
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు మంచి ఆరంభం లభించినప్పటికి మధ్యలో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడి టాప్ ప్లేస్‌ను సీఎస్‌కేకు కోల్పోయింది. తాజాగా గురువారం సొంత మైదానం జైపూర్‌లో సీఎస్‌కేను ఎదుర్కోనుంది. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న ధోని సేనను రాజస్తాన్ ఎలా నిలువరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక కెప్టెన్ సంజూ శాంసన్ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇప్పటివరకు శాంసన్ ఏడు మ్యాచ్‌లాడి 181 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. అయితే గత ఐదు మ్యాచ్‌లు కలిపి కేవలం 85 పరుగులు మాత్రమే చేసిన సంజూ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. మరి సీఎస్‌కేతో మ్యాచ్‌లో రాణిస్తాడేమో చూడాలి.
ఇక సీఎస్‌కేతో మ్యాచ్‌ను పురస్కరించుకొని బుధవారం శాంసన్ నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లను చూడడానికి అభిమానులు స్టేడియానికి వచ్చారు. ప్రాక్టీస్ ముగించుకునే సమయంలో అభిమానులు శాంసన్‌ను ఒక్క సెల్ఫీ అని పిలిచారు. దీనికి అంగీకరించిన శాంసన్ వెంటనే అభిమానులతో సెల్ఫీ దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
అభిమాని ఫోన్‌లో స్వయంగా శాంసన్ సెల్ఫీ తీస్తుండగా.. ఫోన్ రింగైంది. దీంతో సంజూ కాల్ లిఫ్ట్ చేశాడు. దీంతో పక్కనున్న అభిమాని.. ''అరె సంజూ భయ్యా మాట్లాడుతున్నాడు.. హలో చెప్పు'' అని పేర్కొన్నాడు. దీనికి ఫోన్‌లో ఉన్న అవతల వ్యక్తి ''నిజమా .. హలో సంజూ భయ్యా'' అని అడిగాడు. దీంతో సంజూ..''అవును నేనే.. హలో బ్రదర్ ఎలా ఉన్నావు'' అంటూ చెప్పడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు.. ''సంజూ బ్యాటింగ్‌తోనే కాదు మాటలతోనూ అభిమానుల మనసు దోచుకుంటాడు'' అంటూ కామెంట్ చేశారు.
Calls > Text because you never know, Sanju Samson might just pick up 😂😂 pic.twitter.com/fJwGMbvmt2
— Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2023