ఆగని ఏనుగుల దాడి | crop dammage by elephants | Sakshi
Sakshi News home page

ఆగని ఏనుగుల దాడి

Published Thu, Dec 14 2017 4:27 PM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM

crop dammage by elephants

సాక్షి, గంగవరం: చిత్తూరు జిల్లా గంగవరం మండలం జరావారిపల్లె సమీపాన పంటపొలాలపై బుధవారం అర‍్థరాత్రి ఏనుగులు దాడిచేసి పంటలను నాశనం చేశాయి. ఏనుగులు గ్రామ సమీపాన ఉన్నవరి, చెరకు, కాలీఫ్లవర్‌ పంటలపై పడి నాశనంచేయగా మామిడి చెట్లను విరిచేశాయి. గ్రామానికి చెందిన శివన్న, సరసమ్మ, చంగల్‌రాయప్ప, భూలక్ష్మి, గురప్ప, ఆదినారాయణ, పురుషోత్తం రైతులకు చెందిన వరి, కాలీఫ్లవర్, చెరుకు పంటలను నాశనం చేశాయి. ఏనుగుల దాడిని గమనించిన రైతులు డప్పులతో శబ్దాలు చేస్తూ వాటిని పొలిమేర దాటించారు. ఏనుగుల దాడిలో పంటల నష్టం రూ.5లక్షల వరకు ఉంటోందని బాధిత రైతులు తెలిపారు. విషయాన్ని అటవీ,రెవెన్యూ శాఖ అధధికారులకు తెలియజేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement