Drone spotted over PM Modi's residence creates a stir - Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం.. ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది..

Published Mon, Jul 3 2023 9:28 AM | Last Updated on Mon, Jul 3 2023 10:39 AM

Drone Over PM Modi Residence Has Created a Stir - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ సంచారం కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఢిల్లీలోని మోదీ నివాసంపై ఓ డ్రోన్ కనిపించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నో ఫ్లయింగ్ జోన్‌లో డ్రోన్‌ సంచరించడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ప్రధానికి భద్రతా కల్పించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) అధికారులు వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

డ్రోన్ సంచరించేప్పుడు ప్రధాని మోదీ ఇంట్లోనే ఉన్నారని భద్రతా సిబ్బంది తెలిపారు. ప్రధాని నివాసంపై పలుమార్లు డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు ఎస్పీజీ నుంచి సమాచారం అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం డ్రోన్ ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి డ్రోన్‌ను స్వాధీనం చేసుకోలేదని పేర్కొన్నారు. కాగా పీఎం మోదీ నివాసం నో ఫ్లై జోన్ లేదా నో డ్రోన్ జోన్ కిందకు వస్తుందన్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: మోదీ అధ్యక్షతన నేడు కేబినెట్‌ భేటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement