సంజూ శాంసన్ (PC: BCCI)
టీమిండియా వికెట్ కీపర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ పెద్ద మనసు చాటుకున్నాడు. తన చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చి అతడిని ఖుషీ చేశాడు.
కాగా దివ్యాంగ చిన్నారి అయిన ఓ బాలుడు తన ప్రతిభా పాటవాలతో ఇటీవల నెట్టింట వైరల్‌గా మారాడు. కాళ్లూ చేతులూ సహకరించకపోయినా ఫుట్‌బాల్ ఆడటం, బ్యాట్ పట్టి క్రికెట్ ఆడటం, పియానో వాయించడం వంటి టాలెంట్‌తో ఇప్పటికే అనేక ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు పొందాడు.
This talented kid's biggest dream is to meet Sanju Samson 🥺
— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) January 29, 2024
Hopefully it happens soon 🙌❤️ pic.twitter.com/7MYPiR3j23
ఈ క్రమంలో సంజూ శాంసన్‌ను ప్రత్యక్షంగా కలవడం ఈ చిన్నారి చిరకాల కోరిక అంటూ సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయం సంజూ దృష్టికి రాగా.. సానుకూలంగా స్పందించాడు.
Sanju Samson has fulfilled the dream of the Kid, to meet & play with his favorite cricketer. 👏
— Johns. (@CricCrazyJohns) March 3, 2024
- A great gesture by Sanju. pic.twitter.com/0wltSaBGz8
సదరు చిన్నారిని కలవడమే గాకుండా.. కాసేపు అతడితో క్రికెట్ కూడా ఆడాడు. ఈ దృశ్యాలు అభిమానులు ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ ప్రస్తుతం ఐపీఎల్-2024కు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు.
ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ శిబిరంలో చేరిన ఈ కెప్టెన్ సాబ్.. మైదానంలో దిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇక టీమిండియా తరఫున చివరగా సౌతాఫ్రికా పర్యటనలో బరిలోకి దిగాడు సంజూ శాంసన్.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20 సందర్భంగా 29 ఏళ్ల సంజూ ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment