పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడికి దిగిన సంఘటన చిత్తూరు జిల్లాలో గురువారం జరిగింది.
పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడికి దిగిన సంఘటన చిత్తూరు జిల్లాలో గురువారం జరిగింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రామాపురం తండాలోని పంట పొలాలపై ఏనుగుల గుంపు విరుచుకు పడింది. వరి, బీన్స్, రాగి పంటలతో పాటు విద్యుత్తు మోటార్లను గజరాజులు నాశనం చేశాయి. ఏనుగుల దాడితో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కాగా, ఏనుగుల దాడులు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఈ నెల 10వ తేదీన రామాపురం గ్రామాలలో గాయపడిన ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఏనుగును బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా, రెచ్చిపోయిన గజరాజు ట్రాకర్లపై తిరగబడింది. దీంతో ఏనుగు ధాటికి స్థానికులు పరుగులు తీశారు.