papavinasanam
-
తిరుమల: పాప వినాశని మార్గంలో ఏనుగుల హల్చల్
సాక్షి, తిరుమల: తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. తిరుమలలోని పాప వినాశనం మార్గంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఒక్కసారిగా గుంపు రోడ్లమీదకు వచ్చాయి. వివరాల ప్రకారం.. తిరుమలలోని పాప వినాశనం వద్ద ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. పార్వేట మండపం ప్రాంతంలో నిన్న రాత్రి చెట్లను ఏనుగులు నేల కూల్చాయి. ఏనుగుల మంద హల్ చల్ చేస్తోంది. ఈ గుంపులో మొత్తం ఏనుగులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక, ఏనుగుల సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. -
తిరుమల ఆకాశగంగ చరిత్ర మరియు పాపవినాశనం యొక్క నిజమైన కథ
-
పార్వేటమండపం సమీపంలో ఏనుగుల గుంపు కలకలం
తిరుమల: తిరుమల పాపవినాశనం రోడ్డులోని పార్వేటమండపం సమీపంలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం ఏనుగుల గుంపు రోడ్డును దాటేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో రోడ్డు మీదుగా వెళుతున్న వాహనచోదకులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రాంతంలో తర చూ ఏనుగుల గుంపు సంచరిస్తోంది. సమీపంలోని నీటి కొలనుకు వచ్చే క్రమంలో ఏనుగులు రోడ్డుపైకి, ఉద్యాన వనాల్లోకి వస్తున్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో రక్షణ గోడను, ఫెన్సింగ్‌నూ ఏనుగులు ధ్వంసం చేశాయి. అయితే ఏనుగులను తరిమేందుకు చర్యలు తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. -
కేంద్రం నుంచి సహకారం అందించే ప్రయత్నం చేస్తాం
-
ప్రాజెక్టు వివరాలు పంపితే సహకారం అందిస్తాం
సాక్షి, తిరుమల: తిరుమలలోని శ్రీవారిని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాపవినాశనం డ్యామ్‌ని రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి పరిశీలించారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనార్థం ప్రతి నిత్యం లక్షమంది భక్తులు తరలివస్తారని తెలిపారు. తిరుమలలో శాశ్వత ప్రాతిపదికన త్రాగునీటి సమస్యని పరిష్కరించేందుకు కళ్యాణి డ్యామ్ నుంచి నీటి తరలింపు ప్రకియ ప్రారంభించాలని టీటీడీ భావిస్తోందని పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం నుంచి ప్రాజెక్టు వివరాలు పంపితే కేంద్రం నుంచి సహకారం అందించే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి త్రాగునీటిని అందించే ప్రాజెక్టు కింద నిధులు కేటాయించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. చదవండి: (శిల్పారామాలకు పరిపాలనా అనుమతులు జారీ) ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తిరుమలలో శాశ్వత ప్రాతిపాదికన త్రాగునీటి సమస్యని పరిష్కరించేందుకు రాష్ర్ట ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం చేపడుతోందని తెలిపారు. టీటీడీ వాటాకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం నుంచి నివేదిక పంపితే కేంద్రం సహకారం అందిస్తామని పేర్కోందని చెప్పారు. అదే విధంగా బీజేపీ అధికారిక ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో త్రాగునీటి సమస్యని శాశ్వత పరిష్కారం అందించేందుకు కేంద్రం సహకరించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. రాష్ట్రం నుంచి నివేదిక అందితే పరిశీలిస్తామని మంత్రి షేకావత్ హామి ఇచ్చారని చెప్పారు. -
లాక్‌డౌన్‌తో పాములకు నివాసంగా దుకాణాలు
సాక్షి, చిత్తూరు: లాక్డౌన్ కారణంగా జనాలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో వన్యప్రాణులు యదేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే చాలా కాలం తరువాత కేంద్రప్రభుత్వం కొన్ని సవరణలు ఇవ్వడంతో మళ్లీ మూతబడ్డ షాపులు తెరుచుకుంటున్నాయి. తిరుమల పాపవినాశనంలోని ఒక దుకాణాన్ని 60 రోజులు తరువాత తెరిచారు. షాపు తెరిచిన వెంటనే ఒక కొండచిలువ కనిపించడంతో షాప్ యజమాని షాక్‌కు గురయ్యారు. దుకాణ యజమాని షాపుకు ఉన్న పట్టను తొలగించగా భారీ కొండ చిలువ దర్శనమిచ్చింది. లాక్డౌన్ కారణంగా 60 రోజులుగా మూతబడిన అంగళ్లను పరిశీలించడానికి యజమానులు గురువారం షాపుల వద్దకు వెళ్లారు. రెండు నెలలకు పైగా జనసంచారం లేకపోవడంతో దుకాణాల్లోనే పాములు సేద తీరుతున్నాయి. దీంతో యజమానులు భయభ్రాంతులకు గురవుతున్నారు. (వైఎస్ జయంతి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ) -
పాపవినాశనం వద్ద రోడ్డు ప్రమాదం
సాక్షి, తిరుమల : తిరుమలలోని పాపవినాశం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాపవినాశ నుంచి వస్తున్న జీపు , ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి గాయపడిన భక్తులను చికిత్స నిమిత్తం తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. జీపు డ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. -
తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం
తిరుమల: తిరుమల కొండల్లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. పాపవినాశనం మార్గంలో వేణుగోపాల స్వామి ఆలయానికి సమీపంలో అటవీ ప్రాంతంలో ఆకస్మాత్తుగా మంటలు ఎగిసి పడ్డాయి. ఆ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో అటవీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
‘పాపనాశం’లో కమల్ నిమగ్నం
నటుడు కమలహాసన్ పాపనాశం చిత్ర షూటింగ్లో పూర్తిగా లీనమైపోయాడు. ఆయన నటిస్తున్న విశ్వరూపం-2, ఉత్తమవిలన్ చిత్రాల షూటింగ్ పూర్తి కావడంతో తాజా చిత్రం పాపనాశం షూటింగ్లో పాల్గొంటున్నారు. మలయా ళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని సాధించిన దృశ్యం చిత్రానికి రీమేక్ పాపనాశం. ఈ చిత్రంతో కమల్ సరసన నటించే నటి ఎవరన్న విషయంపై శ్రీదేవి, సిమ్రాన్ మొదలగు సీనియర్ నటీమణుల పేర్లు ప్రచారమయ్యాయి. చివరికి కమల్‌తో నటించే అవకాశం నటి గౌతమికి దక్కింది. ఈ చిత్ర షూటింగ్ తిరునల్వేలి సమీపంలోని నంగునెరి, పాపనాశం ప్రాంతాలలో ముమ్మరంగ సాగుతోంది. కాగా చిత్ర షూటింగ్ విరామ సమయాల్లో కమల్ ఆ ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక పండితుల్ని, సామాజిక సేవకులను కలుసుకోవడం విశేషం. నంగునేరిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడి తోడాద్రి నాదర్ వైష్ణవ మఠాన్ని సందర్శించి మఠంలోని జీయర్ను కలుసుకున్నారు. అక్కడాయన చొక్కా తీసి ఒంటికి విబూది పూసుకోవడంతో విమర్శలు ఎదరయ్యాయి. అనంతరం కమల్ ప్రముఖ పరిశోధకుడు టీ.పరమశివంను కలిశారు. తెన్‌కాశిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన సామాజిక సేవకుడు కృష్ణను కలిసి సంభాషించారు. కమల్‌లోని ఈ మార్పునకు పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
పాపవినాశనం వద్ద అగ్ని ప్రమాదం
తిరుమలలోని పాపవినాశనం వద్ద దుకాణ సముదాయంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ శకటాలు, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు
-
శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు
చిత్తూరు : శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. పాపవినాశనం వైపు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కోరుట్ల అటవీ ప్రాంతంతో పాటు కాకులకొండల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. వేలాది ఎకరాల్లో అడవీ సంపద దగ్దం అవుతోంది. అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు టీటీడీ సిబ్బంది కూడా ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. కాగా మంటలు భారీగా వ్యాపిస్తుండటంతో పాపవినాశనం వెళ్లే వాహనాలను నిలిపివేశారు.