ఏలియన్స్‌ మమ్మల్ని ఎత్తుకెళ్లాయి | US Man Returns To Site Of UFO Abduction | Sakshi
Sakshi News home page

సంచలన విషయాలు వెల్లడించిన వృద్ధుడు

Published Thu, Jun 27 2019 2:59 PM | Last Updated on Thu, Jun 27 2019 7:20 PM

US Man Returns To Site Of UFO Abduction - Sakshi

కుటుంబ సభ్యులతో పార్కర్‌

వాషింగ్టన్‌ : మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. సాధరణ మానవుడికైతే ఏలియన్స్‌ ఉనికి గురించి తెలుసుకోవడం మహా సరదా. ఇప్పటికి అమెరికాలో రహస్యంగా ఏలియన్స్‌ గురించి పరిశోధనలు జరుగుతున్నాయని జనాల్లో ఓ బలమైన నమ్మకం. వీటి ఆధారంగా తెరకెక్కిన హలీవుడ్‌ చిత్రాలకు లెక్కేలేదు. ఈ క్రమంలో ఏలియన్స్‌, యూఎఫ్‌ఓల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అమెరికాకు చెందిన పార్కర్‌. తను, తనతో పాటు మరో వ్యక్తిని ఏలియన్స్‌ అపహరించాయి అంటున్నారు. అయితే ఈ సంఘటన 1973 ప్రాంతంలో జరిగిందని తెలిపారు.

వివరాలు.. ‘1973 ప్రాంతంలో నేను, హిక్సన్‌ ఓ షిప్‌యార్డ్‌లో కూలీలుగా పని చేసేవాళ్లం. ఓ రోజు మేమిద్దరం విధులు ముగిసిన తర్వాత చేపలు పడుతూ కూర్చున్నాం. ఆ సమయంలో మా వెనక ఏదో వాహనం ఆగిన శబ్దం వినిపించింది. తిరిగి చూస్తే.. నీలం రంగు వెలుతురు మా వైపు రావడం కనిపించింది. ఆ వెనకే ఓ 30 అడుగుల భారీ నౌక లాంటిది అక్కడ దిగింది. అందులో నుంచి మూడు చిన్న వింత ఆకారాలు బయటకు వచ్చాయి. వాటిని చూడగానే మేం ఇద్దరం స్తంభించిపోయాం. ఆ వింత జీవులు మమ్మల్ని తాము వచ్చిన వాహనం వైపు  లాగడం ప్రారంభించాయి. లోపలికి వెళ్లిన తర్వాత మేమిద్దరం గాలిలో తేలుతున్నాం’ అన్నారు పార్కర్‌.

ఇంతలో ఆ వింత జీవులు తమ శరీరం మీద ఉన్న పెద్ద కన్ను వంటి ఆకారంతో తమని పరీక్షించాయన్నారు. కాసేపటి తర్వాత ఆ వింత జీవులు తామిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాయో అక్కడే వదిలి వెళ్లాయన్నారు. తమకు స్పృహ వచ్చే సరికి తామిద్దరూ ఆకాశం వైపు చేతులు ఎత్తి సాయం కోసం ఆర్ధిస్తున్నట్లు ఉన్నామని గుర్తు చేసుకున్నారు. తమ అర చేతులకు గాయాలు కూడా అయినట్లు గుర్తించామన్నారు. అయితే ఈ విషయాన్ని చెప్పినప్పుడు తొలుత అధికారులు ఎవరూ నమ్మలేదు. మేం తాగి ఉన్నాం అనుకున్నారు. కానీ మేం పాలిగ్రాఫ్‌ పరీక్ష(నిజ నిర్థారణ పరీక్ష)లో పాస్‌ కావడంతో మా మాటలను నమ్మారు. ఆ తర్వాత ఈ విషయం గురించి వాషింగ్టన్‌ పోస్ట్‌లో కూడా వచ్చింది అన్నారు. కాగా హిక్సన్‌ 2011లో మరణించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement