
శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు
చిత్తూరు : శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. పాపవినాశనం వైపు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కోరుట్ల అటవీ ప్రాంతంతో పాటు కాకులకొండల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. వేలాది ఎకరాల్లో అడవీ సంపద దగ్దం అవుతోంది. అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు టీటీడీ సిబ్బంది కూడా ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. కాగా మంటలు భారీగా వ్యాపిస్తుండటంతో పాపవినాశనం వెళ్లే వాహనాలను నిలిపివేశారు.