Herd of elephants
-
ఏనుగులతో సెల్ఫీ అంటే... అట్లుంటది మరీ!: వైరల్ వీడియో
ఇటీవల యువతకు సెల్ఫీ క్రేజీ మాములుగా లేదుగా. ఎలాంటి ప్రదేశంలో ఉన్నాం అన్న స్ప్రుహ కూడా లేకుండా సెల్పీ మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు సెల్ఫీలు తీసుకుంటూ చనిపోయిన వాళ్లు కోకొల్లలు. అయినప్పటకీ ఎవరూ ఎంత ప్రమాదకరమైన 'తగ్గేదే లే' అంటూ సెల్పీలు తీస్తూనే ఉంటున్నారు. ఇక్కడ కూడా ఇద్దరు ప్రబుద్ధులు అలానే చేసి చివరికి బతుకు దేవుడా అంటూ పరుగు లంఘించారు. ఏం జరిగిందంటే... ఇదరు వ్యక్తులు కారులో వెళ్తుండగా ఒక ఏనుగులు గుంపు రోడ్డు పైకి వస్తుంది. దీంతో వాళ్లు కారు ఆపి మరీ ఆ ఏనుగుల గుంపు వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించారు. ప్రమాదం అని తెలిసి కూడా వాటికి దగ్గరగ వెళ్తారు. మొదట అవి సెల్ఫీ తీసుకునేందుకు ఇష్టం లేదన్నట్లు తమ ముఖాన్ని పక్కకు పెట్టుకుంటాయి. కాసేపటి తర్వాత ఒక్కసారిగా కోపంతో మాతో సెల్ఫీలా... అన్నట్లుగా ఒక్కసారిగా ఉరుముతూ వాళ్ల మీదకు వస్తాయి. దెబ్బతో సదరు వ్యక్తులు భయంతో పరుగెడుతూనే ఉంటారు. Selfie craze with wildlife can be deadly. These people were simply lucky that these gentle giants chose to pardon their behaviour. Otherwise, it does not take much for mighty elephants to teach people a lesson. video-shared pic.twitter.com/tdxxIDlA03 — Supriya Sahu IAS (@supriyasahuias) August 6, 2022 (చదవండి: వామ్మో! ఏంటీ దెయ్యం అలా ఎలా చేస్తోంది) -
ఒంటరితనంతో మదమెక్కి.. 16 మందిని చంపింది!
అడవుల్లో ఏనుగులు గుంపులుగా జీవిస్తాయన్న విషయం మనకు తెలిసిందే. ఆ గుంపులో ఉండాలంటే మిగతా సభ్యులతో అవి సఖ్యతగా మెలగాలి. నియమ నిబంధనలు పాటించాలి. లేదంటే గుంపులోంచి గెంటేస్తాయి. అప్పుడు వాటిది ఒంటరి బతుకే. జార్ఖండ్ అడువుల్లో 22 సభ్యులతో ఉన్న ఓ మందలో 16 ఏళ్ల మగ ఏనుగు మదమెక్కి ఇతర మగ ఏనుగులపై మాటమాటకి దాడికి దిగుతోంది. పద్ధతి మార్చుకోవాలని సీనియర్లు చెప్పినా వినలేదు. కొంతకాలం ఈ టీనేజ్ ఏనుగు చేష్టలను ఆ మంద భరించింది. ఇక భరించలేక ఓ రోజు సర్వసభ్య సమావేశం పెట్టుకుని ఆ కుర్ర ఏనుగును మందలోంచి గెంటేయాలని తీర్మానించాయి. దీంతో దాని బతుకు ఒంటరి అయింది. ఒంటరి తనంతో దానికి మరింత మదమెక్కింది. వనంలో తనకు చోటు లేకపోవడంతో జనావాసాల వైపు వచ్చేసింది. గిరిజనులు ఎక్కువగా నివసించే సంతాల్ పరగణా ప్రాంతంలో హల్ చల్ చేస్తూ రెండు నెలల కాలంలో 16 మందిని పొట్టనబెట్టుకుంది. రెండు రోజుల క్రితం పొలం పనులకు వెళ్లిన ఓ జంటను తన దంతాలతో ఎత్తి విసిరేసింది. వారి ఉసురు తీసింది. మంద నుంచి తప్పిపోయి ఇది రాలేదని, గెంటేయడంతోనే ఒంటరిగా తిరుగుతోందని అటవీ అధికారులు అంచనాకు వచ్చారు. గతిలేకుండా తిరుగుతున్న ఈ ఏనుగు ఎటు నుంచి ఎటు వెళుతోందో తెలుసుకోవడానికి వారు తలలు పట్టుకుంటున్నారు. తన దారికి అడ్డువచ్చిన వారిపై లేదా సెల్ఫీల కోసం తన సమీపంలోకి వచ్చిన వారిపైనే ఆ గజరాజు దాడి చేస్తోందని, ఇళ్లను ధ్వంసం చేయడం లాంటి పనులు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. గుంపు మళ్లీ ఆదరిస్తే.. దాని ప్రవర్తనలో మార్పు వస్తుందని భావిస్తున్నారు. దానిని మందవైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. – ఏపీ సెంట్రల్ డెస్క్ చదవండి: Thailand Elephant: అసలే ఆకలి! ఆపై కమ్మని వాసన, తట్టుకోలేక.. ఈ కుర్ర ఏనుగేకాదు.. ప్రజలను బెంబేలెత్తించిన ఇతర గజరాజులు, వాటికి సంబంధించిన దృశ్యాలు ఈ వీడియోలో చూసేయండి. -
క్యూ కట్టిన ఏనుగులు.. ఎందుకో తెలుసా?
-
క్యూ కట్టిన ఏనుగులు.. ఎందుకో తెలుసా?
ఏనుగుల మంద దారి తప్పి ఊర్లోకి వచ్చింది. తిరిగి అడవికి వెళ్లాలంటే సరైన మార్గం కనిపించలేదు. దీంతో గజరాజుల గుంపుకు ఏ వైపుకు వెళ్లాలో దిక్కు తోచక రోడ్డుకు ఓ పక్కగా నిలబడి ఉన్నాయి. కనుచూపు మేరలో ఏ దారి కనిపించకపోయేసరికి తప్పని పరిస్థితిలో అక్కడే ఉన్న గోడ దూకి అడవిలోకి వెళ్లాలని భావించాయి. వరుస పెట్టి ఒక్కో ఏనుగు అతి కష్టం మీద గోడ దూకి అడవి తల్లి ఒడికి చేరుకున్నాయి. ఈ గుంపులో ఉన్న ఓ వృద్ధ ఏనుగు తన కూనను గోడ దాటించడానికి నానా కష్టాలు పడింది. ఎలాగోలా గోడ దాటిన ఏనుగుల మంద బతుకు జీవుడా అనుకుంటూ అడవి బాట పట్టాయి. కర్ణాటకలోని హస్సూర్ గ్రామంలో చోటుచేసుకున్న పాత వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీన్ కశ్వన్ ట్విటర్లో షేర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై పలువురు నెటిజన్లు విచారం వ్యక్తం చేశారు. దారి తెలీని నిస్సహాయ స్థితిలో అతి కష్టం మీద గోడను దూకడం నెటిజన్ల మనసును కలిచివేసింది. మనుషులే వాటి దుస్థితికి కారణమని ఓ నెటిజన్ వాపోయాడు. గజరాజుల మంద అడ్డుగా నిలిచిన గోడలను దూకి మరీ ప్రకృతి ఒడిలోకి చేరుకున్నాయని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
మనిషిని తొక్కి చంపిన ఏనుగుల గుంపు
త్రిపురలో ఒక ఏనుగుల గుంపు ఓ వ్యక్తిపై దాడిచేసి, తొక్కి చంపేసింది. భూపేంద్ర దేవ్ వర్మ (32) అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి వెదురు తెచ్చుకోడానికి అడవిలోకి వెళ్లాడు. ఉన్నట్టుండి అడవి ఏడుగుల గుంపు అక్కడికొచ్చి వారిద్దరిపై దాడి చేసిందని, వారిలో భూపేంద్ర అక్కడికక్కడే మరణించాడని ఖోవై సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సమిత్ రాయ్ చౌధురి విలేకరులకు తెలిపారు. అతడితో పాటు ఉన్న స్నేహితుడు ఎలాగోలా తప్పించుకోగలిగాడు. పశ్చిమ త్రిపురలోని గోడైబరి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మృతుడి కుటుంబానికి జిల్లా యంత్రాంగం ఆర్థిక సాయం ప్రకటించింది. -
ఏనుగుల హల్చల్
క్రిష్ణగిరి, న్యూస్‌లైన్: హొసూరు సమీపంలోని పోడూరు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నాలుగు ఏనుగుల మంద తుప్పుగానపల్లి అగరం, శ్యానమావు గ్రామాల వద్ద గురువారం రాత్రి హల్చల్ చేసింది. శ్యానమావు, తుప్పుగాన పల్లి, అగరం గ్రామాల్లో వరి, టమాట పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. అగరం గ్రామానికి చెందిన రైతులు మునిస్వామి (40) వరి, తక్కాలి పంటలను ధ్వంసం చేశాయి. రామయ్యకు చెందిన వరి నారుమడి, వెంకటేశ్, కుంజప్పలకు చెందిన వరి పంటను ధ్వంసం చేశాయని రైతులు తెలిపారు. లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోయారు. ఈ నాలుగు ఏనుగుల మందలో ఒక ఏనుగు అడవిలోకి వెళ్లిపోగా, మరో ఏనుగు తప్పించుకుంది. మిగిలిన రెండు ఏనుగులు తుప్పుగానపల్లి చెరువులో తిష్టవేశాయి. తప్పించుకున్న ఏనుగు ఎటువైపు వెళ్లిందోనని అటవీశాఖ అధికార్లు ఆరా తీస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి చెరువులో మకాం వేసిన ఏనుగులు ఎక్కడికి వెళ్లకుండా అటవీశాఖ అధికారులు గస్తీ నిర్వహిస్తున్నారు. తుప్పుగానపల్లి చెరువులో మకాం వేసిన ఏనుగులను సాయంత్రానికి పోడూరు అటవీ ప్రాంతానికి తరలించనున్నట్లు అటవీశాఖ అధికార్లు తెలిపారు.