elephants group
-
నీటి కాలుష్యమే పొట్టన పెట్టుకుంది... వీడిన 350 ఏనుగుల మృతి మిస్టరీ
బోట్స్వానాలో 2020లో ఏనుగుల మూకు మ్మడి మరణం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకేసారి ఏకంగా 350 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమ య్యాయి. ఈ ఉదంతంపై లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధనలు జరిపింది. ఆ ఏనుగుల మరణాల వెనుక మిస్టరీ నాలుగేళ్లకు వీడింది. అడవిలోని నీటి గుంతలు కలుషితమవడమే ఏనుగుల మృతికి కారణమని అధ్యయన బృందం తెలిపింది. ‘‘సైనో బ్యాక్టీరియా విడుదల చేసిన సైనో టాక్సిన్లు నీటిపై విషపూరిత నురగకు కారణమయ్యాయి. అదే ఏనుగుల మరణానికి దారి తీసింది’’ అని వెల్లడించింది.వర్షాధారిత గుంతల వల్లే.ఒకవాంగో డెల్టాలోని 6 వేల చదరపు కిలోమీట ర్ల పరిధిలో 20 నీటి గుంతలు కలుషితమైనట్టు అధ్యయనంలో తేలింది. ఆ నీటిని తాగాక 88 గంటల్లోనే ఏనుగులు చనిపోయినట్టు అంచనా వేసింది. అవి శాశ్వత నీటి వనరులు కావు. కేవ లం వర్షాధారిత గుంతలు. వాటివల్లే ప్రమాదం జరిగిందని అధ్యయన సారథి శాస్త్రవేత్త డేవిడే లోమియో చెప్పారు. చనిపోయిన ఏనుగులు వేర్వేరు వయసులవి. పైగా వాటి దంతాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. కనుక వాటిని వేటాడారన్న వాదన సరికాదు’’ అని తెలిపారు.ఆల్గే పెరుగుదలకు కారణం?సైనో బాక్టీరియాగా పిలిచే నీలం–ఆకుపచ్చ ఆల్గే లో అన్నిరకాలూ విషపూరితం కావు. కొన్నిరకాల సైనోబాక్టీరియా నిలకడగా ఉన్న నీటిలో ఒక రకమైన ప్రాణాంతక ఆల్గల్ బ్లూమ్స్ (హెచ్ఎబి) ను ఉత్పత్తి చేస్తుంది. బోట్స్వానాలో 2019లో అస్సలు వానల్లేవు. 2020లోనేమో విపరీతంగా వానలు పడ్డాయి. ‘‘అధిక వర్షపాతంతో భూమి నుంచి భారీ అవక్షేపాలతో పాటు పోషకాల పునరుత్పత్తి విపరీతంగా జరిగింది. అదే ఆల్గల్ పెరుగుదలకు కారణమైంది’’ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో ఇలాంటివి తరచూ జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల అతివృష్టి, అనావృష్టితో ఆఫ్రికా దక్షిణ భాగం వైరుధ్య వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోందని వారంటున్నారు. ‘‘ఇదే నీటిపై ప్రభా వం చూపుతోంది. దాంతో జంతువులు విపత్కర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి’’ అని తెలిపారు. అడవులు, పార్కుల్లోని నీటి వనరుల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చాలా అవసరమన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తిరుమల: పాప వినాశని మార్గంలో ఏనుగుల హల్చల్
సాక్షి, తిరుమల: తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. తిరుమలలోని పాప వినాశనం మార్గంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఒక్కసారిగా గుంపు రోడ్లమీదకు వచ్చాయి. వివరాల ప్రకారం.. తిరుమలలోని పాప వినాశనం వద్ద ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. పార్వేట మండపం ప్రాంతంలో నిన్న రాత్రి చెట్లను ఏనుగులు నేల కూల్చాయి. ఏనుగుల మంద హల్ చల్ చేస్తోంది. ఈ గుంపులో మొత్తం ఏనుగులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక, ఏనుగుల సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. -
మావటీల జీవితాల్లో వెలుగు తెచ్చారు
‘నాకు అడివింటే చాలా భయం’ అంటుంది బెల్లి. ఆస్కార్ వచ్చిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ లో మావటి బొమ్మన్ భార్య ఆమె. భర్తతో కలిసి రఘు అనే పిల్ల ఏనుగును ఆమె సాకుతుంది. దాంతోపాటు ‘అమ్ము’ అనే ఇంకో పిల్ల ఏనుగు బాగోగులను బెల్లి చూస్తుంది. బొమ్మన్ ప్రభుత్వ ఉద్యోగి. బెల్లి కాదు. అయినా సరే భర్త డ్యూటీలో ఆమె భాగం పంచుకుంది. భర్తతో పాటే పసి ఏనుగులను చూసుకుంది. ‘నా భర్తను పులి చంపింది. అప్పటి నుంచి అడివంటే భయం. బొమ్మన్‌ను చేసుకున్నాక కొంచెం భయం పోయింది. పిల్ల ఏనుగుల బాగోగుల్లో పడ్డాక, వాటి వెంట తిరుగుతుంటే అడివంటే భయం పోయింది’ అంటుంది బెల్లి. నీలగిరి (ఊటీ) అడవుల్లో ఉండే ఎలిఫెంట్ క్యాంపుల్లో ఏనుగుల సంరక్షణ మావటీలు చూస్తారు. వీళ్లంతా దాదాపు ఆ ప్రాంత గిరిజనులే. ఏనుగులను చూసుకోవడం మగవారి పనే. అయితే బొమ్మన్ చూసేది పిల్ల ఏనుగులను కనుక వాటి అమాయకత్వానికి ముగ్ధురాలై అమ్ము కూడా వాటితో అనుబంధం పెంచుకుంటుంది. ఆమెకు రఘు, అమ్ము ఎంత మాలిమి అంటే డాక్యుమెంటరీలో అమ్మును పిలిచి ‘ఏయ్... నా ఒడిలో కాదు. పక్కన పడుకో. లేకుంటే దెబ్బలు పడతాయి’ అనంటే ఆ ఏనుగు ఆమె పక్కన మెల్లగా ఒత్తిగిలి పడుకోవడం ముచ్చట గొలుపుతుంది. అమ్ముకు బెల్లి రెండు జడలు వేసి నవ్వుకుంటూ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంటరీ ముగుస్తుంది. అయితే బొమ్మన్ వల్ల, అమ్ము వల్ల, ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన కార్తికి వల్ల దేశంలో ఇప్పుడు ఏనుగుల సంరక్షణ గురించి చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు సి.ఎం స్టాలిన్ వెంటనే స్పందించి బొమ్మన్, బెల్లిలను పిలిచి చెరొక లక్ష డబ్బు ఇచ్చి సన్మానం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న 91 మంది మావటీలకు కూడా మనిషికో లక్ష ఇవ్వనున్నారు. వీరి నివాసాల కోసం 9 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఏనుగుల క్యాంపుల కోసం 13 కోట్లు మంజూరయ్యాయి. ప్రేమ, ఆదరణల వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది. బొమ్మన్, బెల్లిలతో అది మరోసారి రుజువయ్యింది. -
Viral Story: తప్పతాగి పడిపోయిన ఏనుగుల గుంపు.. అందులో నిజమెంత?
సాక్షి, భువనేశ్వర్: ఏనుగులు తప్పతాగి పడిపోవడంమేంటి? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని షిల్పాద గిరిజన గ్రామ ప్రజలు అదే చెప్తున్నారు. తాము నాటు సారా తయారీ కోసం పులియబెట్టిన ద్రావణాన్ని 24 ఏనుగుల గుంపు తాగేసి సోయి తప్పి పడిపోయాయని అంటున్నారు. స్థానిక గిరిజనులు చెప్తున్న వివరాల ప్రకారం.. షిల్పాదా జీడిమామిడి అడవిలోకి గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వెళ్లాం. అక్కడే తమకు మహువా (ఇప్ప పూలు) పువ్వులతో నాటు సారా తయారు చేసుకునే కుటీరం ఉంది. మొత్తం 24 ఏనుగుల గుంపు తమ కుటీరం వద్ద ఒక్కోటి ఒక్కోచోట పడుకుని ఉన్నాయి. అవి నిద్రకు ఉపక్రమించాయేమోనని తొలుత భావించాం. వాటిని నిద్ర లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ, సారా తయారీకని మహువా పువ్వులను నీటిలో పులియబెట్టిన ద్రావణాన్ని అక్కడ నిల్వ ఉంచాం. అది కనిపించలేదు. ఆ కుండలన్నీ పగలిపోయి ఉన్నాయి. కొన్ని ఖాళీగా కనిపించాయి. అప్పుడు తెలిసింది.. అవి ఆ ద్రావణాన్ని ఫూటుగా సేవించి మత్తుగా పడుకుని ఉన్నాయని! వెంటనే విషయాన్ని అటవీ అధికారులకు తెలిపామని నిరయా సేథి అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఏనుగుల్లో 9 మగ, 9 ఆడ, 6 గున్నవి ఉన్నాయని వెల్లడించారు. (చదవండి: ప్రెగ్నెంట్ అంటూ... ప్లాస్టిక్ బొమ్మతో షాకిచ్చిన మహిళ!) అటవీ అధికారులు ఏమన్నారంటే.. పాటనా అటవీ రేంజ్ అధికారులు షిల్పాద ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. ఏనుగులను నిద్ర లేపేందుకు భారీ డ్రమ్ములను వాయించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏనుగులు నిద్ర లేచి అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు పాటనా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఘసీరాం పాత్రా తెలిపారు. అయితే, గ్రామస్తులు చెప్తున్నట్టుగా ఏనుగులు సారా తయారీ ద్రావణాన్ని తాగడంపై క్లారిటీ లేదని.. అవి గాఢ నిద్రలో ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, మహువా పూల శాస్త్రీయ నామం మధుకా లోంగిఫోలియా. భారత్‌లోని పలు ప్రాంతాల గిరిజన ప్రజలు ఈ పూలతో సారా తయారు చేసుకుంటారు. (చదవండి: ఎవరీ వేటగాడు! 24 క్రూరమృగాలను వేటాడిన చరిత్ర) -
కదలిక గుర్తించి..ఆపద గట్టెక్కించి!
రాత్రీపగలూ కంటిమీద కునుకులేకుండా గ్రామాలపైకి దూసుకొస్తున్న ఏనుగుల మందను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రైతులు, పంటలకు శాశ్వత రక్షణ కల్పించేదిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న బేస్ క్యాంప్‌లు, ట్రాకర్ల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. తద్వారా ఏనుగుల సంచారాన్ని గ్రామస్తులు, రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయవచ్చని భావిస్తోంది. ఈ మేరకు అటవీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో ఇటీవల ఏనుగుల సంచారం ఎక్కువైంది. రైతులు తీవ్ర నష్టాలు మూటగట్టుకుంటున్నారు. దీంతోపాటు పలువురు ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతున్నాయి. ఈ సమస్యపై గతంలో పలువురు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో వెంటనే బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏనుగుల కదలికలపై ప్రత్యేక దృష్టి ఇటీవల పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలాల్లో ఏనుగుల దాడులు పెచ్చుమీరాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి, తద్వారా వాటి కదలికలను ఎప్పటికప్పుడు గ్రామస్తులకు తెలియజేయడంతో పాటు, వాటిని గ్రామాల వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కుప్పం ప్రాంతంలో ఐదు, పలమనేరు పరిధిలో నాలుగు, చిత్తూరులో రెండు బేస్ క్యాంపులు ఉన్నాయి. వీటితోపాటు పెద్దపంజాణి, సోమల మండలాల్లో ఆవులపల్లి, పేటూరు ప్రాంతాల్లో కొత్త బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఇవి ఏర్పాటు చేస్తే ఒక్కో బేస్ క్యాంప్ సుమారు 40 నుంచి 50 చ.కి.మీ పరిధిలో ఏనుగుల కదలికలు గమనించేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొత్తం మూడు బేస్ క్యాంపులకు కలిపి సుమారు 15 మంది ట్రాకర్లు అందుబాటులోకి రానున్నారు. సత్వర చర్యలకు అవకాశం ట్రాకర్ల సహాయంతో ఏనుగుల కదలికలతో పాటు మిగిలిన అడవి జంతువుల గురించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందే అవకాశం ఉంది. గ్రామాల వైపు ఏనుగుల గుంపు వస్తే, ఆయా గ్రామాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేసేందుకు వీలుంటుంది. అదే విధంగా అటవీశాఖ అధికారులు కూడా టపాసులు, డప్పులు లాంటివి సిద్ధం చేసి ఆయా గ్రామాల వైపునకు ఏనుగుల గుంపు వెళ్లకుండా సత్వరచర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది. ప్రస్తుతం పుంగనూరు రేంజ్లో 20 నుంచి 25 ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇందులో 3 మదపుటేనుగులు ఉన్నాయి. అయినా గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేయలేదు. ఇక బేస్ క్యాంపుల ఏర్పాటుతో ఏనుగుల బెడద బాగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 80 నుంచి 90 ఏనుగులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఏనుగుల కట్టడికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలమనేరు ప్రాంతంలో 6 కి.మీ సోలార్ ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయి. మరో 15 కి.మీ. దూరం సోలార్ ఫెన్సింగ్ వేసేందుకు అనుమతులు మంజూరయ్యాయి. జనంలో నుంచి అరణ్యంలోకి.. జనారణ్యంలోకి వచ్చిన ఏనుగులను సురక్షితంగా తిరిగి అడవిలోకి పంపేందుకు సత్వర చర్యలు చేపట్టాం. తమిళనాడు, కర్ణాటక నుంచి ఏయే మార్గాల్లో ఏనుగులు వస్తున్నాయో గుర్తిస్తున్నాం. వాటి వల్ల ప్రజలకు, పంటలకు నష్టం వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపట్టాం. బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. 50 మందితో ఏనుగుల ట్రాకింగ్ చేస్తున్నాం. -
ఫిరంగి శబ్ధం.. తొణకని గజం
మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ దసరా ఉత్సవాల కోసం మైసూరులో గజరాజులు వివిధ రకాల శిక్షణలో నిమగ్నమయ్యాయి. 14 ఏనుగుల తాలీము జోరుగా కొనసాగుతోంది. సోమవారం కుశాల తోపులో గజరాజులు, గుర్రాల ముందు ఫిరంగి పేలుళ్లను నిర్వహించారు. దసరా రోజున జంబూసవారీ ఊరేగింపులో ఫిరంగులను పేలుస్తారు, వాటి శబ్ధాలకు అలవాటు పడేలా ఇప్పటినుంచే శిక్షణ ఆరంభించారు. 30 మంది పోలీసు సిబ్బంది 7 ఫిరంగుల్లో మందుగుండును కూర్చి పేల్చారు. పెద్ద ఎత్తున పొగ, శబ్ధం వచ్చినా ఏనుగులు, గుర్రాలు ఏమాత్రం బెదరలేదు. 21 సార్లు పేలుళ్లు జరిపారు. (చదవండి: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..సంతోషం ఆవిరి) -
ఏనుగులతో సెల్ఫీ అంటే... అట్లుంటది మరీ!: వైరల్ వీడియో
ఇటీవల యువతకు సెల్ఫీ క్రేజీ మాములుగా లేదుగా. ఎలాంటి ప్రదేశంలో ఉన్నాం అన్న స్ప్రుహ కూడా లేకుండా సెల్పీ మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు సెల్ఫీలు తీసుకుంటూ చనిపోయిన వాళ్లు కోకొల్లలు. అయినప్పటకీ ఎవరూ ఎంత ప్రమాదకరమైన 'తగ్గేదే లే' అంటూ సెల్పీలు తీస్తూనే ఉంటున్నారు. ఇక్కడ కూడా ఇద్దరు ప్రబుద్ధులు అలానే చేసి చివరికి బతుకు దేవుడా అంటూ పరుగు లంఘించారు. ఏం జరిగిందంటే... ఇదరు వ్యక్తులు కారులో వెళ్తుండగా ఒక ఏనుగులు గుంపు రోడ్డు పైకి వస్తుంది. దీంతో వాళ్లు కారు ఆపి మరీ ఆ ఏనుగుల గుంపు వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించారు. ప్రమాదం అని తెలిసి కూడా వాటికి దగ్గరగ వెళ్తారు. మొదట అవి సెల్ఫీ తీసుకునేందుకు ఇష్టం లేదన్నట్లు తమ ముఖాన్ని పక్కకు పెట్టుకుంటాయి. కాసేపటి తర్వాత ఒక్కసారిగా కోపంతో మాతో సెల్ఫీలా... అన్నట్లుగా ఒక్కసారిగా ఉరుముతూ వాళ్ల మీదకు వస్తాయి. దెబ్బతో సదరు వ్యక్తులు భయంతో పరుగెడుతూనే ఉంటారు. Selfie craze with wildlife can be deadly. These people were simply lucky that these gentle giants chose to pardon their behaviour. Otherwise, it does not take much for mighty elephants to teach people a lesson. video-shared pic.twitter.com/tdxxIDlA03 — Supriya Sahu IAS (@supriyasahuias) August 6, 2022 (చదవండి: వామ్మో! ఏంటీ దెయ్యం అలా ఎలా చేస్తోంది) -
పార్వేటమండపం సమీపంలో ఏనుగుల గుంపు కలకలం
తిరుమల: తిరుమల పాపవినాశనం రోడ్డులోని పార్వేటమండపం సమీపంలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం ఏనుగుల గుంపు రోడ్డును దాటేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో రోడ్డు మీదుగా వెళుతున్న వాహనచోదకులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రాంతంలో తర చూ ఏనుగుల గుంపు సంచరిస్తోంది. సమీపంలోని నీటి కొలనుకు వచ్చే క్రమంలో ఏనుగులు రోడ్డుపైకి, ఉద్యాన వనాల్లోకి వస్తున్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో రక్షణ గోడను, ఫెన్సింగ్‌నూ ఏనుగులు ధ్వంసం చేశాయి. అయితే ఏనుగులను తరిమేందుకు చర్యలు తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. -
Viral Video: పరుగెత్తుకొచ్చి హగ్గులిచ్చిన ఏనుగుల గుంపు
ఇంతవరకు మనం జంతువులకు సంబంధించిన పలు రకాలు వీడియోలు చూశాం. తమ యజమానులను రక్షించే జంతువులను చూశాం. అయితే ఇక్కడ ఏనుగులు తమ సంరక్షకుడిని 14 ఏళ్ల విరామంతో చూడంటంతో ఏం చేశాయో చూడండి. (చదవండి: సన్నీ లియోన్‌కి హోం మంత్రి వార్నింగ్!) అసలు విషయంలోకెళ్లితే....సేవ్ ది ఎలిఫెంట్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు డెరెక్ థాంప్సన్ 14 నెలలు తర్వాత తన సంరక్షణలో పెరిగిన ఏనుగులను ఒక నది వద్ద చూశాడు. అయితే ఆ ఏనుగులు తమ సంరక్షకుడిని చూడగానే ఆనందంతో ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చాయి. పైగా తమ కేర్‌టేకర్‌ని తొండాలతో చుట్టుముట్టి హగ్గ్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి. అవి మనుషుల ఏ విధంగా తమ ప్రియమైన వారిని చాలా రోజుల తర్వాత చూస్తే ఏవిధంగా ఆనందంగా దగ్గరకు వచ్చి ప్రేమగా ఆలింగనం చేసుకుంటారో అలాగే ఆ ఏనుగులు కూడా చేశాయి. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బ్యూటెంగేబిడెన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: పాములతో మ్యూజిక్ షూట్... షాకింగ్ వీడియో!) Elephants reunite with their caretaker after 14 months.. Sound on pic.twitter.com/wSlnqyuTca — Buitengebieden (@buitengebieden_) December 23, 2021 -
పుట్టిన 20 నిమిషాలకే నిలబడి.. గంటకే నడక!!
