శేషాచలం అడవుల్లో మంటలు | forest fires in Sheshachalam | Sakshi
Sakshi News home page

శేషాచలం అడవుల్లో మంటలు

Published Sun, Apr 24 2016 1:12 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

శేషాచలం అడవుల్లో మంటలు - Sakshi

శేషాచలం అడవుల్లో మంటలు

 తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాటగంగమ్మ గుడి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతుండగా ఆదివారం మధ్యాహ్నం గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ అటవీ విభాగం సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కొంత మేర అటవీ ప్రాంతం దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement