Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అంటూ కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. టాస్ వేశాకా ఇరుజట్ల కెప్టెన్లు తమ ప్లేయింగ్ ఎలెవెన్‌తో పాటు ఐదుగురు ప్లేయర్లను సబ్‌స్టిట్యూట్‌లుగా ప్రకటించాలి. మ్యాచ్ మధ్యలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లలో ఎవరో ఒకరిని ప్లేయింగ్ ఎలెవెన్ జట్టులో ఉన్న ఆటగాడితో రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది బౌలింగ్ లేదా బ్యాటింగ్ కావొచ్చు. ఇది విరివిగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.
Photo: IPL Twitter
తాజాగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో శాంసన్ ఇంపాక్ట్ రూల్‌ను ప్రస్తావించాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల తాను కొంత కన్ఫూజన్‌కు గురవుతున్నానని.. ఐదుగురు సబ్‌స్టిట్యూట్లను ప్రకటించాల్సి రావడంతో ప్లేయింగ్ ఎలెవెన్ ఎంపికలో కాస్త గందరగోళానికి గురవతున్నట్లు పేర్కొన్నాడు. ఈ ఇంపాక్ట్ వల్ల అసలు తుది జట్టులో ఆటగాళ్లు ఎవరు ఉన్నారు.. ఎవరికి రెస్ట్ ఇచ్చామనేది చెప్పలేకపోతున్నాం. ఈ ఇంపాక్ట నిబంధన కాస్త ఇబ్బందిగానే అనిపిస్తోందన్నాడు.
ఇక ఈ సీజన్‌లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా సీఎస్‌కే ఆటగాడు తుషార్ దేశ్‌పాండే నిలిచాడు. సీజన్ తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో పోరులో సీఎస్‌కే తరపున అంబటి రాయుడు స్థానంలో తుషార్ తొలి ఇంపాక్ట ప్లేయర్‌గా వచ్చాడు. ఒక్క ఆర్‌సీబీ మినహా మిగతా అన్ని జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ఉపయోగించాయి.
The Capitals have won the toss and they elect to bowl in #RRvDC 🏏
— JioCinema (@JioCinema) April 8, 2023
Who can grab the W in today's first game? 🔍
Watch #IPLonJioCinema LIVE & FREE across all telecom operators 🙌#IPL2023 #TATAIPL | @rajasthanroyals @DelhiCapitals pic.twitter.com/GOtbmvwJpV
చదవండి: Impact Player IPL 2023 : 'ఇంపాక్ట్'తో ఒరిగిందేమి లేదు.. అవససరమా?!
Comments
Please login to add a commentAdd a comment