రోదసిలో భూపరిధికి కాస్త ఎత్తులో చీకటి నుంచి వేగంగా ప్రయాణిస్తున్న చిన్న చుక్కలాంటి వస్తువు ఒక్కటి ఐఎస్‌ఎస్ చానెల్‌లో దర్శనమిచ్చింది. లైవ్‌లో ఇది ఐదు సెకన్లు మాత్రమే కనిపించింది. ఆ వెంటనే లైవ్ ప్రసారాలు నిలిచిపోయాయి. ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ‘కోల్డ్‌పైరో’ అనే నెటిజన్ ఇది యూఎఫ్‌వో అయి ఉంటుందని, దీనిని గుట్టుగా ఉంచేందుకే నాసా లైవ్ ప్రసారాల్ని అకస్మాత్తుగా కట్ చేసిందని వ్యాఖ్యానించాడు. అయితే సాంకేతిక కారణాల వల్లే లైవ్ ప్రసారం నిలిచిపోయిందని నాసా పేర్కొంది.
యూఎఫ్‌వో అన్వేషకులు మాత్రం ఇది అద్భుతమైన వీడియో అని, భూమికి చేరువలో యూఎఫ్‌వోలు తిరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనమని అంటున్నారు. మరికొందరు మాత్రం వేగంగా ప్రయాణిస్తూ వెళ్లిన ఆ వస్తువు యూఎఫ్‌వో అనడానికి ప్రామాణిక ఆధారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విశ్వంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుండటం సాధారణమేనని అంటున్నారు.