‘ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగూ.. అంటూ రోజూ ఒకే పాటను యూట్యూబ్‌లో చూసి చూసి విసిగిపోయి ఉన్నాడు చిట్టిగాడు. ఫోన్ పక్కనపడేసి కిచెన్‌లో ఉన్న అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ‘అమ్మా.. మంచి ఏనుగు కథ చెప్పమ్మా? అంటూ మారాం చేశాడు. చిట్టిగాడి అల్లరి భరించలేం అనుకున్న లలిత.. పద్నాలుగు సింహాలను తరిమిన గున్న ఏనుగు కథ చెప్పడం మొదలుపెట్టింది. అనగనగా ఒక అడవి. ఒకనాడు ఒక గున్న ఏనుగు తన తల్లి నుంచి తప్పిపోయింది. ఆకలితో ఉన్న ఓ సింహాల గుంపు కంట పడడంతో.. ఆ పిల్లను తరమడం ప్రారంభించాయి. ఒకేసారి 14 సింహాలను చూసినా అది భయపడలేదు. ధైర్యంగా తన శక్తిమేర ప్రాణాల కోసం పోరాడింది. అక్కడే ఉన్న వాగు నీళ్లలోకి అస్తమానం పరిగెడుతూ.. బయటకు వస్తూ సింహాలను తరిమి కొట్టింది. చేసేది ఏం లేక సింహాలు దూరంగా నిల్చుని చూస్తూ ఉండిపోయాయి.. అంటూ చెప్తూ పోతోంది. ఇంతకీ ఆ గున్న వాళ్ల అమ్మతో కలిసిందా అమ్మా? అని ఆత్రుతగా అడిగాడు చిట్టిగాడు. అయితే ఇది వాస్తవ ఘటన. ఏడేళ్ల క్రితం జాంబియా సౌత్ లువాంగ్వా ‘నార్మన్ కార్’ సఫారీలో జరిగిందని వార్తలో చదివింది లలిత. ఆపద సమయంలో ధైర్యం ప్రదర్శించిన ఆ గున్న ఏనుగు పేరు ‘హెర్క్యులస్’(గ్రీకు పురాణగాథల్లో వినిపించే వీరుడి పేరు)గా ప్రపంచం మొత్తం మారుమోగిపోయింది కూడా. ఆ వివరాలను సెల్ఫోన్లో వెతుకుతున్నప్పుడు.. ఇవాళ(ఆగష్టు12న) World Elephant Day అని కనిపించింది లలితకు. ‘చిట్టీ.. ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే రా. అంటే ఇవాళ ఏనుగుల రోజు. కాబట్టి, వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తా’ అంటూ మొదలుపెట్టింది వాళ్ల అమ్మ. ► ఏనుగును వాళ్ల అమ్మ 22 నెలలు కడుపులో మోస్తుంది. పుట్టిన వెంటనే అవి నడుస్తాయి చిట్టీ(చిట్టీ నోరెళ్ల బెట్టి చూస్తూ.. వింటున్నాడు). అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చిన 20 నిమిషాలకే లేచి నిలబడతాయి. గంటకే నడుస్తాయి కూడా. రెండు రోజుల తర్వాత మందలో కలిసి ముందుకెళ్తాయి. అలా ఉన్నాయి కాబట్టే అవి గుంపుగా బతకగలుగుతున్నాయి. తిండి-నీళ్ల కోసం ఎంతో దూరం వెళ్లగలుగుతున్నాయి. చైనాలో వందల కిలోమీటర్లు ప్రయాణించిన ఏనుగుల మంద.. హాయిగా విశ్రాంతి తీసుకున్న ఫొటో ►ఈ భూమ్మీద అతిపెద్ద జీవి.. ఆఫ్రికన్ ఏనుగు చిట్టీ. పుట్టినప్పుడే వాటి బరువు 120 కేజీలు ఉంటుంది. పెద్దవి 3 మీటర్ల ఎత్తు.. 6000 కేజీలకు పైగా బరువు ఉంటాయవి. ఏనుగులు పూర్తిగా ఎదగడానికి 35-40 సంవత్సరాల టైం పడుతుంది. అలాగే అవి 60-70 సంవత్సరాలు బతుకుతాయి. ►ఈ భూమ్మీద ఏనుగులు రెండు రకాలు ఉన్నాయి చిట్టీ. ఒకటి ఆఫ్రికన్ ఏనుగులు.. రెండోది ఆసియన్ ఏనుగులు. ఇవే చాలా దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ‘మరి వాటిని ఎలా గుర్తుపట్టడం అమ్మా?’ అంటూ అడిగాడు చిట్టి. ఆఫ్రికన్ ఏనుగుల తొండం చివర రెండు వేళ్ల మాదిరి ఉంటుంది. అదే ఆసియన్ ఏనుగులకు ఒకటే ఉంటుంది. ఇక ఈ తొండంలో ఎనిమిది లీటర్ల నీళ్ల దాకా పడతాయి. తొండం సాయంతోనే నీళ్లు తాగుతాయి. ఆహారం తీసుకుంటాయి. స్నానాలు చేసేటప్పుడు మగ్గులా కూడా వాడుకుంటాయి. ►ఏనుగుల శరీరంపై చర్మం చాలా భాగాల్లో మందంగా(2.5 సెంటీమీటర్ల) ఉంటుంది. దుమ్ము, బురద స్నానాలతో సూర్య కిరణాల నుంచి వేడి నుంచి తమను తాము కాపాడుకుంటాయవి. ►ఏనుగులు మంచి తిండిబోతులు. రోజూలో 18 గంటలు తింటూనే ఉంటాయి. వదిలేస్తే ఒకరోజులో 150 కేజీల ఫుడ్డు