ తర్వాత జరిపిన భద్రతా తనిఖీల్లో ప్రమాదకరమైనదేది మా దృష్టికి రాలేద’ని తెలిపారు. అంతేకాక భద్రతా కారణాల దృష్ట్యా అది యూఎఫ్‌ఓనా లేకా మరేదైన వస్తువా అనే విషయం గురించి మాత్రం తాము బయటకు వెల్లడించలేమని తెలిపారు.
ఇలా గుర్తు తెలియని..అనుమానాస్పద వస్తువులు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సెప్టెంబర్ 17 రాత్రి 10 గంటల ప్రాంతంలో డ్రోన్‌లాంటి వస్తువేదో పార్లమెంట్ భవనం చుట్టూ చక్కర్లు కొట్టినట్లు ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చింది. కానీ ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) రాడార్‌లో మాత్రం అటువంటిదేమి రికార్డవ్వలేదని సెక్యూరిటి అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment