ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్
రెండో క్వాలిఫయర్‌లో ఘన విజయం
36 పరుగులతో రాజస్తాన్ చిత్తు
క్లాసెన్ అర్ధ సెంచరీ, రాణించిన బౌలర్లు
రేపు తుదిపోరులో కోల్‌కతాతో ‘ఢీ’
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అసలు సత్తాను మరోసారి ప్రదర్శించింది. తొలి క్వాలిఫయర్‌లో పేలవ ఆటతో ఓటమి పాలైన జట్టు రెండో క్వాలిఫయర్‌కు వచ్చేసరికి అన్ని అ్రస్తాలతో చెలరేగింది. ఫలితంగా ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బ్యాటింగ్‌లో హెడ్, అభిõÙక్, మార్క్‌రమ్ విఫలమైనా... క్లాసెన్, త్రిపాఠి ఆదుకోవడంతో హైదరాబాద్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. ఆ తర్వాత బౌలర్లు చెలరేగి ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా కట్టిపడేశారు.
బెంగళూరుతో ఎలిమినేటర్‌లో కూడా దాదాపు ఇదే స్కోరును తడబడుతూనే ఛేదించిన రాజస్తాన్ ఈసారి మాత్రం కుప్పకూలింది. చెపాక్ మైదానంలో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు షహబాజ్, అభిõÙక్ శర్మ కలిసి 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి రాయల్స్ కథను ముగించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక తొలి క్వాలిఫయర్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయమూ వచి్చంది. రెండో టైటిల్ వేటలో ఆదివారం కోల్‌కతాతో సమరానికి సన్‌రైజర్స్ సిద్ధంగా ఉంది.
చెన్నై: ఐపీఎల్–17 ఫైనల్ సమరం కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 50; 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... రాహుల్ త్రిపాఠి (15 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. ధ్రువ్ జురేల్ (35 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మినహా అంతా విఫలమయ్యారు.
రాణించిన త్రిపాఠి...
ఓపెనర్ అభిషేక్ (12) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా... హెడ్ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. అయితే త్రిపాఠి దూకుడైన ఇన్నింగ్స్‌తో స్కోరును పరుగెత్తించాడు. అశి్వన్ ఓవర్లో వరుసగా 4, 4, 6 బాదిన అతను, బౌల్ట్ ఓవర్లోనూ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి అదే జోరులో తర్వాతి బంతికి అవుటయ్యాడు. అదే ఓవర్లో మార్క్‌రమ్ (1) కూడా పెవిలియన్ చేరాడు.
ఈ దశలో రాయ ల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హెడ్, క్లాసెన్ కూడా భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యారు. ఫలితంగా వరుసగా 29 బంతుల పాటు బౌండరీనే రాకపోగా, హెడ్ కూడా అవుటయ్యాడు. చహల్ వరుస బంతుల్లో నితీశ్ రెడ్డి (5), సమద్ (0)లను అవుట్ చేసి మరింత దెబ్బ తీశాడు. మరోవైపు 33 బంతుల్లో క్లాసెన్ అర్ధసెంచరీ పూర్తయింది. 18 ఓవర్లు ముగిశాక స్కోరు 163/6 కాగా క్లాసెన్ ఉండటంతో రైజర్స్ మరిన్ని పరుగులు ఆశించింది. అయితే 19వ ఓవర్ తొలి బంతికి క్లాసెన్ బౌల్డ్ కావడంతో ఆఖరి 11 బంతుల్లో 12 పరుగులే వచ్చాయి.
టపటపా...
ఛేదనలో రాయల్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. టామ్ కోలర్ (10) ప్రభావం చూపలేకపోగా, 5 ఓవర్లలో 32 పరుగులే వచ్చాయి. అయితే భువనేశ్వర్ వేసిన ఆరో ఓవర్లో యశస్వి జైస్వాల్ సిక్స్, 3 ఫోర్లతో చెలరేగడంతో రాజస్తాన్ దారిలో పడినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. 13 పరుగుల వ్యవధిలో జట్టు 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ముందుకొచ్చి షాట్లు ఆడే క్రమంలో యశస్వి, సామ్సన్ (10), పరాగ్ (6) వెనుదిరిగారు. అశి్వన్ (0) డకౌట్ కాగా, ఆశలు పెట్టుకున్న హెట్‌మైర్ (4) కూడా చేతులెత్తేశాడు. 39 బంతుల్లో 84 పరుగులు చేయాల్సిన స్థితిలో విండీస్ బ్యాటర్ల నుంచి రాజస్తాన్ అద్భుతం ఆశించింది. కానీ హెట్‌మైర్ (4), పావెల్ (6) విఫలం కావడంతో జట్టు గెలుపు ఆశలు కోల్పోయింది. మరోవైపు జురేల్ పోరాడినా అది ఏమాత్రం సరిపోలేదు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) అశి్వన్ (బి) సందీప్ శర్మ 34; అభిõÙక్ శర్మ (సి) కోలర్ (బి) బౌల్ట్ 12; త్రిపాఠి (సి) చహల్ (బి) బౌల్ట్ 37; మార్క్‌రమ్ (సి) చహల్ (బి) బౌల్ట్ 1; క్లాసెన్ (బి) సందీప్ 50; నితీశ్ రెడ్డి (సి) చహల్ (బి) అవేశ్ 5; సమద్ (బి) అవేశ్ 0; షహబాజ్ (సి) జురేల్ (బి) అవేశ్ 18; కమిన్స్ (నాటౌట్) 5; ఉనాద్కట్ (రనౌట్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 175.
వికెట్ల పతనం: 1–13, 2–55, 3–57, 4–99, 5–120, 6–120, 7–163, 8–170, 9–175.
బౌలింగ్: బౌల్ట్ 4–0–45–3, అశి్వన్ 4–0–43–0, సందీప్ 4–0–25–2, అవేశ్ 4–0–27–3, చహల్ 4–0–34–0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) సమద్ (బి) షహబాజ్ 42; టామ్ కోలర్ (సి) త్రిపాఠి (బి) కమిన్స్ 10; సామ్సన్ (సి) మార్క్‌రమ్ (బి) అభిõÙక్ 10; పరాగ్ (సి) అభిషేక్ (బి) షహబాజ్ 6; జురేల్ (నాటౌట్) 56; అశ్విన్ (సి) క్లాసెన్ (బి) షహబాజ్ 0; హెట్‌మైర్ (బి) అభిషేక్ 4; పావెల్ (సి) అభిõÙక్ (బి) నటరాజన్ 6; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139.
వికెట్ల పతనం: 1–24, 2–65, 3–67, 4–79, 5–79, 6–92, 7–124.
బౌలింగ్: భువనేశ్వర్ 3–0–33–0, కమిన్స్ 4–0–30–1, నటరాజన్ 3–0–13–1, ఉనాద్కట్ 1–0–5–0, షహబాజ్ 4–0–23–3, అభిషేక్ 4–0–24–2, మార్క్‌రమ్ 1–0–10–0.
2: డెక్కన్ చార్జర్స్ జట్టు తర్వాత ఐపీఎల్ టోరీ్నలో గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడున నిలిచి తర్వాతి సీజన్‌లో ఫైనల్‌కు చేరిన రెండో జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. 2023 లో సన్‌రైజర్స్ చివరి స్థానంలో నిలిచింది. 2008 తొలి సీజన్‌లో డెక్కన్ చార్జర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి 2009లో అగ్రస్థానంలో నిలవడంతోపాటు విజేతగా కూడా అవతరించింది.
3: ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 2016లో తొలిసారి విజేత అయింది. 2018లో రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment