పార్వేట మండపం సమీపంలో సంచరిస్తున్న ఏనుగు
తిరుమల: తిరుమల పాపవినాశనం రోడ్డులోని పార్వేటమండపం సమీపంలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం ఏనుగుల గుంపు రోడ్డును దాటేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో రోడ్డు మీదుగా వెళుతున్న వాహనచోదకులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రాంతంలో తర చూ ఏనుగుల గుంపు సంచరిస్తోంది.
సమీపంలోని నీటి కొలనుకు వచ్చే క్రమంలో ఏనుగులు రోడ్డుపైకి, ఉద్యాన వనాల్లోకి వస్తున్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో రక్షణ గోడను, ఫెన్సింగ్‌నూ ఏనుగులు ధ్వంసం చేశాయి. అయితే ఏనుగులను తరిమేందుకు చర్యలు తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment