ఇటీవల యువతకు సెల్ఫీ క్రేజీ మాములుగా లేదుగా. ఎలాంటి ప్రదేశంలో ఉన్నాం అన్న స్ప్రుహ కూడా లేకుండా సెల్పీ మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు సెల్ఫీలు తీసుకుంటూ చనిపోయిన వాళ్లు కోకొల్లలు. అయినప్పటకీ ఎవరూ ఎంత ప్రమాదకరమైన 'తగ్గేదే లే' అంటూ సెల్పీలు తీస్తూనే ఉంటున్నారు. ఇక్కడ కూడా ఇద్దరు ప్రబుద్ధులు అలానే చేసి చివరికి బతుకు దేవుడా అంటూ పరుగు లంఘించారు.
ఏం జరిగిందంటే... ఇదరు వ్యక్తులు కారులో వెళ్తుండగా ఒక ఏనుగులు గుంపు రోడ్డు పైకి వస్తుంది. దీంతో వాళ్లు కారు ఆపి మరీ ఆ ఏనుగుల గుంపు వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించారు. ప్రమాదం అని తెలిసి కూడా వాటికి దగ్గరగ వెళ్తారు. మొదట అవి సెల్ఫీ తీసుకునేందుకు ఇష్టం లేదన్నట్లు తమ ముఖాన్ని పక్కకు పెట్టుకుంటాయి. కాసేపటి తర్వాత ఒక్కసారిగా కోపంతో మాతో సెల్ఫీలా... అన్నట్లుగా ఒక్కసారిగా ఉరుముతూ వాళ్ల మీదకు వస్తాయి. దెబ్బతో సదరు వ్యక్తులు భయంతో పరుగెడుతూనే ఉంటారు.
Selfie craze with wildlife can be deadly. These people were simply lucky that these gentle giants chose to pardon their behaviour. Otherwise, it does not take much for mighty elephants to teach people a lesson. video-shared pic.twitter.com/tdxxIDlA03
— Supriya Sahu IAS (@supriyasahuias) August 6, 2022
(చదవండి: వామ్మో! ఏంటీ దెయ్యం అలా ఎలా చేస్తోంది)
Comments
Please login to add a commentAdd a comment