మనిషిని తొక్కి చంపిన ఏనుగుల గుంపు | Man killed by elephants in Tripura | Sakshi
Sakshi News home page

మనిషిని తొక్కి చంపిన ఏనుగుల గుంపు

Published Sat, May 3 2014 4:17 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

Man killed by elephants in Tripura

త్రిపురలో ఒక ఏనుగుల గుంపు ఓ వ్యక్తిపై దాడిచేసి, తొక్కి చంపేసింది. భూపేంద్ర దేవ్ వర్మ (32) అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి వెదురు తెచ్చుకోడానికి అడవిలోకి వెళ్లాడు. ఉన్నట్టుండి అడవి ఏడుగుల గుంపు అక్కడికొచ్చి వారిద్దరిపై దాడి చేసిందని, వారిలో భూపేంద్ర అక్కడికక్కడే మరణించాడని ఖోవై సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సమిత్ రాయ్ చౌధురి విలేకరులకు తెలిపారు.

అతడితో పాటు ఉన్న స్నేహితుడు ఎలాగోలా తప్పించుకోగలిగాడు. పశ్చిమ త్రిపురలోని గోడైబరి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మృతుడి కుటుంబానికి జిల్లా యంత్రాంగం ఆర్థిక సాయం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement