సంతోషంలో మునిగిపోయిన కావ్యా మారన్(PC: Jio Cinema/IPL X)
సన్‌రైజర్స్... ఈ ఏడాది టీ20 లీగ్‌లలో ఈ ఫ్రాంఛైజీకి బాగా కలిసి వస్తోంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్.. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లోనూ దుమ్ములేపుతోంది.
గత మూడేళ్ల వైఫల్యాలను మరిపించేలా సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో.. విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అనూహ్య రీతిలో ఆరేళ్ల తర్వాత టైటిల్ రేసులో నిలిచింది.
క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌ను 36 పరుగులతో ఓడించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. కేకేఆర్ రూపంలో ఇంకొక్క గండం దాటేస్తే ట్రోఫీని ముద్దాడే అవకాశం ముంగిట నిలిచింది.
ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ సంబరాలు అంబరాన్నంటాయి. కీలక మ్యాచ్‌లో ఆద్యంతం తన హావభావాలతో హైలైట్‌గా నిలిచారామె. ముఖ్యంగా రాజస్తాన్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను అభిషేక్ శర్మ అవుట్ చేయగానే జట్టు గెలిచినంతగా సెలబ్రేట్ చేసుకున్నారు.
Abhishek-ing things up at Chepauk, with the ball 🔥💪#TATAIPLPlayoffs #IPLonJioCinema #SRHvRR #TATAIPL #IPLinTelugu pic.twitter.com/XsOdHkMnir
— JioCinema (@JioCinema) May 24, 2024
తండ్రిని ఆలింగనం చేసుకుని
ఇక రాజస్తాన్‌పై తమ విజయం ఖరారు కాగానే ఆమె ఎగిరి గంతేశారు. తన తండ్రి కళానిధి మారన్‌ను ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు.
వేలంలో తాను అనుసరించిన వ్యూహాలు ఫలితాలు ఇస్తున్న తీరుకు మురిసిపోతూ చిరునవ్వులు చిందించారు. కరతాళ ధ్వనులతో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లను అభినందిస్తూ పట్టరాని సంతోషంతో ఉద్వేగానికి లోనయ్యారు.
Celebrations in the @SunRisers camp 🔥👏#TATAIPLPlayoffs #IPLonJioCinema #SRHvRR #TATAIPL pic.twitter.com/GAJpI7nngY
— JioCinema (@JioCinema) May 24, 2024
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ యాజమాన్యం కీలక మార్పులు చేసింది. బ్రియన్ లారా స్థానంలో న్యూజిలాండ్ స్పిన్ దిగ్గజం డానియల్ వెటోరిని ప్రధాన కోచ్‌గా నియమించింది.
ఆటతోనే సమాధానం
అదే విధంగా వన్డే ప్రపంచకప్-2023 విజేత, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు పెట్టింది. అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించి పూర్తి నమ్మకం ఉంచింది.
Plenty to cheer & celebrate for the @SunRisers 🥳
An impressive team performance to seal a place in the all important #Final 🧡
Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024
అందుకు తగ్గట్లుగానే ఈ ఆసీస్ పేసర్ జట్టును విజయపథంలో నిలిపాడు. వేలం నాటి నుంచే సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ వ్యూహాలను, కావ్య మారన్ నిర్ణయాలను విమర్శించిన వాళ్లకు అద్భుత ప్రదర్శనతో జట్టును ఫైనల్‌కు చేర్చి సమాధానమిచ్చాడు.
సౌతాఫ్రికాలో వరుసగా రెండుసార్లు
ఇదిలా ఉంటే.. 2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ పేరిట అడుగుపెట్టింది సన్‌గ్రూప్. ఐడెన్ మార్క్రమ్‌ను కెప్టెన్‌గా నియమించగా.. అరంగేట్రంలోనే జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన ఫైనల్లోనూ సన్‌రైజర్స్‌ను గెలిపించి ట్రోఫీ అందించాడు.
చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్‌ప్రైజ్.. ఇంకొక్క అడుగు: కమిన్స్
Comments
Please login to add a commentAdd a comment