తినేస్తాయి. అందులో సగం అరగకుండానే బయటకు వచ్చేస్తుంది. ►ఏనుగుల ఎముకలు భూమి నుంచి వచ్చే శబ్దాలను కూడా గ్రహిస్తాయి తెలుసా?.. చిట్టీ. అవి మాట్లాడుకోవడం అంతా వేరేలా ఉంటుంది. ఏనుగు అరిస్తే(ఘీంకారం) మైళ్ల దూరం వినిపిస్తుంది. వీటి సాయంతోనే అవి మాట్లాడుకుంటాయి. అలాగే వాటికంటూ ఒక వాసన పెట్టుకుంటాయి. కుక్కల కంటే ఇవి వాసనను బాగా పసిగడతాయి. పేడ సాయంతో వాటి మంద ఎటు వెళ్లాయనే విషయాన్ని తెలుసుకుంటాయి కూడా. ►ఏనుగులు ఎమోషనల్ జీవులు. తొందరగా మనుషులతో కలిసిపోతాయి. ప్రేమగా ఉంటాయి. జ్ఞాపకశక్తి ఎక్కువ. ఏ విషయాన్నైనా బాగా గుర్తు పెట్టుకుంటాయి.(మెదడులో ఉండే టెంపోరల్ లోబ్ వల్లే ఇదంతా). థాయ్‌లాండ్‌లో ఆ మధ్య ఒక ఏనుగు ఓ ఇంటి వంటగది పగలకొట్టి.. అంతా తినేసింది. ఆ ఏనుగు ఇప్పుడు మళ్లీ అదే ఇంటికి వచ్చి గోడను పగలకొట్టి.. మళ్లీ తినేసింది చూడు. అంత బాగా ఉంటుంది వాటికి మెమరీ. Remember the elephant that went viral in June for smashing through a home in Thailand? Well the same elephant just did it again — to the same people. pic.twitter.com/BxZjHux68n — NowThis (@nowthisnews) August 10, 2021 ►ఏనుగులు మచ్చిక జీవులు. సాధారణంగా వాటికి కోపం రాదు. ఎవరైనా కవ్వించాలని ప్రయత్నిస్తేనే.. అవి ప్రతిదాడులకు దిగుతాయి. పాపం.. ఒక ఏనుగును కాపాడుకోవడానికి.. మిగతావి ప్రాణాలను పణంగా పెడుతుంటాయి కూడా. ►పాపం.. ఎంత పెద్ద జీవి అయినా ఏం లాభం. ఒకప్పుడు ఎంతో పెద్దగా ఉండే ఏనుగుల సంఖ్య.. బాగా తగ్గిపోయింది. ఆఫ్రికన్-ఆసియన్ ఏనుగులు చాలా తగ్గిపోయాయి(90,50 శాతాలు) ఆఫ్రికన్ ఏనుగులు 4 లక్షల దాకా ఉండగా, ఆసియన్ ఏనుగులు కేవలం 45 వేలే ఉన్నాయి!. అందుకే వాటిని కాపాడేందుకు ఆగష్టు 12న వరల్డ్ ఎలిఫెంట్ డే చేస్తున్నారు చిట్టీ. వాటర్ టబ్‌లో ఇరుకున్న గున్న ఏనుగును కాపాడే ప్రయత్నం(పాత ఫొటో) ►‘మరి ఏనుగు తెల్ల కొమ్ముల సంగతి ఏంటమ్మా?’ అంటూ అమాయకంగా అడిగాడు చిట్టి. దానికి లలిత నవ్వుతూ.. వాటిని కొమ్ములు అనరు.. దంతాలు అంటారు. అంటే నీ నోట్లో పండ్లలాంటివి. ఏనుగులకు రెండేళ్ల నుంచి ఇవి పెరగడం మొదలవుతుంది. తినేటప్పుడు కొమ్మల్ని చీల్చడానికి, వేళ్లను పెకలించడానికి సాయపడతాయి. అంతేకాదు ఒకాదానితో మరొకటి కొట్లాడుకున్నప్పుడు ఆత్మ రక్షణ కోసం ఉపయోగించుకుంటాయి. పాపం.. వీటి కోసమే వేటగాళ్లు వాటిని చంపుతుంటారు అనడంతో ‘అయ్యో పాపం’ అంటూ జాలిగా ‘ఊ’ కొట్టాడు చిట్టీ. అన్నట్లు కథలో ముందు చెప్పుకున్న హెర్క్యులస్ వయసు ఇప్పుడు ఎనిమిదేళ్లు. తన మందతో ప్రశాంతంగా జీవిస్తోందని చెప్పడంతో చిట్టీ ముఖంలో నవ్వు కనిపించింది. ఏనుగుల సంరక్షణ.. ఈ మాట వినగానే ముందు గుర్తొచ్చే దేశం థాయ్‌లాండ్. ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్=కెనడా ఫిల్మ్‌మేకర్ పాట్రిసియా సిమ్స్ కలిసి ఈ డేను 2012 నుంచి నిర్వహిస్తున్నారు. సిమ్స్ వరల్డ్ ఎలిఫెంట్ సొసైటీకి అధ్యక్షురాలు కూడా. ఏనుగుల పరిరక్షణ, వేటను అడ్డుకోవడం, వాటి దంతాల అక్రమ రవాణాను నివారించడం, జనావాస ప్రాంతాల్లో వాటి దాడులను ఎలా అడ్డుకోవడం, మదం(హార్మోనుల రిలీజ్) టైంలో ఎలా ప్రవర్తించడం, వాటి మానాన వాటిని ఎలా బతకనివ్వడం.. ఇలాంటి అంశాలపై సుమారు 100కి పైగా పని చేస్తున్న సంస్థలు ప్రజల్లో అవగాహన నింపడానికి ప్రయత్నిస్తుంటాయి ఇవాళ. -సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
జలపాతంలో ఏనుగుల సైన్యం
-
వైరల్: జలకాలాటల్లో ఏమీ హాయిలే..
పచ్చని ప్రకృతి మధ్య నదిలో సరాదాగా గడిపితే వచ్చే ఆ కిక్కే వేరు. ఇరుకైన బాతురూమ్‌లో మితమైన నీటితో స్నానం చేయడం కంటే సెలయేటిలో, జాలువారుతున్న జలపాతంలో చేస్తే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. ఇది జంతువులకు పుట్టుకతో ఉన్న అదృష్టం. అలా ఓ గుంపులగా కదిలిన ఏనుగుల సైన్యం దారి మధ్యలో ఉన్న నదిలో జలకాలు ఆడాయి. ఏనుగు కుటుంబం నీటిలో అటు ఇటు తిరుగుతూ వాటి శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఆనందంగా గడిపాయి. ఈ దృశ్యాలను భారత అటవీశాఖ అధికారి పర్వీన్ కశ్యప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (సింహం సింగిల్‌గా రాదు.. మీరే చూడండి) ‘ఏనుగుల కుటుంబం సాయత్రం స్నానం చేస్తుంది. పరిశుభ్రంగా ఎలా ఉండాలో వీటిని చూసిన నేర్చుకోండి’ అంటూ ట్వీట్ చేశారు. ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తరుచూ దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ వీడియో ప్రాధాన్యత సంతరించుకుంది. వైరస్ నుంచి రక్షించుకోడం కోసం భైతిక దూరం, పరిశుభ్రత పాటించడం, చేతులు కడుక్కోవడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో గజ రాజులు శుభ్రత పాటిస్తూ స్నానం చేస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు వేగంగా స్పందిస్తున్నారు. ‘మనుషుల కంటే జంతువులే మంచివి. జంతువుల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు మనకు సరైన మార్గంలో నడిపే విషయాలను బోధిస్తాయి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక వీడియో షేర్ చేసిన కొంత సమయంలోనే వైరల్‌గా మారింది. (భయానకం: తెలివిగా తప్పించుకున్నాడు) ఈశ్వర్, అల్లా, జీసస్‌లపై ఒట్టు: వర్మ -
ఎంత పద్దతిగా రోడ్డు దాటుతున్నాయో చూడండి
ఏనుగుల గుంపు ఒకటి రోడ్డు క్రాస్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. కాగా ఆ వీడియోలో గున్న ఏనుగులను తల్లి ఏనుగులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాయనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మొదట వీడియోలో ఒక ఏనుగు తన సమూహానికి ముందుండి నడిపించగా... దాని వెనకాలే గున్న ఏనుగులను మధ్యలో పెట్టుకొని మిగతా ఏనుగులు నడుచుకుంటూ పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయాయి. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే కాసేపటికి మరికొన్ని ఏనుగులు గుంపు కూడా ముందు వెళ్లిన గుంపును అనుసరిస్తూ వడివడిగా అడుగులేస్తూ పరుగులు పెట్టాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ప్రసుత్తం మనుషుల్లో ఐకమత్యం కనిపించని వేళ.. ఏనుగుల్లో మాత్రం తమ పిల్లలను కాపాడుకోవడంలో ఎంత జాగ్రత్త వహిస్తున్నాయనేది కనిపిస్తుంది. ఈ వీడియోనూ పర్వీన్ ట్విటర్లో షేర్ చేస్తూ..' తమ గున్న ఏనుగులను మధ్యలో పెట్టుకొని అత్యంత పటిష్ట భద్రత నడుమ రోడ్డు దాటడం ఆసక్తి కలిగించిందంటూ' ట్వీట్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభించింది. షేర్ చేసిన కొద్ది సేపటికే 4వేల లైకులు లభించాయి. ' అవి వాటి పిల్లలను జెడ్ ప్లస్ కేటగిరి భద్రతతో తీసుకెళుతున్నాయి' అంటూ కామెంట్లు పెడుతున్నారు. The best thing you will watch today. This #elephant family with kids under high security just crossing a road. Big fat family. Forward from Coorg. pic.twitter.com/CFOF57rY5c — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 4, 2020 -
గజరాజుల బెడద మళ్లీమొదలైంది
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వంగర మండలం వీవీఆర్‌పేట పంచాయతీ జేకే గుమ్మడ గ్రామ సమీపంలోకి మంగళవారం ఆరు ఏనుగుల గుంపు ప్రవేశించింది. కొంతకాలంగా విజయనగరం జిల్లాలోని కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లో సంచరిస్తున్న ఈ ఏనుగుల గుంపు ఒక్కసారిగా వంగర మండలంలోకి ప్రవేశించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏనుగుల ఘీంకార శబ్దాలకు భయపడి ప్రజలు పరుగులు పెట్టారు. ఇప్పటికే వీరఘట్టం తదితర మండలాల్లోని గిరిజనులు ఏనుగుల వల్ల పంటలు నష్టపోయారు. ఇప్పుడు వంగర మండల వాసులు ఏం చేస్తాయోనని భయపడుతున్నారు. ఆ గుంపే మళ్లీ వచ్చింది.. 2007 నుంచి నాలుగు ఏనుగుల గుంపు జిల్లాలో సంచరిస్తున్న విషయం తెలిసిందే. వీటితో సతమతమవుతున్న తరుణంలో 2017 మే 17న మరో 8 ఏనుగుల గుంపు ఒడిశా రాష్ట్రం రాయగఢ జిల్లా నుంచి మన జిల్లా కళింగదళ ప్రదేశంలోకి చొరబడింది. అప్పట్లో పెద్ద ఎత్తున హల్చల్ చేlశాయి. ఆ తర్వాత దూసి రైల్వే లైను దాటు తూ కనుగులవానిపేట వద్ద, ఎల్.ఎన్.పేట మండలం కడగండి వెస్ట్ బీట్ వద్ద సంచరించాయి. ఈ క్రమంలో మెళియాపుట్టి మండలం హిరాపురం వద్ద ఇద్దరు గిరిజనులను హతమార్చాయి. దీంతో ఏనుగులు తరలించేందుకు రూ.2 కోట్లు నిధులతో ఆపరేషన్ గజేంద్రను జిల్లా అటవీ శాఖాధికారులు చేపట్టారు. వాటిని ఒడిశా తరలించారు. అందులో రెండు చనిపోగా, మిగతా ఆరు మళ్లీ వెనక్కి వచ్చేశాయి. మొన్నటి వరకు విజయనగరం జిల్లాలో సంచరించగా, ఇప్పుడవి మళ్లీ మన జిల్లాలోని వంగర మండలం వీవీఆర్‌పేట పంచాయతీ జేకే గుమ్మడ గ్రామ సమీపంలోని మెట్ట భూముల్లోకి చొచ్చుకొచ్చాయి. గతంలో ఏం జరిగిందంటే..? 2007 మార్చిలో ఒడిశా లఖేరీ అడవుల నుంచి 9 ఏనుగుల గుంపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సరిహద్దులో ప్రవేశించింది. 2007 అక్టోబర్‌లో ఏనుగుల గుంపును తరలించేందుకు అప్పటి అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తీసుకున్న నిర్ణయం మేరకు ఆపరేషన్ గజ చేపట్టారు. చిత్తూరు, బెంగళూరుకు సంబంధించిన తర్ఫీదు పొందిన మావటీలతోపాటు జయంతి, గణేష్ అనే శిక్షణ పొందిన ఏనుగులను రంగంలోకి దించారు. ఆశించినంతగా ఫలితం ఇవ్వకపోయినప్పటికీ రెండు ఏనుగులను అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనాలతో ఒడిశా అడవుల్లోకి పంపించే ప్రయత్నం చేశారు. ఇందులో ఒక ఏనుగు మార్గమధ్యంలోనే మృతి చెందింది. మరో ఏనుగు కూడా తరలించిన అనంతరం మృతి చెందింది. ఇలా వరుసగా ఏనుగుల మృతి చెందిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో ఆపరేషన్ గజ నిలిచింది. వీటిలో ఏడు ఏనుగులు సంచరించగా వీరఘట్టం మండలం కుంబిడి ఇచ్ఛాపురం వద్ద కొంతమంది రెండు ఏనుగులను హతమర్చారు. అనంతరం ఎస్.గోపాలపురం వద్ద విద్యుత్ షాక్ తగిలి మరో ఏనుగు మతి చెందింది. ప్రస్తుతం వాటిలో నాలుగు ఏనుగులు మాత్రమే జిల్లా అడవుల్లో సంచరిస్తున్నాయి. వాటికి తోడు తాజాగా చొచ్చుకొచ్చిన ఆరు ఏనుగులతో ఆ సంఖ్య పదికి చేరింది. భయపెడుతున్న గత సంఘటనలు.. గత 12 ఏళ్ల నుంచి నేటి వరకు ఏనుగుల బారిన పడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 13 మంది దుర్మణం చెందారు. ఇప్పుడు మళ్లీ ఆరు ఏనుగుల గుంపు రావడంతో గిరిజన గ్రామాల ప్రజలతో పాటు ప్రస్తుతం సంచరిస్తున్న ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సూదిరాయిగూడ సమీపంలో ఏనుగులు.. సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో కడగండి పంచాయతీ పరిధిలోని సూదిరాయిగూడ సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. మంగళవారం వేకువజామున ఆ ప్రాంతానికి ఏనుగులు వచ్చి ఘీంకారాలు చేయడంతో ఆ ప్రాంత గిరిజనులు ఆందోళన చెందారు. ఫైనాపిల్, అరటి తదితర పంటలను నాశనం చేస్తున్నాయని గిరిజనులు తెలిపారు. కొండపోడు పనులకు సైతం వెళ్లలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. -
ఎండలు తాళలేక ఏనుగుల గుంపు..
సాక్షి, శ్రీకాకుళం: పాతపట్నం మండలంలోని కమలమ్మ కొట్టు సెంటర్ బ్రిడ్జి ఆవరణలో ఏనుగులు గుంపు సంచరిస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నరసన్నపేట-పర్లాఖిమిడిల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అడవిలో నీటి కొరత, వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏనుగులు మహేంద్రతనయ నది పరిసరాల్లో తిష్టవేసాయి. ఎండ ఉన్నంతసేపు నది నీటిలో జలకాలాడుతూ, ఆకలి అయినప్పుడు రోడ్డుపైకి చేరుకుంటున్నాయి. ఏనుగులు చర్యలను బట్టి ట్రాకర్స్, ఫారెస్ట్ గార్డులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఏనుగులు నదిలో విహారిస్తుండటం.. చుట్టుపక్కల సంచరిస్తుండటంతో వాటిని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఏనుగుల సంచారాన్ని ఉత్సాహంగా తిలకిస్తూ.. తమ ఫోన్లల్ వీడియోలు తీస్తున్నారు. అయితే, ఏనుగులను కవ్విస్తే ప్రమాదమని, వాటి సమీపంగా వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నారు. -
ఏనుగుల గుంపు సంచారం.. నదిలో విహారం!
-
ఆగని ఏనుగుల దాడి
సాక్షి, గంగవరం: చిత్తూరు జిల్లా గంగవరం మండలం జరావారిపల్లె సమీపాన పంటపొలాలపై బుధవారం అర్థరాత్రి ఏనుగులు దాడిచేసి పంటలను నాశనం చేశాయి. ఏనుగులు గ్రామ సమీపాన ఉన్నవరి, చెరకు, కాలీఫ్లవర్ పంటలపై పడి నాశనంచేయగా మామిడి చెట్లను విరిచేశాయి. గ్రామానికి చెందిన శివన్న, సరసమ్మ, చంగల్రాయప్ప, భూలక్ష్మి, గురప్ప, ఆదినారాయణ, పురుషోత్తం రైతులకు చెందిన వరి, కాలీఫ్లవర్, చెరుకు పంటలను నాశనం చేశాయి. ఏనుగుల దాడిని గమనించిన రైతులు డప్పులతో శబ్దాలు చేస్తూ వాటిని పొలిమేర దాటించారు. ఏనుగుల దాడిలో పంటల నష్టం రూ.5లక్షల వరకు ఉంటోందని బాధిత రైతులు తెలిపారు. విషయాన్ని అటవీ,రెవెన్యూ శాఖ అధధికారులకు తెలియజేశారు. -
తిక్క కుదిరింది
పిల్లల కథ ఒక అడవిలో నివసిస్తున్న ఏనుగుల గుంపులో ఓ ఏనుగు బాగా పొగరుగా ఉండేది. అది ఆ అడవిలో స్వేచ్ఛగా తిరిగే జంతువుల్ని ఉత్తపుణ్యానికి హింసిస్తూ ఉండేది. చివరకు చీమలను కూడా వదిలిపెట్టేది కాదు. ఆహారం కోసం అవి బారులు తీరి వెళుతూంటే, తొండంతో నీటిని తెచ్చి వాటిపై విరజిమ్మేది. చీమలు నీటి నుంచి బయటపడ్డానికి పడుతున్న అవస్థ చూసి ఆనందించేది. నిష్కారణంగా చెట్లకొమ్మలను విరిచి పడేసేది. అలా చేయడం తప్పని తోటి ఏనుగులు ఎన్నిసార్లు చెప్పినా పొగరుబోతు ఏనుగు తీరు మారలేదు. రాను రాను పొగరుబోతు ఏనుగు ఆగడాలు మితిమీరి పోవడంతో ఒకరోజు జంతువులన్నీ ఏకమై, తమ రాజైన సింహాన్ని కలిసి ఏనుగు పెట్టే బాధల్ని చెప్పాయి.సింహం వెంటనే వెళ్లి ఆ ఏనుగును తన వద్దకు తీసుకురమ్మని ఎలుగుకు పురమాయించింది. బలుసాకైనా తిని బతుకుతాను గాని, ఆ పొగరుబోతు ఏనుగు దగ్గరకు వెళ్లనని మొరాయించింది ఎలుగు. తర్వాత చిరుతపులి, తోడేలు, ఖడ్గమృగం, జింక వగైరా జంతువులకు చెప్పి చూసినా... ఆ ఏనుగు వద్దకెళ్లడానికి ఏ ఒక్కటీ సాహసించలేదు. ‘చాలా ఆశ్చర్యంగా ఉందే! కేవలం కబురు చెప్పడానికే భయపడిపోతున్నారేమిటి?’ అనుకుంటూ సింహం క్షణకాలం వాటన్నింటినీ పరీక్షగా చూసి, ‘‘ఇదిగో, కుందేలు బుల్లోడా! ఏనుగు వద్దకు నువ్వెళ్లు. ఎవరూ వెళ్లకపోతే సమస్య ఎలా పరిష్కారమవుతుంది?’’ అన్నది. కుందేలు లోలోపల భయపడుతూనే... ధైర్యం కూడగట్టుకొని పొగరుబోతు ఏనుగు చెంతకెళ్లి సింహం రాజుగారు రమ్మంటున్నారని చెప్పింది. ‘‘నేను రాను. కావలిస్తే ఆయనే వస్తాడు. నువ్వు ఫో!’’ అంది మహాగీరగా ఏనుగు. ఆగమేఘాల మీద వచ్చేసి, ఆ మాట సింహానికి చెప్పింది కుందేలు. ‘‘అబ్బో! చాలా పొగరుగా ఉందే. మీరంతా వెళ్లి దాన్ని మెత్తగా తన్ని తీసుకురాలేరా?’’ అంది చిరాకుపడుతూ సింహం. బలుసాకైనా తిని బతుకుతాను గాని, ఆ పొగరుబోతు ఏనుగు దగ్గరకు వెళ్లనని మొరాయించింది ఎలుగు. జంతువులేవీ నోరు మెదపలేదు. ‘‘మీరింత పిరికిపందలనుకోలేదు. సరే, ఇక చేసేదేముంది? నేనే వెళతాను’’ అని సింహం బయలుదేరబోతూంటే చీమలరాణి ముందుకొచ్చి, ‘‘మృగరాజా! ఆ ఏనుగు తమ చెంతకొచ్చేలా నేను చేస్తాను’’ అంది ధైర్యంగా. ఆ మాటలకు జంతువులన్నీ పెద్ద పెట్టున నవ్వాయి. ‘‘మీరెవ్వరూ చెయ్యలేని పని అది చేస్తూంటే సిగ్గుపడ్డం మాని నవ్వుతున్నారా’’ అంటూ వాటిని తిట్టి, చీమలరాణిని వెళ్లమని ప్రోత్సహించింది సింహం. తక్షణం చీమలను వెంటబెట్టుకొని ఆ ఏనుగు ఉండే తావుకు చేరుకొంది చీమలరాణి. కొంతసేపటి తర్వాత పొగరుబోతు ఏనుగు, సింహం సమక్షానికి వచ్చింది. ఏనుగు హఠాత్తుగా రావడం చూసి, అది ఎవరిమీద విరుచుకుపడుతుందోనని అక్కడున్న జంతువులన్నీ భయపడ్డాయి. అయితే ఆ ఏనుగు ఏదో బాధతో సతమతమవుతూ సింహాన్ని సమీపించి, ‘‘రాజుగారూ! నేను ఆదమరచి నిద్రపోతుంటే చీమలు నా తొండంలో దూరి, అదే పనిగా కుడుతున్నాయి. అమ్మో! ఈ మంట భరించలేకపోతున్నాను. నన్నిలా బాధించడం వీటికి తగునా?’’ అని మొరపెట్టుకుంది. సింహం మందహాసం చేస్తూ, ‘‘ఏనుగు తమ్ముడూ! బాధ అనేదెలా ఉంటుందో నీకిప్పుడు తెలిసిందా?’’ అంది. ‘‘తెలిసింది మృగరాజా!’’ అంటూ కంటనీరు పెట్టుకుంది ఏనుగు. ‘‘ఇకముందు ఏ జంతువునూ హింసించకుండా, వృక్షాలను ధ్వంసం చెయ్యకుండా ఉంటావా?’’ అడిగింది సింహం. ‘‘ఉంటాను రాజా. వనదేవత సాక్షిగా ఇంకెప్పుడూ బాధపెట్టను’’ అంది ఏనుగు. ఏనుగు అలా వాగ్దానం చెయ్యగానే చీమలరాణి, ఆమె సైన్యం దాని తొండంలో నుండి బయటకొచ్చేశాయి. ‘‘చూశారా! చీమలు చిన్నవే కావచ్చు, అవి కలిసికట్టుగా ఎంత శక్తిని ప్రయోగిస్తాయో ఇప్పుడు మీకు తెలిసిందిగా!’’ అంది సింహం. జంతువులన్నీ బుద్ధిగా తలలూపాయి. తెలివిగా పొగరుబోతు ఏనుగు పొగరణచినందుకు చీమలరాణిని, ఆమె సైన్యాన్ని ఎంతగానో మెచ్చుకుంది సింహం. - చోడిశెట్టి శ్రీనివాసరావు -
పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి
పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడికి దిగిన సంఘటన చిత్తూరు జిల్లాలో గురువారం జరిగింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రామాపురం తండాలోని పంట పొలాలపై ఏనుగుల గుంపు విరుచుకు పడింది. వరి, బీన్స్, రాగి పంటలతో పాటు విద్యుత్తు మోటార్లను గజరాజులు నాశనం చేశాయి. ఏనుగుల దాడితో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా, ఏనుగుల దాడులు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఈ నెల 10వ తేదీన రామాపురం గ్రామాలలో గాయపడిన ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఏనుగును బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా, రెచ్చిపోయిన గజరాజు ట్రాకర్లపై తిరగబడింది. దీంతో ఏనుగు ధాటికి స్థానికులు పరుగులు తీశారు.