ఇంఫాల్: ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై గుర్తు తెలియని వస్తువు(యూఎఫ్‌ఓ)ను గాలించేందుకు భారత వాయుసేన రఫెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. హసిమారా నుంచి రెండు రఫెల్ విమానాలను ప్రయోగించింది. కానీ రఫెల్ విమానాలు ఆ అనుమానిత వస్తువును గుర్తించలేకపోయాయి. ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో తిరిగొచ్చాయని అధికారులు తెలిపారు.
గగనతలంలో గుర్తుతెలియని వస్తువులు ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్‌వే పరిసరాల్లో ఎగురుతూ కనిపించినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు. అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ కమాండ్ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత ఆ వస్తువు కనిపించకుండా పోయిందని తెలిపారు.
గుర్తు తెలియని వస్తువులను పసిగట్టడానికి వాయు సేన హషిమార నుంచి రఫెల్ యుద్ధ విమానాన్ని పంపించింది. అత్యాధునిక సెన్సార్లు కలిగిన ఈ విమానం అత్యంత ఎత్తులో గాలించినప్పటికీ ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో వెనక్కి వచ్చింది. కాసేపటికీ మరో రఫెల్‌ను అధికారులు పంపించారు. అప్పుడు కూడా ఎలాంటి వస్తువు కనిపించకలేదని అధికారులు తెలిపారు. యూఎఫ్‌వో కారణంగా మూడు గంటల పాటు విమానరాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇదీ చదవండి: Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు
Comments
Please login to add a commentAdd a comment