పులితో పరాచకాలు వద్దు! దాడి చేస్తే ఖతమే! | Viral Video: Group Of Men Try To Take Selfie With Tiger In MP | Sakshi
Sakshi News home page

Viral Video: పులితో పరాచకాలు వద్దు! దాడి చేస్తే ఖతమే!

Published Tue, Oct 11 2022 3:31 PM | Last Updated on Tue, Oct 11 2022 4:19 PM

Viral Video: Group Of Men Try To Take Selfie With Tiger In MP  - Sakshi

పులికి సంబంధించిన పలు వైరల్‌ వీడియోలు చూశాం. అచ్చం అలానే ఒక వైరల్‌ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది యువకులు పులితో సెల్ఫీ తీసుకునేందుకు దాని వెంట పడతారు. వాస్తవానికి అది పట్టించు కోకుండా రోడ్డు దాటుకుని వెళ్లిపోతుంది కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ల పని ఔట్‌. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్‌ రిజర్వ్‌లో చోటు చేసుకుంది.  

ఐతే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని భారత అటవీ శాఖ అధికారి సుశాంత్‌ నందా ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ...పులి మిమ్మల్ని వెంబడించాలనుకోలేదు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దయచేసి ప్రమాదకరమైన క్రూర మృగాలతో సెల్ఫీలు తీసుకునేందుకు యత్నించకండి. ఇలాంటి అత్యుత్సాహన్ని మానుకోండి అని యువతను హెచ్చరించారు. 

(చదవండి: 80 ఏళ్ల అష్టదిగ్గజాలు స్కైడైవింగ్‌తో... గిన్నిస్‌ రికార్డు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement