ప్రతీకాత్మక చిత్రం
అగర్తలా: త్రిపురలో దారుణం చోటుచేసుకుంది. సభ్యసమాజం తలదించుకునేలా 17 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఖోవాయి జిల్లాలోని ఖాసియమంగల్ ప్రాంతానికి చెందిన యువతిని బలవంతంగా అడవుల్లోకి తీసుకెళ్లి ఐదుగురు యువకులు దారుణంగా అత్యాచారం చేశారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 21న త్రిపురలోని ఖాసియమంగల్ అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. తొలుత బాధిత యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అడవిలో నిస్సహాయ స్థితిలో పడిఉన్న యువతిపై మరో ఇద్దరు స్నేహితుల్ని ఫోన్‌చేసి పిలిపించి మరోమారు అత్యాచారానికి పాల్పడ్డారు. (పోర్న్‌సైట్లలో విద్యార్థినులు, లెక్చరర్ల ఫోటోలు)
దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు, అందుకు సాయం చేసిన మరో ఐదుగురిని కలిపి మొత్తంగా పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు వెంటనే కఠినమైన శిక్షలు విధించాలని త్రిపుర విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. విద్యార్థి అస్మిరా దేబ్ వర్మ 'స్టాండ్ ఎగైనెస్ట్ రేప్' అనే బృందాన్ని ఏర్పాటు చేసి, అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రజలు గొంతెత్తేలా పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment